SBI: వినియోగ‌దారుల‌కు ఎస్‌బీఐ గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లోనే బ్రాంచ్‌ మార్పు.. ఇవిగో వివ‌రాలు

ప్ర‌స్తుతం క‌రోనా స‌మ‌యం. ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌లేని టైమ్. ఈ క్ర‌మంలో ఎస్.బీ.ఐ త‌న‌ వినియోగదారులకు శుభ‌వార్త‌ చెప్పింది. తమ సేవింగ్స్‌ ఖాతా

SBI: వినియోగ‌దారుల‌కు  ఎస్‌బీఐ గుడ్ న్యూస్..  ఆన్‌లైన్‌లోనే బ్రాంచ్‌ మార్పు.. ఇవిగో వివ‌రాలు
Sbi
Follow us

|

Updated on: May 10, 2021 | 9:31 PM

ప్ర‌స్తుతం క‌రోనా స‌మ‌యం. ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌లేని టైమ్. ఈ క్ర‌మంలో ఎస్.బీ.ఐ త‌న‌ వినియోగదారులకు శుభ‌వార్త‌ చెప్పింది. తమ సేవింగ్స్‌ ఖాతా ఉన్న బ్యాంకు శాఖను మార్చుకోవాలంటే బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని వెల్ల‌డించింది. ఆన్‌లైన్‌ ఎస్‌బీఐ లేదా ఎస్‌బీఐకి చెందిన యోనో ఎస్‌బీఐ, యోనో లైట్‌ యాప్‌ల ద్వారా మార్చుకోవచ్చని పేర్కొంది. ప్ర‌స్తుతం విప‌త్క‌ర ప‌రిస్థితులు ఉన్న నేప‌థ్యంలో బ్యాంకుల వద్ద రద్దీని నియంత్రించడంలో భాగంగా ఎస్.బీ.ఐ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంక్ బ్రాంచ్ ను మార్చుకోవాలంటే ముందుగా మీరు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్ యూజ‌ర్స్ ఉండాలి. ఇది వరకే సదరు బ్రాంచ్‌లో మీ మొబైల్‌ నంబర్‌ వివరాలు నమోదై ఉండాలి. ముందుగా ఎస్‌బీఐ ఆన్‌లైన్‌లో పర్సనల్‌ బ్యాంకింగ్‌ విభాగంలోకి వెళ్లి యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్ న‌మోదు చేయాలి. తర్వాత ఈ-సర్వీస్ కేట‌గిరీలోకి వెళ్లాలి. అందులో ట్రాన్స్‌ఫర్‌ సేవింగ్స్‌ అకౌంట్‌పై ఆప్షన్‌పై క్లిక్‌ చేసి మీరు మార్చుకోవాలనుకుంటున్న బ్రాంచ్‌ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ ఎంటర్‌ చేయాలి. అన్ని వివరాలు న‌మోదు చేశాక మీకో ఓటీపీ వస్తుంది.

దాన్ని ఎంటర్‌ చేసిన తర్వాత కొద్దిరోజుల్లో మీ అకౌంట్‌ సదరు శాఖకు ఛేంజ్ అవుతుంది. యోనో యాప్‌, యోనో లైట్‌లో సైతం ఇదే ప్రాసెస్ ఉంటుంది. అందుకోసం ముందుగా మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాల్సి ఉంటుంది.

Also Read: లాక్​డౌన్​పై తెలంగాణ స‌ర్కార్ పున‌రాలోచ‌న‌.. మంగ‌ళ‌వారం సీఎం కేసీఆర్​ కీలక నిర్ణయం!

వెల్లువెత్తిన విమ‌ర్శ‌లు.. ఇక‌పై గుంటూరు శ్మశానవాటికల్లో ఉచితంగా అంత్యక్రియలు

టాలీవుడ్ హీరోలకు చెమటలు పట్టిస్తున్న శ్రీలీల.. అసలు మ్యాటర్ ఇదే
టాలీవుడ్ హీరోలకు చెమటలు పట్టిస్తున్న శ్రీలీల.. అసలు మ్యాటర్ ఇదే
హనుమాన్ ఓటీటీలో ఆ సీన్స్ కట్ చేశారా..?మరి ఎనిమిది నిముషాలు ఏమైంది
హనుమాన్ ఓటీటీలో ఆ సీన్స్ కట్ చేశారా..?మరి ఎనిమిది నిముషాలు ఏమైంది
కరెంట్‌ బిల్లు పెరగకుండా.. ఏసీల వాడొచ్చా? అదెలా?
కరెంట్‌ బిల్లు పెరగకుండా.. ఏసీల వాడొచ్చా? అదెలా?
ఎన్‌సీఏ నుంచి కేఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ, ఓ కండీషన్..
ఎన్‌సీఏ నుంచి కేఎల్‌కు గ్రీన్ సిగ్నల్.. కానీ, ఓ కండీషన్..
అహోబిలంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు, భక్తుల ప్రత్యేక పూజలు
అహోబిలంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు, భక్తుల ప్రత్యేక పూజలు
విషాదం..పెళ్లి బరాత్‌లో డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి
విషాదం..పెళ్లి బరాత్‌లో డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి
రోడ్లపై చక్కర్లు కొడుతున్న కొత్త ఎలక్ట్రిక్ కారు..
రోడ్లపై చక్కర్లు కొడుతున్న కొత్త ఎలక్ట్రిక్ కారు..
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు..
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు..
'అరకొర వివరాలు వెల్లడిస్తారా?' ఎస్‌బీఐపై సుప్రీంకోర్టు సీరియస్‌
'అరకొర వివరాలు వెల్లడిస్తారా?' ఎస్‌బీఐపై సుప్రీంకోర్టు సీరియస్‌
ఆధార్‌కు మొబైల్ లింక్ చేయడం ఎలా? చాలా సింపుల్..
ఆధార్‌కు మొబైల్ లింక్ చేయడం ఎలా? చాలా సింపుల్..