Bangalore: శరీరంలో సర్జికల్ సూది మర్చిపోయిన డాక్టర్లు.. కట్ చేస్తే.. 20 ఏళ్ల తర్వాత భారీ పరిహారం

వైద్యులు ఆపరేషన్ సమయంలో చూపించిన నిర్లక్షానికి సంబంధించిన సంఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. బెంగళూరుకు చెందిన ఓ మహిళకు స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకుంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత 3.2 సెంటీమీటర్ల సర్జికల్ సూది విషయంపై ఆ రాష్ట్ర వినియోగదారుల ఫోరమ్ కమిషన్ తుది తీర్పు ఇచ్చింది.

Bangalore: శరీరంలో సర్జికల్ సూది మర్చిపోయిన డాక్టర్లు.. కట్ చేస్తే.. 20 ఏళ్ల తర్వాత భారీ పరిహారం
Surgical Needle
Follow us
Surya Kala

|

Updated on: Jul 22, 2024 | 8:05 PM

వైద్యుడిని దైవంతో సమానంగా భావిస్తారు. వైద్య వృత్తిని అమితంగా గౌరవం ఇస్తారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైద్యం చేసే వైద్య సిబ్బంది గురించి మనకు తెలుసు. అదే సమయంలో వైద్యుల నిర్లక్ష్యంతో తీవ్ర ఇబ్బంది పడే బాధితుల గురించి వార్తలు కూడా తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా వైద్యులు ఆపరేషన్ సమయంలో చూపించిన నిర్లక్షానికి సంబంధించిన సంఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. బెంగళూరుకు చెందిన ఓ మహిళకు స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకుంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత 3.2 సెంటీమీటర్ల సర్జికల్ సూది విషయంపై ఆ రాష్ట్ర వినియోగదారుల ఫోరమ్ కమిషన్ తుది తీర్పు ఇచ్చింది.

జయనగర్‌లో నివాసం ఉంటున్న పద్మావతి అనే మహిళకు వ్యాజ్య ఖర్చుల కింద రూ.50 వేలు చెల్లించాలని కర్ణాటక రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ దీపక్ హాస్పిటల్‌ ఆసుపత్రికి చెందిన ఇద్దరు వైద్యులను ఆదేశించింది. అంతేకాదు ఆసుపత్రి ఖర్చులకు సంబంధించిన పాలసీని జారీ చేసిన న్యూ ఇండియా అష్యూరెన్స్ కో లిమిటెడ్‌ను “వృత్తిపరమైన, వైద్యపరమైన నిర్లక్ష్యానికి” గాను పద్మావతికి ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే..

2004 సెప్టెంబర్ 29న పద్మావతి అనే (అప్పటి 32 ఏళ్ల వయసు) మహిళ దీపక్ హాస్పిటల్‌లో శస్త్రచికిత్స చేయించుకుంది. ఇద్దరు వైద్యులు అపెండిక్స్ ఆపరేషన్ చేశారని ఆమె ఆరోపించారు. శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత అపెండిక్స్ ను తొలగించారు. అయితే పద్మావతి ఆపరేషన్ జరిగిన మర్నాడే తీవ్ర మైన నొప్పి వస్తున్నట్లు వైద్యులకు చెప్పింది. అప్పుడు ఆమెకు కొన్ని పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు. అంతేకాదు ఆపరేషన్ చేయడం వలన కలిగిన ఇబ్బంది అని.. ఏమీ పరవాలేదని చెప్పారు. వైద్యులు ఇచ్చిన పెయిన్ కిల్లర్స్ కూడా ఆమె నొప్పిని తగ్గించలేకపోయాయి. చాలా సంవత్సరాలు తీవ్రమైన కడుపు, వెన్నునొప్పితో బాధపడింది. అంతే కాదు మళ్ళీ రెండుసార్లు అదే ఆసుపత్రిలో చేరింది. అయినప్పటికీ ఆమెకు కలిగిన ఇబ్బంది ఏమిటో ఆస్పత్రి వైద్యులు గుర్తించలేదు.

ఇవి కూడా చదవండి

రోజురోజుకీ నొప్పి తీవ్రతరం అవుతుండడంతో పద్మావతి 2010లో స్థానికంగా ఉన్న మరో ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించింది. అక్కడ స్కాన్ చేయగా ఆమె శరీరంలోని పొత్తికడుపు వెనుక భాగంలో ఏదో ఉన్నట్లు అది సర్జికల్ సూదిగా గుర్తించి. దానిని తొలగించాలని ఆమెకు చెప్పారు. దీంతో మళ్ళీ ఆమెకు శస్త్రచికిత్స చేసి, 3.2 సెంటీమీటర్ల సర్జికల్ సూదిని తొలగించారు. ఆ తర్వాత పద్మావతి అన్ని సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదుతో దీపక్ హాస్పిటల్‌ పై ఆపరేషన్ చేసిన వైద్యుల విషయాన్ని తెలియజేస్తూ వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించింది.

అప్పుడు సర్జరీలు చేసి సర్జికల్ సూదిని కడుపులో వదిలినప్పుడు ఫిర్యాదుదారుడి వయస్సు సుమారు 32 ఏళ్లు అని ఫోరమ్ పేర్కొంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అంటే ఆమెకు శస్త్రచికిత్స చేసి ఆ సూదిని తొలగించే వరకు తీవ్రమైన నొప్పిని, అసౌకర్యాన్ని ఎదుర్కొంది” అని పేర్కొంది. ఆ మహిళకు కలిగిన అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఆమెకు రూ. ఐదు లక్షల “గ్లోబల్ పరిహారం” అర్హురాలని పేర్కొంటూ.. బీమా కంపెనీ (న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్) ఆ మొత్తాన్ని చెల్లించమని ఆదేశించింది. అంతేకాదు ఇద్దరు డాక్టర్లు పద్మావతికి రూ. 50,000 వ్యాజ్యం ఖర్చులు చెల్లించమని ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?