Watch Video: బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్‌పై దాడి.. సెక్యూరిటీని దాటుకుంటూ..

బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ యాదవ్ కు చేదు అనుభం ఎదురైంది. పాట్నా సమీపంలోని భక్తియార్‌పూర్ వద్ద ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. భద్రతను దాటుకుంటూ వెళ్లి దాడి చేశాడు.

Watch Video: బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్‌పై దాడి.. సెక్యూరిటీని దాటుకుంటూ..
Bihar Cm Nitish Kumar
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 27, 2022 | 7:31 PM

బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్(Nitish Kumar)కు చేదు అనుభం ఎదురైంది. పాట్నా సమీపంలోని భక్తియార్‌పూర్ వద్ద ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. భద్రతను దాటుకుంటూ వెళ్లి దాడి చేశాడు. ఆ తర్వాత ఆ యువకుడిని సీఎం భద్రతా సిబ్బంది పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన భక్తియార్‌పూర్ మార్కెట్‌కు సమీపంలో జరగింది. భద్రతా సిబ్బందిని కూడా యువకులు తోసేసినట్లుగా సమాచారం. ఒక యువకుడిని పోలీసులు తీసుకెళ్తున్న వీడియో కూడా వైరల్‌గా మారింది. పాట్నాకు చెందిన భక్తియార్‌పూర్‌లో ఓ వ్యక్తి అతడిపై పిడిగుద్దులు కురిపించాడు. అయినా సీఎంకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రస్తుతం పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ వ్యక్తి మానసికంగా కుంగిపోయాడన్నారు. ఓ ప్రైవేట్ కార్యక్రమం కింద ముఖ్యమంత్రి భక్తియార్‌పూర్‌కు వెళ్లినట్లు సమాచారం.

యోగి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన తర్వాత పాట్నాకు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తియార్‌పూర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేయబోతున్నారు. అప్పుడు గుంపులో ఉన్న ఓ యువకుడు సీఎం నితిష పై దాడి చేశాడు.

సెక్యూరిటీ గార్డు ముఖ్యమంత్రికి రక్షణ కల్పించాడు

గతంలో కూడా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2020 సందర్భంగా మధుబనిలో జరిగిన ఎన్నికల సభలో సభకు హాజరైన వ్యక్తి సీఎం నితీశ్‌పై ఉల్లిపాయలు, ఇటుకలతో దాడి చేశారు. ఈ సందర్భంగా వేదికపై ఉన్న సీఎం సెక్యూరిటీ గార్డు ముఖ్యమంత్రికి రక్షణగా నిలిచారు.

ఇవి కూడా చదవండి: Yogi Adityanath Oath: రెండోసారి ఉత్తర ప్రదేశ్ సీఎంగా యోగి ఆదిత్యానాథ్‌.. కొత్త మంత్రి వర్గంలో మంత్రులు వీరే..

Kishan Reddy: పుత్రవాత్సల్యంతోనే రైతుల్ని బలిచేస్తున్నారు.. కేసీఆర్ సర్కార్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం..

Yogi Cabinet: ఒకప్పుడు సైకిళ్లకు పంక్చర్లు వేసుకునే వ్యక్తి.. నేడు యోగి సర్కార్‌లో మినిస్టర్.. అతని పొలిటికల్ హిస్టరీ ఇది..