AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vice President Election 2025: ఉప రాష్ట్రపతి ఓటింగ్‌కు దూరంగా బీఆర్ఎస్, బీజేడీ పార్టీలు.. ఎందుకంటే?

ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఈ రోజు (మంగళవారం) ఉదయం 10 గంటల నుంచి మొదలయ్యాయి. సాయంత్రం 5 వరకు కొత్త పార్లమెంట్‌ భవనంలో సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఓటింగ్‌ జరనుంది. ఆ తర్వాత ఇదే రోజు సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజేతను ప్రకటిస్తారు. అయితే ఉభయ సభల్లో..

Vice President Election 2025: ఉప రాష్ట్రపతి ఓటింగ్‌కు దూరంగా బీఆర్ఎస్, బీజేడీ పార్టీలు.. ఎందుకంటే?
BJD, BRS, Akali Dal abstain vice-presidential election
Srilakshmi C
|

Updated on: Sep 09, 2025 | 12:06 PM

Share

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 9: భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఈ రోజు (మంగళవారం) ఉదయం 10 గంటల నుంచి మొదలయ్యాయి. సాయంత్రం 5 వరకు కొత్త పార్లమెంట్‌ భవనంలో సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఓటింగ్‌ జరనుంది. ఆ తర్వాత ఇదే రోజు సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజేతను ప్రకటిస్తారు. పార్లమెంటు ఉభయసభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సభ్యుల సంఖ్య 788. ఇందులో ఏడు స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం మొత్తం ఎలక్టోర్ల సంఖ్య 781కు చేరింది. ఇందులో లోక్‌సభ నుంచి 542, రాజ్యసభ నుంచి 239 ఓట్లు ఉన్నాయి.

అయితే ఇందులో బీఆర్‌ఎస్‌ (4) ఓటింగ్‌లో పాల్గొనడం లేదని ఇప్పటికే ప్రకటించింది. ఇక ఏడుగురు ఎంపీలున్న బిజు జనతాదళ్‌ (BJD) ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. శిరోమణి అకాలీదళ్‌, జోరమ్‌ పీపుల్స్‌ మూమెంట్ (మిజోరం) వంటి పార్టీలకు ఒక్కో సభ్యులున్నారు. వీరు కూడా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. దీంతో ఈ పోలింగ్‌లో 386 ఓట్లు దక్కించుకున్నవారు విజేతగా నిలవనున్నారు.

తమిళనాడుకు చెందిన ఎన్డీయే అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్‌, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్‌ రెడ్డి ఇండియా కూటమి నుంచి బరిలో ఉన్నారు. ఎన్డీఏకు లోక్‌సభలో 293, రాజ్యసభలో 129 సభ్యులు ఉన్నారు. ఉభయసభల్లో ఎన్డీఏ సంఖ్యా బలం మొత్తం 422. ఎన్డీఏకు అవసరమైన మెజారిటీ కంటే 28 ఓట్లు ఎక్కువగా ఉంది. ఏపీ నుంచి సీపీ రాధాకృష్ణన్‌కి 36 మంది ఎంపీలు మద్దతు ఇస్తున్నారు. ఈ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్ ఇవాళ, రేపు ఢిల్లీలోనే పర్యటించనున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక పర్యవేక్షణతో పాటు, కేంద్ర మంత్రులతో భేటి అయ్యే అవకాశం ఉంది. అటు ఏపీ మంత్రి లోకేష్ కూడా ఢిల్లీలోనే పర్యటించనున్నారు. ఎంపీలతో మంత్రాంగం, కేంద్రం మంత్రులతో భేటి అయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి