Kashmir Terror: అందర్నీ చంపేయాలనే కసి వారిలో కనిపించింది.. కశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పులు.

Kashmir Terror: అందర్నీ చంపేయాలనే కసి వారిలో కనిపించింది.. కశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పులు.

Anil kumar poka

|

Updated on: Jun 17, 2024 | 12:31 PM

జూన్‌ 9వ తేదీన రియాసీ జిల్లాలో శివఖోరి ఆలయం నుంచి కట్రాలోని మాతా వైష్ణోదేవి మందిరానికి వెళ్తున్న ప్రయాణికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా.. దాడి నుంచి తప్పించే క్రమంలో వాహనం లోయలో పడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోగా, 41 మంది గాయపడ్డారు. క్షతగాత్రులంతా జమ్మూలో చికిత్స తీసుకున్న అనంతరం స్వస్థలాలకు వెళ్లిపోయారు.

జూన్‌ 9వ తేదీన రియాసీ జిల్లాలో శివఖోరి ఆలయం నుంచి కట్రాలోని మాతా వైష్ణోదేవి మందిరానికి వెళ్తున్న ప్రయాణికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా.. దాడి నుంచి తప్పించే క్రమంలో వాహనం లోయలో పడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోగా, 41 మంది గాయపడ్డారు. క్షతగాత్రులంతా జమ్మూలో చికిత్స తీసుకున్న అనంతరం స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నీలం ఆరోజు జరిగిన సంఘటనను శుక్రవారం వివరించారు. కాల్పుల సమయంలో తాను కూడా బస్సులోనే ఉన్నాననీ, లోయలో పడిన తర్వాత కూడా ఉగ్రవాదులు పైనుంచే తూటాల వర్షం కురిపించారన్నారు. వారి తీరు చూస్తుంటే.. అందర్నీ చంపేయాలనే కసి ఉన్నట్లు కనిపించిందని ఆమె పేర్కొన్నారు.

జమ్మూకశ్మీర్‌లో ఇటీవల వరుసగా జరుగుతున్న ఉగ్రదాడుల నేపథ్యంలో శుక్రవారం అక్కడి శాంతి భద్రతల పరిస్థితిని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమీక్షించారు. గత నాలుగు రోజుల్లో రియాసీ, కఠువా, డోడా జిల్లాల్లోని నాలుగు ప్రదేశాల్లో ఉగ్రవాదులు దాడులు చేసి తొమ్మిది మంది యాత్రికులను, ఓ సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ను హత్య చేసారు. ప్రస్తుతం కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితిపై ఉన్నతాధికారులు.. షాకు వివరించారు. దీంతో ఆదివారం కశ్మీర్‌పై ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు షా సూచించారు. ఈ భేటీలో జాతీయ భద్రతాసలహాదారు అజీత్‌ దోభాల్, జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు పాల్గొంటారని అధికారులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.