BJP: కిషన్ రెడ్డికి మరో ఛాలెంజింగ్ టాస్క్.. కేంద్ర మంత్రికి సవాళ్ల స్వాగతం..!

లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. మళ్లీ ఐదేళ్ల వరకు లోక్‌సభ ఎన్నికలు లేవు. అయినా మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఆర్టికల్ 370 రద్దు చేయడానికి ముందు నుంచి రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్ము-కాశ్మీర్ సహా మరికొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ (BJP) అగ్రనాయకత్వం.. అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సమాయత్తమైంది. ఆయా రాష్ట్రాలకు ఎన్నికల ఇంచార్జులు, సహ ఇంచార్జులుగా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బాధ్యతలు అప్పగించింది.

BJP: కిషన్ రెడ్డికి మరో ఛాలెంజింగ్ టాస్క్.. కేంద్ర మంత్రికి సవాళ్ల స్వాగతం..!
Union Minister Kishan Reddy
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 17, 2024 | 3:50 PM

లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. మళ్లీ ఐదేళ్ల వరకు లోక్‌సభ ఎన్నికలు లేవు. అయినా మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఆర్టికల్ 370 రద్దు చేయడానికి ముందు నుంచి రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్ము-కాశ్మీర్ సహా మరికొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ (BJP) అగ్రనాయకత్వం.. అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సమాయత్తమైంది. ఆయా రాష్ట్రాలకు ఎన్నికల ఇంచార్జులు, సహ ఇంచార్జులుగా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బాధ్యతలు అప్పగించింది. తద్వారా కేంద్ర ఎన్నికల సంఘం (ECI) ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను ఖరారు చేసే సమయానికే ఎన్నికల రణరంగంలో ప్రత్యర్థుల కంటే నాలుగు అడుగులు ముందుండాలని చూస్తోంది. ఆయా రాష్ట్రాల్లో పార్టీ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాల విషయంలో ఎన్నికల ఇంచార్జులు కీలకం కానున్నారు. ప్రదేశ్ చునావ్ ప్రభారీ (రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి) పేరుతో ప్రతి రాష్ట్రానికి బీజేపీ ఇంచార్జులను నియమిస్తూ ఉంటుంది. ఆయా రాష్ట్రాల వ్యవహారాలు చూసుకునే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులకు అదనంగా ఎన్నికల ఇంచార్జులు అక్కడ ఉండి పార్టీని గెలిపించేందుకు వ్యూహాలు, ప్రణాళికలు అమలు చేయాల్సి ఉంటుంది.

ఏ రాష్ట్రానికి ఎవరు?

బీజేపీ హైకమాండ్ మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌తో పాటు జమ్మూ – కాశ్మీర్‌ రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లు, కో-ఇన్‌చార్జ్‌లను నియమించింది. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిన మహారాష్ట్రకు పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ను ఇన్‌ఛార్జ్‌గా నియమించగా, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు కో-ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించింది. ఈ రాష్ట్రంలో 2019లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) 48 స్థానాలకు 41 చోట్ల గెలుపొంది పూర్తి ఆధిక్యతను చాటింది. కానీ తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కేవలం 17 సీట్లలో మాత్రమే గెలుపొందింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ సారథ్యంలోని (I.N.D.I.A) కూటమి ఆధిక్యతను ప్రదర్శించి 30 స్థానాల్లో గెలుపొందగా, ఈ రెండు కూటముల్లో లేని ఓ స్వతంత్ర అభ్యర్థి 1 స్థానంలో గెలుపొందారు. ఈ రాష్ట్రంలో తగ్గిన స్కోర్ జాతీయస్థాయిలో ఎన్డీఏ స్కోరును కూడా ప్రభావితం చేసింది. పైపెచ్చు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ – శివసేన కలిసి పోటీ చేసి గెలుపొందగా, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఎన్నికల అనంతరం కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లతో జట్టుకట్టి మహా వికాస్ అఘాడీ పేరుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు బీజేపీ చేపట్టిన ఆపరేషన్‌తో శివసేనలో చీలిక తీసుకొచ్చి ఏక్‌నాథ్ షిండేను ముఖ్యమంత్రిని చేసింది. కొన్నాళ్ల తర్వాత శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని కూడా చీల్చింది. ఆ రెండు పార్టీల చీలిక వర్గాలతో కలిసి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినా ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన సొంత బలంతో గెలుపొందడం సాధ్యం కాదు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందాలంటే బలమైన మిత్రపక్షం అవసరం. అందుకే ఈ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జిగా సీనియర్ నేత భూపేంద్ర యాదవ్‌కు హైకమాండ్ బాధ్యతలు అప్పగించింది.

హర్యానా రాష్ట్రానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమించగా, బిప్లవ్ కుమార్ దేవ్‌కు కో-ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు అప్పగించింది. మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను జార్ఖండ్‌కు ఇంచార్జ్‌గా బాధ్యతలు అప్పగించగా.. ఈ రాష్ట్రంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మకు కో-ఇన్‌చార్జ్ పాత్ర అప్పగించింది. కీలకమైన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఎన్నికల ఇంచార్జ్‌గా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని బీజేపీ తెలిపింది.

కిషన్ రెడ్డి ముంగిట సవాళ్లు

జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఆ రాష్ట్రం నుంచి లద్దాఖ్ ప్రాంతాన్ని వేరు చేసిన విషయం తెలిసిందే. లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, మిగతా జమ్ము-కాశ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. ఇందులో పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ (POK)లో కూడా కొన్ని నియోజకవర్గాలను ప్రకటించిస్తూ అసెంబ్లీని పునర్వ్యవస్థీకరించింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ద్వారా రాష్ట్రపతి పాలన నడుస్తోంది. ఈ రాష్ట్రానికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించాలంటూ సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలవగా.. త్వరలోనే రాష్ట్ర హోదా కల్పిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. ఈ రాష్ట్ర హోదాతో సంబంధం లేకుండా అక్కడి అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించే విషయంలోనూ పిటిషన్లు దాఖలవగా.. లోక్‌సభ ఎన్నికల తర్వాత అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తామంటూ కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ మేరకు మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాలతో పాటు జమ్ము-కాశ్మీర్‌కు ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది.

