BJP Lotus: అయ్యో.. అయ్యో.. అయ్యయ్యో..! కేంద్రంలో పవర్‌లో ఉన్న ఫ్లవర్‌కే రక్షణ లేకపాయే!
దేవుని గుడుల్లో.. ఆలయాల కొలునుల్లో ఎక్కువగా కనిపించే కమలాలు.. దేవుని పూజకు ప్రత్యేకంగా కూడా వాడతారు. అలాంటి కమలం పువ్వులకు ఇప్పుడు బీజేపీ నేతల నుంచే ప్రమాదం పొంచి ఉందట.
BJP Election Symbol Lotus: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ(BJP) గుర్తు కమలం పువ్వు. ఈ లోటస్ ఫ్లవర్(Lotus Flowers)తోనే దేశంలో రెండోసారి అధికారాన్ని చేపట్టింది బీజేపీ. కమలం పువ్వును కోటు జేబుకు పెట్టుకుని తరుచుగా కనపడతారు మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi). దేవుని గుడుల్లో.. ఆలయాల కొలునుల్లో ఎక్కువగా కనిపించే కమలాలు.. దేవుని పూజకు ప్రత్యేకంగా కూడా వాడతారు. అలాంటి కమలం పువ్వులకు ఇప్పుడు బీజేపీ నేతల నుంచే ప్రమాదం పొంచి ఉందట. అది కూడా భారతీయ జనతా పార్టి జాతీయ ప్రధాన కార్యాలయంలోనే..
సెంట్రల్ ఢిల్లిలోని పండిత్ దీన్ దయాల్ రోడ్డులో కొత్తగా నేషనల్ హెడ్‌క్వార్టర్ నిర్మించుకుంది భారతీయ జనతా పార్టీ. అత్యాధునిక హంగులతో ప్రధాని మోడీ అభిరుచులకు అనుగుణంగా ఈ భారీ భవనాన్ని నిర్మించారు. అయితే, జాతీయ పార్టీ అఫీస్‌లో కమలం పువ్వులు ఉంటే బాగుంటుందనే ఐడియా పార్టీ అధిష్టానానికి వచ్చింది. అంతే.. అనుకున్నది జరిగిపోయింది. వెంటనే పార్టీ కార్యాలయం మధ్యలో చిన్న కొలను ఎర్పాటు చేశారు. అందులో కమలం పూవ్వులను పెంచుతున్నారు కషాయం నేతలు.
దేశంలో అధికారంలో ఉన్న పార్టీ తలుచుకుంటే కమలం పువ్వులు పూయించడం ఓ లెక్కనా… మంచి గార్డెనర్‌ని నియమించి పని మెదలు పెట్టారు. అధిష్టానం అనుకున్నట్లుగానే బీజేపీ కార్యాలయంలో కమలం పువ్వులు వికసింపజేశారు. అఫీస్‌లో అదో అట్రాక్షన్‌గా మారింది. అక్కడే అసలు చిక్కులు మెదలయ్యాయి. పార్టీ కార్యాక్రమం జరిగిన ప్రతిసారి కార్యకర్తలు, నేతలు ఆ పువ్వులను కోయడం వాటితో ఫోటోలు దిగడం అలవాటుగా మారింది. వివిద రాష్ట్రాల కార్యకర్తలు, జాతీయ నేతలను కలవడానికి వచ్చినప్పుడు కూడా ఈ కమలం పువ్వులను కోసి వారికి బోకేలుగా ఇవ్వడం మెదలుపెట్టారు.
దీంతో ఎంతో ఇష్టంగా కమలం పార్టీ కార్యాలయంలో ఎర్పాటుచేసిన కొలను వెలవెలబోయింది. దీంతో పార్టీ కార్యవర్గ కమలం పువ్వులను కాపాడేందుకు గట్టి చర్యలు చేపట్టింది. కమలం పువ్వుల కొలను చుట్టు కంచెను ఎర్పాటుచేశారు. అక్కడికి ఎవరువెళ్ళకుండా ఇద్దరు సెక్యురిటిగా కూడా పెట్టారు. కమలం పార్టీలో కమలం పువ్వులకే ఇలా బద్రత ఎర్పాటుచేయాల్సిన పరిస్థితి వచ్చింది.
Read Also…. Aam Aadmi party: తెలంగాణపై కన్నేసిన అరవింద్ కేజ్రీవాల్.. ఉద్యమ నేతకు పార్టీ పగ్గాలు అప్పగించే యోచనలో ఆప్!