కోడలిని చూసేందుకు వచ్చిన వ్యక్తిని కొట్టి చంపిన దుండగులు.. మృతదేహాన్ని ఏం చేశారంటే?
యువకుడి మృతితో ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. మృతి వార్త తెలియగానే కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా నేరస్తుల్లో మార్పు రావడంలేదు.. రోజుకో చోట దారుణాలకు పాల్పడుతున్నారు. బీహార్‌లో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తిని కొట్టి చంపి, తరువాత అతని మృతదేహాన్ని ఊరి బయట పడేశారు. ఈ హత్య ఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది.
కేసు బెగుసరాయ్‌లోని బక్రీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఒక వ్యక్తిని దుండగులు అందరు కలిసి కొట్టి చంపారు. ఆ వ్యక్తి తన కోడలిని కలవడానికి వెళ్లాడు. దుండగులు అతనిపై దాడి చేశారు. మృతుడు రతన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవీన్ షాగా గుర్తించారు. వ్యక్తి వయస్సు 40 ఏళ్లు ఉంటుందని తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నవీన్ షాని హత్య చేసి, అతని మృతదేహాన్ని విసిరివేశారు. మరణించిన వ్యక్తి నవీన్ షా ధంతేరస్ రోజున తన కోడలిని కలిసేందుకు సలానా గ్రామానికి వెళ్లాడు. ఈ సమయంలో నేరస్థులు అతన్ని కొట్టి చంపారు. ఇదే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
యువకుడి మృతితో ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. మృతి వార్త తెలియగానే కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీంతో నవీన్ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మరోవైపు, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు నిర్వహిస్తున్నారు.
ఈ హత్యకు సంబంధించిన సమాచారం అందిందని పోలీసు అధికారి తెలిపారు. అనంతరం స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తన కోడలిని కలవడానికి వచ్చిన వ్యక్తిని తప్పుగా భావించిన దుండగులు హత్య చేశారు. సమాచారం అందుకున్న అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..