AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uranium: ముంబయిలో బయటపడిన అక్రమ యురేనియం..ఆందోళన వ్యక్తం చేస్తున్న పాకిస్తాన్

Uranium: ముంబై నగరంలో గురువారం ఏడు కిలోగ్రాముల అక్రమ యురేనియం స్వాధీనం చేసుకున్న వార్త పాకిస్తాన్‌లో ఆందోళనను రేకెత్తిస్తోంది.

Uranium: ముంబయిలో బయటపడిన అక్రమ యురేనియం..ఆందోళన వ్యక్తం చేస్తున్న పాకిస్తాన్
Uranium Found In Mumbai
KVD Varma
|

Updated on: May 10, 2021 | 9:29 PM

Share

Uranium: ముంబై నగరంలో గురువారం ఏడు కిలోగ్రాముల అక్రమ యురేనియం స్వాధీనం చేసుకున్న వార్త పాకిస్తాన్‌లో ఆందోళనను రేకెత్తిస్తోంది. ఈ విషయంపై సరైన దర్యాప్తు చేయాలని పాకిస్తాన్ విదేశాంగ శాఖ కూడా డిమాండ్ చేసింది. పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జాహిద్ హఫీజ్ చౌదరి మాట్లాడుతూ అణు వస్తువుల భద్రత అత్యంత ముఖ్యమైనదని, సరిగా దర్యాప్తు చేయాలని అన్నారు. జాహిద్ హఫీజ్ చౌదరి ఒక ప్రకటన విడుదల చేస్తూ, ‘భారతదేశంలో అనధికార వ్యక్తుల నుండి 7 కిలోల సహజ యురేనియం స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. ఏ దేశానికైనా, అణు వస్తువుల భద్రత దానికి చాలా ముఖ్యమైనది. ఈ విషయాన్ని సక్రమంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ‘ అని పేర్కొన్నారు.

కొద్ది రోజుల క్రితం, మహారాష్ట్ర ఎటిఎస్, ఒక స్త్రింగ్ ఆపరేషన్ చేసింది. ఈ ఆపరేషన్ లో అణు బాంబులను తయారు చేయడానికి ఉపయోగించే యురేనియం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. వారి నుంచి 7 కిలోల యురేనియం దొరికింది. అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర సుమారు 22 కోట్లు అని చెబుతున్నారు. ఈ యురేనియం విక్రయించే పనిలో జిగర్ పాండ్యా, అబూ తాహిర్ ఉన్నారని ఎటిఎస్ తెలిపింది. ఎటిఎస్ అధికారి ఒకరు అతన్ని కొనుగోలుదారుగా పరిచయం చేసుకున్నారు. దీంతో ఈ వ్యవహారం బయటపడింది. వారి వద్ద లభించిన యూరేనియం స్వచ్ఛత 90 శాతానికి పైగా ఉందని దర్యాప్తులో తేలింది.

అణు పదార్థాల భద్రత విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోరాదని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. ఇంత అనధికారిక మొత్తంలో యురేనియం ఎలా బయటకు వచ్చిందనే దానిపై తీవ్రమైన దర్యాప్తు జరగాలి. ప్రస్తుతం ఇది పూర్తిగా ముడిసరుకు అయినప్పటికీ, అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది తేలాలి అని ఆయన అన్నారు. ఈ యురేనియం దొంగిలించబడిందయినా, తవ్వితీసినది అయినా ఏ విషయం తేలాల్సిన అవసరం ఉందని అయన చెప్పారు.

అయితే, పాకిస్తాన్ అంతర్జాతీయ ఫోరమ్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఎఇఎ) తో ఈ సమస్యను లేవనెత్తలేదు. అందువల్ల, ఐరాస పర్యవేక్షణ సంస్థ యొక్క జోక్యం లేదు. అయితే, ఈ యురేనియం అక్రమ రవాణా నిషేధించబడిన దేశాలకు జరిగి ఉండవచ్చు కాబట్టి ఈ విషయం గురించి భారత్ ఐఎఇఎకు తెలియజేయాలని పాకిస్తాన్ చెబుతోంది.

Also Read: మూడో కోవిడ్ వేవ్ ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ , ఆక్సిజన్ బెడ్స్ ను పెంచుతున్నామని వెల్లడి

మాకూ ఆక్సిజన్ కోటా పెంచాల్సిందే… కేంద్రానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లేఖ, లేని పక్షంలో నానా పాట్లు తప్పవని ఆందోళన