AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India-Australia FTA 2022: భారత్‌-ఆస్ట్రేలియా వాణిజ్య ఒప్పందం ముఖ్యాంశాలివే! 5-7 ఏళ్లలో దాదాపు 10 లక్షల ఉద్యోగాలు..

భారత, ఆస్ట్రేలియాల మధ్య శనివారం (ఏప్రిల్ 3) ఆర్థిక సహకార, వాణిజ్య ఒప్పందం (ECTA) కుదిరింది. దీంతో భారత్‌కు చెందిన జౌళి, తోలు, ఫర్నిచరు, ఆభరణాలు, మెషినరీ వంటి 6,000కు..

India-Australia FTA 2022: భారత్‌-ఆస్ట్రేలియా వాణిజ్య ఒప్పందం ముఖ్యాంశాలివే! 5-7 ఏళ్లలో దాదాపు 10 లక్షల ఉద్యోగాలు..
India Australia Fta
Srilakshmi C
|

Updated on: Apr 03, 2022 | 3:38 PM

Share

India-Australia sign trade pact: భారత, ఆస్ట్రేలియాల మధ్య శనివారం (ఏప్రిల్ 3) ఆర్థిక సహకార, వాణిజ్య ఒప్పందం (ECTA) కుదిరింది. దీంతో భారత్‌కు చెందిన జౌళి, తోలు, ఫర్నిచరు, ఆభరణాలు, మెషినరీ వంటి 6,000కు పైగా వస్తువులకు డ్యూటీ-ఫ్రీ సదుపాయాన్ని ఆస్ట్రేలియా అందించనుంది. ఈ ఒప్పందం 4 నెలల్లోగా అమలు అవుతుందని అంచనా. శనివారం జరిగిన వర్చువల్‌ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ల సమక్షంలో ఈ ఒప్పందంపై భారత వాణిజ్య మంత్రి, పీయూశ్‌ గోయల్‌ (piyush goyal), ఆస్ట్రేలియా వాణిజ్య, పర్యాటక, పెట్టుబడుల మంత్రి డాన్‌ టెహాన్‌లు సంతకాలు చేశారు. తాజా ఒప్పందం వల్ల వచ్చే అయిదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుతమున్న 27.5 బిలియన్‌ డాలర్ల నుంచి 45-50 బి.డాలర్లకు చేరుతుందని గోయల్‌ పేర్కొన్నారు. రానున్న 5-7 ఏళ్లలో దాదాపు 10 లక్షల ఉద్యోగాలు రావొచ్చని తెలిపారు. ఒప్పందం అమల్లోకి వచ్చిన రోజు నుంచే ఎగుమతుల్లో 96.4%(విలువపరంగా) వస్తువులకు సున్నా సుంకం(డ్యూటీ ఫ్రీ)ను అందజేస్తుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో చాలా వరకు భారత వస్తువులపై 4-5% సుంకం వర్తిస్తోంది.

ఆస్ట్రేలియాకూ ప్రయోజనాలు..: ఆస్ట్రేలియా నుంచి దిగుమతి అయ్యే వాటిలో 85% వరకు వస్తువులకు సున్నా సుంకాన్ని(జీరో డ్యూటీ యాక్సెస్‌) భారత్‌ అమలు చేస్తుంది. బొగ్గు, ఉన్ని, ఎల్‌ఎన్‌జీ, అల్యూమినియం, మాంగనీసు, కాపర్‌, టైటానియం, జిర్కోనియం వంటివి ఇందులో ఉంటాయి. ఆస్ట్రేలియా నుంచి ఎక్కువగా ముడి పదార్థాలు, ఇంటర్మీడియటరీలను మన పరిశ్రమలు దిగుమతి చేసుకుంటాయి. చౌక ముడి పదార్థాలు పొందడం ద్వారా ఉక్కు, అల్యూమినియం, ఫ్యాబ్రిక్‌/గార్మెంట్ల వంటి రంగాలు మరింత పోటీతత్వాన్ని పెంచుకోవడానికి వీలవుతుంది. అయితే కొన్ని సున్నిత రంగాలను కాపాడుకోవడం కోసం పాలు, పాల ఉత్పత్తులు, బొమ్మలు, ప్లాటినం, గోధుమ, బియ్యం, బంగారం, వెండి, ఆభరణాలు, వైద్య పరికరాలు, ముడి ఇనుము వంటి వాటి సుంకం విషయంలో భారత్‌ ఎటువంటి మినహాయింపులను ఇవ్వడం లేదు.

చెఫ్‌లు, యోగా శిక్షకులకు అవకాశాలు: సేవల రంగంలో భారత విద్యార్థులకు చదువు అనంతరం 2-4 ఏళ్ల వర్క్‌ వీసాలు, యువ వృత్తినిపుణులకు వర్క్‌, హాలిడే వీసాలు తదితర ప్రయోజనాలను భారత్‌ పొందనుందని గోయల్‌ పేర్కొన్నారు. దేశీయ ఐటీ కంపెనీలు ఎదుర్కొంటున్న ద్వంద్వ పన్నుల సమస్యను పరిష్కరించడానికి ఆస్ట్రేలియా అంగీకరించడం విశేషం. తాజా ఒప్పందం వల్ల దేశీయ చెఫ్‌లు, యోగా శిక్షకులకు కొత్త అవకాశాలు వస్తాయని గోయల్‌ పేర్కొన్నారు. అర్హత గల, భారత సంప్రదాయ చెఫ్‌లు, యోగా గురువులకు ఏటా 1800 వరకు వీసాల కోటాను ఆస్ట్రేలియా ఇవ్వడమే ఇందుకు నేపథ్యం. కాంట్రాక్టువల్‌ సర్వీస్‌ సప్లయర్స్‌ జాబితాలో దేశం చేరడంతో 4 ఏళ్ల వరకు తాత్కాలిక ప్రవేశం, నివాసం.. ఆ తర్వాతా కొనసాగడానికి అవకాశం వచ్చినట్లు ఉంటుంది. ఏడాది పాటు 1000 మంది భారతీయులకు (18-30 ఏళ్లు) వర్క్‌, హాలిడే వీసాలను ఇవ్వనున్నారు. వీటితో పాటు వచ్చే ఏడేళ్లలో ఉల్లి, బ్లూబెర్రీ, రాస్‌బెర్రీ, బ్లాక్‌బెర్రీ వంటి వాటిపై ఉన్న 30 శాతం సుంకాలను ఆస్ట్రేలియా ఎత్తివేయనుంది.

Also Read:

BECIL Jobs 2022: బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌లో 86 ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండానే..