కోపంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. !
25 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం ఘటనతో అమరావతి నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కేసు నమోదు చేసిన పోలీసలు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.
దీపావళి రోజున మహారాష్ట్రలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. 25 ఏళ్ల యువతిపై సామూహిక లైంగిక దాడి జరిగింది. కోపంతో ఇంటి నుంచి బయటకు వచ్చిన యువతిపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన అమరావతి నగరంలోని గాడ్గేనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీంతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మొత్తం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
25 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం ఘటనతో అమరావతి నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. యువకులు కారులో కూర్చొని మద్యం సేవించి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులంతా అమరావతి నగర వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని మనోజ్ డోంగ్రే (29), అక్షయ్ సర్దార్ (29), అజయ్ లోఖండే (28), మిలింద్ దహత్ (30), ప్రీతమ్ ధడ్సే (19)లుగా గుర్తించారు.
అమరావతిలోని విలాస్‌నగర్ ప్రాంతానికి చెందిన యువతి, తల్లితో గొడవపడి రాత్రి 10:30 గంటల ప్రాంతంలో గాడ్గే నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని షెగావ్ నాకా ప్రాంతానికి చేరుకుంది. ఈ ప్రదేశంలో బైక్ వస్తుండగా చేయి చూపి అతన్ని ఆపింది యువతి. దీంతో ఆమెకు లిఫ్ట్ ఇస్తామన్న నెపంతో, ఇద్దరు యువకులు బైక్‌పై వెళుతుండగా, ఆమె కూడా బైక్‌పై కూర్చుంది. ఆ తర్వాత ముగ్గురూ నందగావ్ పేట మార్గంలో వెళ్లిపోయారు. మార్గమధ్యంలో ఓ బార్‌లో మద్యం కొనుగోలు చేసిన యువకులు, మరో ముగ్గురు స్నేహితులను పిలిచారు. ముగ్గురు స్నేహితులు నాలుగు చక్రాల వాహనంతో రావడంతో వారంతా యువతిని తీసుకుని నందగావ్ పేట్ మార్గంలోని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లారు. యువతిపై యువకులు దాడి చేసి, ఆమెను పొలాల్లోకి తీసుకెళ్లి వంతులవారీగా అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి దుండగులు పారిపోయరు.. బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్యాచారానికి పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి ద్విచక్ర వాహనం, కారును స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..