Bihar High Court: బెయిల్ ఇవ్వాలంటే బట్టలు ఉతకాలన్న జడ్జి.. ఆయన్ను పక్కనపెట్టిన హైకోర్టు

ఓ కేసులో బెయిల్ ఇవ్వాలంటే బట్టలు ఉతకాలని చెప్పిన సెషన్స్ కోర్టు న్యాయమూర్తిని బీహార్ హైకోర్టు పక్కనపెట్టింది. ఆయన న్యాయపరమై విధులు చేపట్టకుండా నిషేధం విధించింది.

Bihar High Court: బెయిల్ ఇవ్వాలంటే బట్టలు ఉతకాలన్న జడ్జి.. ఆయన్ను పక్కనపెట్టిన హైకోర్టు
Bihar High Court
Follow us

|

Updated on: Sep 26, 2021 | 9:59 AM

ఓ కేసులో బెయిల్ ఇవ్వాలంటే బట్టలు ఉతకాలని చెప్పిన సెషన్స్ కోర్టు న్యాయమూర్తిని బీహార్ హైకోర్టు పక్కనపెట్టింది. ఆయన న్యాయపరమై విధులు చేపట్టకుండా నిషేధం విధించింది. బీహార్​మధుబనీ జిల్లాలో ఓ యువకుడికి వింత కండిషన్‎​తో బెయిల్ ఇచ్చారు ఓ న్యాయమూర్తి. గ్రామంలోని మహిళల దుస్తులను ఉచితంగా ఉతికి, ఐరన్ చేయాలని షరతు విధించారు. ఓ మహిళను వేధింపులకు గురిచేసి, అత్యాచారానికి యత్నించిన కేసులో యువకుడికి ఈ షరతులతో సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్​ అవినాష్ కుమార్ బెయిల్ ఇచ్చారు. దీనిపై స్పందించిన ఆ రాష్ట్ర హైకోర్టు సెషన్స్ కోర్టు న్యాయమూర్తిపై చర్యలు తీసుకుంది. రెండు రోజులకే హైకోర్టు స్పందించి చర్యలు చేపట్టడం గమనార్హం. జస్టిస్​ అవినాష్ కుమార్ గతంలోనూ వివాదాస్పద తీర్పులు వెలువరించినట్లు న్యాయ వర్గాలు పేర్కొన్నాయి.

నిందితుడు లలన్ కుమార్ సాఫి(20) లాండ్రీ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో జైలు నుంచి విడుదలైన తర్వాత ఆరు నెలల పాటు గ్రామంలోని మహిళల బట్టలు శుభ్రం చేయాలని అదనపు జిల్లా జడ్జి అవినాశ్ కుమార్ ఆదేశించారు. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు గ్రామ సర్పంచ్​తో పాటు పంచాయతీతో పంచుకోవాలని చెప్పారు. ఇదీ కేసు…లౌకాహా పోలీస్ స్టేషన్ పరిధిలో లలన్ నివసిస్తున్నాడు. అత్యాచారానికి సంబంధించిన కేసులో 2021 ఏప్రిల్ 19 నుంచి జైల్లో ఉంటున్నాడు. ఏప్రిల్ 17న నిందితుడు ఓ మహిళపై అత్యాచారానికి యత్నించాడని ఆరోపణలు ఉన్నాయి. ఏప్రిల్ 18న బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయగా.. ఏప్రిల్ 19న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా, బెయిల్ కోసం నిందితుడు కోర్టును అభ్యర్థించాడు. అతడిపై పాత క్రిమినల్ కేసులేవీ లేనందున.. న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. అయితే, కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వినూత్న షరతు విధించింది.

మరిన్ని ఇక్కడ చూడండి: Vikarabad: వికారాబాద్‌ జిల్లాలో వింత ఘటన.. విచిత్రంగా జన్మించిన దూడె.. చూసేందుకు ఎగబడుతున్న జనాలు..

India Corona: దేశంలో మళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య.. కొత్తగా ఎన్నంటే.!