UPSC CMS (Mains) 2022: యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష 2022కు నోటిఫికేషన్ విడుదల..
భారత ప్రభుత్వ విభాగానికి చెందిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) .. 687 అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, ఇతర పోస్టులను కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ 2022 పరీక్ష ద్వారా భర్తీ చేయడానికి ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధుల..
UPSC Combined Medical Services (Mains) Examination 2022: భారత ప్రభుత్వ విభాగానికి చెందిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) .. 687 అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, ఇతర పోస్టులను కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ 2022 పరీక్ష ద్వారా భర్తీ చేయడానికి ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై 17వ తేదీన నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ఫలితాలు ఆగస్టు 19న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలో అర్హత సాధించినవారు మాత్రమే మెయిన్స్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 28, 2022వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
- జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ సబ్-క్యాడర్ ఆఫ్ సెంట్రల్ హెల్త్ సర్వీస్ పోస్టులు: 314
- అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు: 300
- GDMO (న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్) పోస్టులు: 3
- జనరల్ డ్యూటీ మెడికల్ Gr.-II (EDMC, NDMC & SDMC) పోస్టులు: 70
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.