AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP: దేశ రాజకీయాల్లో సంచలనం.. ఎన్నికలకు ముందే లోక్‌సభ సీటు గెలుచుకున్న బీజేపీ.. ట్విస్ట్ మామూలుగా లేదుగా..

ఎన్నికల ముందే బీజేపీ తొలి లోక్ సభ సీటు గెలుచుకొని సంచలనం సృష్టించింది.. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్‌లోని ఐదు అసెంబ్లీ స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న కాషాయ పార్టీ.. తాజాగా.. లోక్ సభ ఎన్నికలు ముంగట ఒక స్థానాన్ని ఏకగ్రీవంగా గెలుచుకొని బోణి కొట్టింది. లోక్ సభ ఎన్నికల ఫలితాలకు ముందే.. సూరత్ లోక్‌సభ స్థానం చరిత్ర సృష్టించింది..

BJP: దేశ రాజకీయాల్లో సంచలనం.. ఎన్నికలకు ముందే లోక్‌సభ సీటు గెలుచుకున్న బీజేపీ.. ట్విస్ట్ మామూలుగా లేదుగా..
BJP Surat candidate Mukesh Dalal
Shaik Madar Saheb
|

Updated on: Apr 22, 2024 | 5:03 PM

Share
ఎన్నికల ముందే బీజేపీ తొలి లోక్ సభ సీటు గెలుచుకొని సంచలనం సృష్టించింది.. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్‌లోని ఐదు అసెంబ్లీ స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న కాషాయ పార్టీ.. తాజాగా.. లోక్ సభ ఎన్నికలు ముంగట ఒక స్థానాన్ని ఏకగ్రీవంగా గెలుచుకొని బోణి కొట్టింది. లోక్ సభ ఎన్నికల ఫలితాలకు ముందే.. సూరత్ లోక్‌సభ స్థానం చరిత్ర సృష్టించింది.. గుజరాత్‌లోని 26 లోక్ సభ స్థానాల్లో ఒకదానిని బీజేపీ కైవసం చేసుకుంది. ఎన్నికలకు ముందే సూరత్ సీటు బీజేపీ ఖాతాలో చేరింది. బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా విజయం సాధించారు. వాస్తవానికి, సూరత్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీ సమర్పించిన బీ ఫారంను ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థులందరూ సోమవారం తమ తమ నామినేషన్ ఫారమ్‌లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఈ సీటును పోటీ లేనిదిగా ప్రకటించారు ఎన్నికల అధికారులు.. సూరత్‌లో బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేసే 8 మంది అభ్యర్థుల్లో 7 మంది తమ ఫారమ్‌లను ఉపసంహరించుకున్నారు. దీంతో బీజేపీకి చెందిన ముఖేష్ దలాల్‌ను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. చివరగా, బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన ప్యారేలాల్ భారతి బీ ఫారమ్‌ను ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత ముఖేష్ దలాల్‌ను విజేతగా ప్రకటించారు. బీజేపీకి చెందిన ముఖేష్ దలాల్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ అభినందనలు తెలిపారు.

మూడు రోజుల హైడ్రామా తరువాత..

సూరత్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభాని నామినేషన్ ఫారమ్‌ దాఖలు చేశారు. అందులో ముగ్గురు ప్రతిపాదిత అభ్యర్థులతో సంతకాలు చేశారు. అయితే నామనేషన్ పత్రాల్లో పేర్కొన్న సంతకాలు తమవి కావంటూ జిల్లా ఎన్నికల అధికారికి మరో అఫిడవిట్ సమర్పించారు. ఈ నేపథ్యంలో ఫారమ్ దాఖలు చేసిన మూడు రోజుల వరకు హైడ్రామా నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభాని ప్రతిపాదకులుగా అతని బావమరిది జగదీష్ సవాలియా, అతని మేనల్లుడు ధృవిన్ ధమేలియా, భాగస్వామి రమేష్ పొల్లారా అభ్యర్థనను కూడా ఎన్నికల అధికారి వీడియో రికార్డింగ్ చేశారు. ప్రతిపాదకుల వాదనను అనుసరించి, ఎన్నికల అధికారి కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీకి సమాధానం ఇవ్వడానికి ఒక రోజు సమయం ఇచ్చారు. ఎన్నికల అధికారికి సమాధానమివ్వడానికి కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీ తన న్యాయవాదితో వచ్చారు. అయితే ముగ్గురు ప్రతిపాదకులలో ఒక్కరు కూడా హాజరుకాలేదు. దీంతో అతని నామినేషన్ పత్రాలను తిరస్కరిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి… ఎన్నికల అధికారికి అఫిడవిట్‌ సమర్పించారు.

గుజరాత్‌లోని మొత్తం 26 లోక్‌సభ స్థానాలకు మూడో విడతలో భాగంగా మే 7వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు సూరత్‌లో ముకేశ్‌ దలాల్‌ ఎన్నికను ఏకగ్రీవం కావడంతో . ఈ స్థానానికి పోలింగ్‌ నిర్వహించాల్సిన అవసరం లేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..