Vikarabad: వికారాబాద్‌ జిల్లాలో వింత ఘటన.. విచిత్రంగా జన్మించిన దూడ.. చూసేందుకు ఎగబడుతున్న జనాలు..

Vikarabad: వికారాబాద్‌ జిల్లాలో వింత ఘటన జరిగింది. ఓ గేదె.. రెండు తలల దూడకు జన్మనిచ్చింది. రెండు తలలు, రెండు నోళ్లు, నాలుగు కళ్లు, నాలుగు చెవులు, నాలుగు కాళ్లతో ఒకటే శరీరం

Vikarabad: వికారాబాద్‌ జిల్లాలో వింత ఘటన.. విచిత్రంగా జన్మించిన దూడ.. చూసేందుకు ఎగబడుతున్న జనాలు..
Calf
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 26, 2021 | 10:50 AM

Vikarabad: వికారాబాద్‌ జిల్లాలో వింత ఘటన జరిగింది. ఓ గేదె.. రెండు తలల దూడకు జన్మనిచ్చింది. రెండు తలలు, రెండు నోళ్లు, నాలుగు కళ్లు, నాలుగు చెవులు, నాలుగు కాళ్లతో ఒకటే శరీరం ఉన్న అరుదైన దూడను చూసేందుకు స్థానికులు ఎగబడుతున్నారు.

బషీరాబాద్‌ మండలం జీవన్గి గ్రామంలో సెప్టెంబర్ 24న ఓ గేదె దూడకు జన్మనివ్వగా అది రెండు తలలతో జన్మంచింది. గ్రామానికి చెందిన వీరారెడ్డికి ఉన్న పశువుల్లో ఓ గేదె ఈతకు ఇబ్బంది పడుతుంటే పశువైద్యుడికి సమాచారం అందించాడు. వైద్యుడు వచ్చి గేదెను పరీక్షించి కడుపులో రెండు తలలున్న దూడ ఉందని గ్రహించి, జాగ్రత్తగా దూడను కడుపులోంచి తీశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, రెండు తలలున్న దూడను చూసేందుకు తరలి వస్తున్నారు. రెండు తలలతో పుట్టిన దూడను చూసి ఆశ్చర్యపోతున్నారు. జన్యుపరమైన లోపంతోనే ఇలా జన్మిస్తుంటాయని పశువైద్యుడు తెలిపారు.

Also read:

India Corona: దేశంలో మళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య.. కొత్తగా ఎన్నంటే.!

Peddapalli : బిల్లు కట్టలేదని పవర్ కనెక్షన్ కట్ చేయబోయిన సిబ్బంది.. ఇంతలో ఊహించని ఝలక్ ఇచ్చిన మహిళ.. వీడియో వైరల్..

Tamarind Seeds: సిరులను కలిపిస్తున్న చింత గింజలు.. ఆన్ లైన్‌లో అమ్మకానికి పెట్టేసిన సంస్థలు