Mount Everest: ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కేసిన రెండున్నరేళ్ల చిన్నారి..! వీడియో వైరల్
ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ శిఖరాన్ని రెండున్నరేళ్ల వయసున్న బాలిక అధిరోహించి సరికొత్త రికార్డు సృష్టించింది. పెద్ద పెద్ద వాళ్లే అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక చేతులెత్తేస్తే.. భోపాల్‌కు చెందిన సిద్ధి మిశ్రా (రెండున్నరేళ్లు) చిన్నారి అలవోకగా ఎక్కేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్‌ను పూర్తి చేసిన అతి పిన్న వయస్కురాలుగా సిద్ధి మిశ్రా రికార్డు సృష్టించింది..
భోపాల్, మార్చి 27: ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ శిఖరాన్ని రెండున్నరేళ్ల వయసున్న బాలిక అధిరోహించి సరికొత్త రికార్డు సృష్టించింది. పెద్ద పెద్ద వాళ్లే అక్కడి వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక చేతులెత్తేస్తే.. భోపాల్‌కు చెందిన సిద్ధి మిశ్రా (రెండున్నరేళ్లు) చిన్నారి అలవోకగా ఎక్కేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్‌ను పూర్తి చేసిన అతి పిన్న వయస్కురాలుగా సిద్ధి మిశ్రా రికార్డు సృష్టించింది. ఎక్స్‌పెడిషన్ హిమాలయా.కామ్ ప్రైవేట్ లిమిటెడ్ జారీ చేసిన సర్టిఫికేట్ ప్రకారం.. చిన్నారి సిద్ధి మిశ్రా తన తల్లిదండ్రులు భావ దేహరియా, మహిమ్ మిశ్రాతో కలిసి మార్చి 22న ఎవరెస్ట్ బేస్ క్యాంప్ (EBC) ట్రెక్‌ను పూర్తి చేసింది.
దీంతో భారతదేశంలోనే అతి చిన్న వయసులో ఎవరెస్టు పర్వత బేస్ క్యాంపు పైకి ఎక్కిన చిన్నారిగా సిద్ధి మిశ్రా రికార్డు సృష్టించింది. చిన్నారి సాధించిన ఈ అరుదైన ఘనతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చిన్నారి, ఆమె తల్లిదండ్రలు భావ దేహరియా, మహిమ్ మిశ్రాతో కలిసి మార్చి 12వ తేదీన నేపాల్‌లోని లుక్లా మీదుగా ఈ సాహస యాత్ర ప్రారంభించారు. అలా పది రోజుల వ్యవధిలో 53 కిలోమీటర్ల దూరం పూర్తి చేసి, లక్ష్యాన్ని చేధించారని ఎక్స్‌పిడిషన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నబిన్ ట్రిటల్ తెలిపారు. ఎక్స్‌పెడిషన్ హిమాలయాతో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్‌ను పూర్తి చేసిన అతి పిన్న వయస్కురాలిగా సిద్ధి మిశ్రాను ప్రకటించారు.
STORY | Toddler girl from Bhopal reaches Mt Everest Base Camp
READ: https://t.co/NFWnc4FzzF
VIDEO: pic.twitter.com/2Mg6ZBdEIy
— Press Trust of India (@PTI_News) March 26, 2024
కాగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ (ఈబీసీ) సముద్ర మట్టానికి 5,364 మీటర్ల ఎత్తులో ఉంది. ఈబీసీకి చేరుకోవడం అంత తేలికైన పని కాదని చిన్నారి తల్లి భావా దేహరియా అన్నారు. తమ కుమార్తెతోపాటు ఎవరెస్టు అధిరోహించడంపై సంతోషం వ్యక్తం చేసింది. ఇక సిద్ధి తల్లి భావా దేహరియా కూడా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ పర్వత శిఖరాన్ని అధిరోహించారు. మే 22, 2019న ఈ ఘనతలను ఆమె సాధించారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాకు చెందిన భావా దేహరియా చిన్నతనం నుంచి తన గ్రామం టామియా చుట్టూ ఉన్న కొండలను స్కేలింగ్ చేయడం ప్రారంభించింది. అలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శిఖరాలను స్కేలింగ్ చేయాలనే అభిరుచిని పెంచుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.