ఆర్టికల్ 370 రద్దు చేసిన సమయంలో కాశ్మీర్ లోయ పూర్తి అల్లకల్లోలంగా మారింది. ఏడాది కాలం పాటు ఆ రాష్ట్రంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాల్సి వచ్చిందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిత్యం ఘర్షణలతో అట్టుడుకిన ఆ ప్రాంతంలో మెల్లమెల్లగా శాంతి నెలకొంది. మారిన కాశ్మీర్ కనిపిస్తోంది. అభివృద్ధి పట్టాలెక్కింది. పర్యాటకం ఒక్కసారిగా ఊపందుకుంది. ఆ ప్రాంత ప్రజల్లో సైతం మార్పు సానుకూల దృక్పథాన్ని పెంచింది. అయితే ఇదంతా చూసి ఓర్వలేని పాకిస్తాన్.. కుట్రలు చేస్తూనే ఉంది. తమ భూభాగంపై శిక్షణ ఇచ్చి, అధునాతన మారణాయుధాలు సమకూర్చి ఉగ్రవాదులను మన భూభాగంపైకి పంపుతోంది. ఇంతకాలం పాటు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్న సీమాంతర ఉగ్రవాదులు, ఈ మధ్య జమ్ము ప్రాంతంలో యాత్రికులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు.

భౌగోళికంగా హిందూ, సిక్కు ప్రజలు ఎక్కువగా ఉన్న జమ్ములో భారతీయ జనతా పార్టీ (BJP) ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమస్య పెద్దగా లేకపోయినా, అత్యధిక శాతం ముస్లిం జనాభా కల్గిన కాశ్మీర్ లోయ కాషాయ దళానికి సవాళ్లు విసురుతోంది. ఆ పార్టీ తరఫు ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారిని ఉగ్రవాదులు వెంటాడి హతమార్చుతున్నారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడం బీజేపీకి అసలు సిసలు సవాలుగా మారింది. ఇలాంటప్పుడు బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించడం, వ్యూహాలు, ప్రణాళికలను అమలు చేయడం కూడా అంత సులభమేమీ కాదు. అలాంటి రాష్ట్రానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని బీజేపీ హైకమాండ్ ఎన్నికల ఇన్‌చార్జిగా నియమించింది. గతంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేసిన కిషన్ రెడ్డి, ఈ రాష్ట్రంపై గట్టి పట్టు సాధించారు. పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఆయన అక్కడే ఉండి ఎన్నికల వ్యూహాలు అమలు చేశారు. గతానుభవాలను దృష్టిలో పెట్టుకున్న బీజేపీ హైకమాండ్.. అసెంబ్లీ ఎన్నికల బాధ్యతల్ని కూడా ఆయన భుజాలపై మోపింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగనున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు సవాళ్లతో కిషన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.

Latest Articles
బీఎస్-4 వాహన సమస్యలకు ఎల్‌పీజీతో చెక్..కన్వెర్షన్‌తోనే సమస్య ఫసక్
బీఎస్-4 వాహన సమస్యలకు ఎల్‌పీజీతో చెక్..కన్వెర్షన్‌తోనే సమస్య ఫసక్
పాలసీదారులు అప్రమత్తంగా ఉండాలి.. హెచ్చరించిన ఎల్ఐసీ.. ఎందుకంటే..
పాలసీదారులు అప్రమత్తంగా ఉండాలి.. హెచ్చరించిన ఎల్ఐసీ.. ఎందుకంటే..
సీన్ సీన్‌కు సుస్సు పడాల్సిందే.. దైర్యముంటేనే ఈ సినిమా చూడండి..
సీన్ సీన్‌కు సుస్సు పడాల్సిందే.. దైర్యముంటేనే ఈ సినిమా చూడండి..
ఆ జిల్లాలో రైతుల ఆందోళన.. లాజిక్ వింటే షాక్ అవ్వాల్సిందే..
ఆ జిల్లాలో రైతుల ఆందోళన.. లాజిక్ వింటే షాక్ అవ్వాల్సిందే..
టీమిండియాకు ఐసీసీ గుడ్ న్యూస్.. సెమీస్‌లో విజయం మనదే!
టీమిండియాకు ఐసీసీ గుడ్ న్యూస్.. సెమీస్‌లో విజయం మనదే!
జూలైలో భారత్‌లో టాప్ కంపెనీల కార్స్ బైక్స్ లాంచ్..!
జూలైలో భారత్‌లో టాప్ కంపెనీల కార్స్ బైక్స్ లాంచ్..!
హైదరాబాద్‌లో దారుణం.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో యవకుడు బలి!
హైదరాబాద్‌లో దారుణం.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో యవకుడు బలి!
నేతాజీ గురించి తెలుసుకోవాలని ఉందా.? ఇది మీ కోసమే..
నేతాజీ గురించి తెలుసుకోవాలని ఉందా.? ఇది మీ కోసమే..
సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌ వర్షంతో రద్దయితే.. ట్రోఫీ గెలిచేది.?
సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌ వర్షంతో రద్దయితే.. ట్రోఫీ గెలిచేది.?
ఆ సంస్థల్లో ఎఫ్‌డీలపై వడ్డీ జాతర..!
ఆ సంస్థల్లో ఎఫ్‌డీలపై వడ్డీ జాతర..!