Covid Vaccine:కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో ఇక భారీగాప్రైవేట్ రంగ భాగస్వామ్యం, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ పాల్

:కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో ఇక ప్రైవేటు రంగం కూడా భాగస్వామి కానుందని నీతి ఆయోగ్ సభ్యుడు, కరోనా వైరస్ ఫై టాస్క్ ఫోర్స్ చైర్మన్ కూడా అయిన డాక్టర్ వీ.కె. పాల్ తెలిపారు..

Covid Vaccine:కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో ఇక భారీగాప్రైవేట్ రంగ భాగస్వామ్యం, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ పాల్
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 22, 2021 | 4:00 PM

Covid Vaccine:కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో ఇక ప్రైవేటు రంగం కూడా భాగస్వామి కానుందని నీతి ఆయోగ్ సభ్యుడు, కరోనా వైరస్ ఫై టాస్క్ ఫోర్స్ చైర్మన్ కూడా అయిన డాక్టర్ వీ.కె. పాల్ తెలిపారు.  త్వరలోనే ఈ ‘ప్రక్రియ’ ప్రారంభం కానుందని ఆయన చెప్పారు. ఇప్పుడు కూడా హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ విషయంలో ఈ రంగం చురుకైన పాత్ర వహిస్తోందని ఆయన అన్నారు. ఏ రోజునైనా 10 వేల వ్యాక్సినేషన్ సెషన్స్ కి గాను 2 వేల వ్యాక్సినేషన్ సెషన్లలో ప్రైవేటు రంగ భాగస్వాములే కీలక పాత్ర వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. కానీ మరికొన్ని రోజుల్లో ఇది మరింత విస్తృతం కానుంది అని అన్నారాయన.. దేశ జనాభాలో మరింతమంది ప్రజలకు, అన్ని వర్గాల వారికి, వయస్సులవారికీ కరోనా వైరస్ టీకామందులు ఇవ్వాలంటే పూర్తి స్థాయిలో ప్రైవేటు రంగ భాగస్వామ్యం వహించాల్సి ఉంటుందని పాల్ చెప్పారు. రష్యాలో తయారైన స్పుత్నిక్ వ్యాక్సిన్ మన దేశంలో అత్యవసర  వినియోగం కోసం అనుమతి కోరడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ సిబ్బందికి మాత్రమే వ్యాక్సిన్లు ఇస్తున్నారని, అయితే వీరిలో కూడా చాలామంది టీకామందు తీసుకోవడానికి విముఖత  చూపుతున్నారని తెలుస్తోంది. అందువల్లే ప్రైవేటు రంగ భాగస్వామ్యం మరింత పెరిగేలా చూడాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల కేంద్రాన్ని కోరింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రైవేటు భాగస్వాముల కోసం ఆశగా ఎదురుచూస్తోంది.

Read More:

CBSE Exams: సీబీఎస్‌ఈ పరీక్షలకు సిద్ధమవుతున్నారా..? మంచి మార్కులు సాధించాలంటే ఇవి గుర్తించుకోవాల్సిందే..!

Snake : పొరపాటున పాము తోక తొక్కిన చిన్నారి.. అది చేసిన పనికి అంతా షాక్.. ఇంతకూ ఏం జరిగిందంటే..వైరల్ వీడియో