Andhra Pradesh: ఛత్తీస్‌గడ్‌ ఎన్కౌంటర్.. ఏపీ పోలీసుల ఎదుట లొంగిపోయిన టాప్ మావోయిస్టులు..

వరుస ఎన్కౌంటర్లు, అరెస్టులతో డీలాపడిన.. మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. విశాఖ రేంజ్ డీఐజీ ఎదుట ఆరుగురు మావోయిస్టులు లొంగిపోయారు. అది కూడా కీలక చత్తీస్‌గఢ్ క్యాడర్ కు చెందిన మావోయిస్టులు. లొంగిపోయిన వారిలో ఓ డిసిఎం, ముగ్గురు ఏసిఎంలు, మరో ఇద్దరు పార్టీ మెంబర్లున్నారు. లొంగిపోయిన వారంతా సౌత్ బస్తర్ డివిజన్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినవారు.

Andhra Pradesh: ఛత్తీస్‌గడ్‌ ఎన్కౌంటర్.. ఏపీ పోలీసుల ఎదుట లొంగిపోయిన టాప్ మావోయిస్టులు..
Maoists Surrender
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Apr 22, 2024 | 6:17 PM

వరుస ఎన్కౌంటర్లు, అరెస్టులతో డీలాపడిన.. మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. విశాఖ రేంజ్ డీఐజీ ఎదుట ఆరుగురు మావోయిస్టులు లొంగిపోయారు. అది కూడా కీలక చత్తీస్‌గఢ్ క్యాడర్ కు చెందిన మావోయిస్టులు. లొంగిపోయిన వారిలో ఓ డిసిఎం, ముగ్గురు ఏసిఎంలు, మరో ఇద్దరు పార్టీ మెంబర్లున్నారు. లొంగిపోయిన వారంతా సౌత్ బస్తర్ డివిజన్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినవారు. ఏపీ – ఛత్తీస్‌గఢ్ – తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో వీరంతా కీలకంగా వ్యవహరించినవారే కావడం విశేషం.. లొంగిపోయిన వారిలో డివిజనల్ కమిటీ మెంబర్ కుహరం మిథిలేస్ అలియాస్ రాజు, ఏసీఎంలు బరసే మాస, వెట్టి బీమా, వంజం రామే అలియాస్ కమల, పార్టీ మెంబర్లు మడకం సుక్కి, దూడి సోనీ ఉన్నారు. డివిజనల్ కమిటీ మెంబర్ కుహరం మిథిలేస్ అలియాస్ రాజు.. కిష్టారం ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. అతని తలపై ఐదు లక్షల రివార్డు ఉంది. గత 18 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న మిథిలేస్.. ఏపీ, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో నాలుగు ఎదురుకాల్పుల్లో పాల్గొన్నాడు. 14 మంది జవాన్లను హతమార్చిన కీలకమైన బుర్కా పాల్ ఘటనతో సహా.. మూడు హత్యలతో పాటు 30 కి పైగా ఘటనల్లో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇక ఏరియా కమిటీ సభ్యుడు బరిసే మాసపై నాలుగు లక్షల రివార్డు ఉంది. ఏపీ, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల రాష్ట్రాల సరిహద్దుల్లో మూడు ఎదుర్కొల్పులు రెండు పోలీసు బలగాలపై దాడులు సహా మూడు హత్యలు.. 20 కి పైగా ఘటనల్లో పాల్గొన్నాడు. మరో ఏరియా కమిటీ మెంబర్ భీమా పై నాలుగు లక్షల రివార్డు ఉంది. ఏపీ, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల బోర్డర్ లో నాలుగు ఎదురుకాల్పులతో పాటు రెండు పోలీస్ బాలగాలపై దాడుల సహా 25 కు పైగా ఘటనల్లో పాల్గొన్నాడు.

రిక్రూట్మెంట్లో ప్రధాన పాత్ర..

ఏసీఎం వంజం రామే అలియాస్ కమలపై నాలుగు లక్షల రివార్డు ఉంది. ఈమె జనాతన సర్కార్ కమిటీలో పనిచేస్తూ మావోయిస్టు పార్టీ రిక్రూట్మెంట్ లో కీలక పాత్ర పోషించింది. ఇక పార్టీ మెంబర్ మడకం సుక్కి తలపై లక్ష రివార్డు ఉంది.. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో పదికిపైగా ఘటనలో పాల్గొంది. దూడి సోనీ.. మావోయిస్టు పార్టీ రిక్రూట్మెంట్లో ప్రధాన పాత్ర పోషించిందని పోలీసులు తెలిపారు.

సరెండర్‌కు కారణమిదే..

దళంపై విరక్తితో పాటు.. స్థానికంగా ప్రజల మద్దతు లేకపోవడం ఏపీలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు సహాయ పునరావాస పాలసీలకు ఆకర్షితులై ఛత్తీస్‌గఢ్ నుంచి మావోయిస్టులు లొంగిపోయారని అంటున్నారు డిఐజి విశాల్ గున్ని.. ఛత్తీస్‌గఢ్ లో ఎన్కౌంటర్ తో పాటు ఆ ప్రాంత కేడర్ కు చెందిన ఆరుగురు మావోయిస్టుల లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ బలహీన పడుతుందని అన్నారు. భద్రతా బలగాలు పోలీసుల వ్యూహాత్మక విధానాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని.. వాటిని ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ తో మరింత విస్తృతం చేస్తామన్నారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులో జనంలోకి రావాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల కోసం..

వచ్చే ఎన్నికల కోసం అన్ని విధాల సిద్ధమవుతున్నామని డిఐజి విశాల్ గున్ని పేర్కొన్నారు. కీలక ప్రాంతాలపై నిఘా పెట్టి.. ఏరియా డామినేషన్ చేస్తున్నామని అన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక దృష్టిసారించామని చెప్పారు డిఏజీ.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..