Breaking News: ముంబైలో ఎంపీ ఆత్మహత్య.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు
Mohan Delkar Dead: దాద్రానగర్ హవేలీ ఎంపీ మోహన్ దెల్కర్ ఆత్మహత్య చేసుకున్నారు. దక్షిణ ముంబైలోని ఒక హోటల్‌లో మోహన్ దెల్కర్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు
Mohan Delkar Dead: దాద్రానగర్ హవేలీ ఎంపీ మోహన్ దెల్కర్ ఆత్మహత్య చేసుకున్నారు. దక్షిణ ముంబైలోని ఒక హోటల్‌లో మోహన్ దెల్కర్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. గుజరాతీలో రాసిన సూసైడ్ నోట్‌ను డెల్కర్ బస చేసిన గది నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దాద్రానగర్ హవేలీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన మోహన్ 2019లో ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.
1986 నుండి మోహన్ డెల్కర్ కీలక పదవుల్లో ఉన్నారు. 1986-89 వరకు, దాద్రా నగర్ హవేలీ నుండి యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. డెల్కర్ 1989లో 9వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1990-91 కాలంలో అతను సబార్డినేట్ చట్టంపై కమిటీలో సభ్యుడయ్యాడు. తరువాత షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల సంక్షేమంపై కమిటీలో చేర్చారు. అతని వాణిజ్య, పర్యాటక మంత్రిత్వ శాఖల సంప్రదింపుల కమిటీలో సభ్యుడయ్యాడు. లోక్ సభకు 1991లో రెండవసారి. ఆ తరువాత 1996లో మూడవసారి తిరిగి ఎంపీగా ఎన్నికయ్యారు.
ఇది కూడా చదవండి
Leopard: ములుగు జిల్లా ఏజన్సీలో చిరుత సంచారం.. చెట్టుపై ఉన్న చిరుతను చూసి యువకుల పరుగులు