AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మహిళా ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఎందుకంటే?

ఓ రాపిడో బైక్ ట్యాక్సీ రైడర్ మహిళా ప్రయాణికురాలిపై చేయిచేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మూడు రోజుల క్రితం బెంగళారులోని జయనగర్ ప్రాంతంలోని ఓ ఫుట్‌వేర్ షోరూం ముందు జరిగిన ఈ ఘటన తాగాజా వెలుగులోకి వచ్చింది.కాగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Viral Video: మహిళా ప్రయాణికురాలిపై చేయి చేసుకున్న బైక్ ట్యాక్సీ రైడర్.. ఎందుకంటే?
Bengaluru
Anand T
|

Updated on: Jun 16, 2025 | 5:13 PM

Share

ఓ రాపిడో బైక్ ట్యాక్సీ రైడర్ ఓ మహిళా ప్రయాణికురాలిపై చేయిచేసుకున్న ఘటన బెంగళారూరులో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. బెంగళూరు నగరంలోని ఓ నగల దుకాణంలో పనిచేస్తున్న ఓ యువతి షాప్‌కు వెళ్లేందుకు ర్యాపిడో బైక్‌ ట్యాక్సీని బుక్‌ చేసుకుంది. అయితే బుకింగ్‌ తీసుకొని ఆమెను పికప్‌ చేసుకున్న రైడర్‌ ఆమెను షాట్‌కట్‌లో తన షోరూం దగ్గరకు తీసుకెళ్లాడు. అయితే రైడర్‌ బైక్‌ను నిర్లక్ష్యంగా, వేగంగా నడుపుతున్నాడని ఆరోపించిన సదరు మహిళ భయాందోళనకు గురై ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేసి బైక్ దిగిపోయింది. బైక్‌ దిగన వెంటనే రైడర్‌ డ్రైవింగ్ తీరుపై ప్రశ్నిస్తూ ఆమె గ్రహం వ్యక్తం చేసింది.

ఈ క్రమంలో ర్యాపిడో రైడర్, మహిళా ప్రయాణికురాలు మధ్య వాగ్వాదం చెలరేగించింది. మహిళ కన్నడ, ర్యాపిడో రైడర్‌కు ఇంగ్లీష్ పూర్తి్స్థాయిలో రాకపోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం మరింత ముదిరింది. ఛార్జీ డబ్బులతో పాటు, హెల్మెట్ తిరిగి ఇవ్వాలని ర్యాపిడో రైడర్‌ అడగ్గా అందుకు మహిళ నిరాకరించినట్టు తెలుస్తోంది. దీంతో సహనం కోల్పోయిన రైడర్ ఆమెను గట్టిగా కొట్టగా ఆమె కిందపడిపోయింది.

అయితే వీరిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుండగా పక్కనున్న వారంతా అలాగే చూస్తు ఉండిపోయారు. ఎవరూ వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించకపోగా కొందరు వారి మధ్య జరిగిన వాగ్వాదాన్నంతా తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. విషయం తెలిసిన పోలీసులు బాధిత యువతిని సందప్రదించగా ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు ఆమె తొలుత అభ్యంతర వ్యక్తం చేయడంతో నాన్-కాగ్నిజబుల్ రిపోర్ట్ (ఎన్.సి.ఆర్.) నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

అయితే ఘటనపై ర్యాపిడో రైడ సుహాస్ మాట్లాడుతూ మొదట ఆ మహిళే తనను కొట్టిందని పేర్కొన్నాడు “ఆమె మొదటి నుండి అసభ్యంగా మాట్లాడుతోందని.. ఆమె సమయాన్ని ఆదా చేసుకోవడానికి నేను జయనగర్ గుండా ఒక షార్ట్‌కట్‌లో తీసుకొచ్చానని చెప్పాడు. అయితే వచ్చే దారిలో ఓ కారు సడన్‌గా బైక్‌కు అడ్డు వచ్చిందని దాంతో బ్రేక్‌ వేశానని తెలిపాడు. అప్పుడు ఆమె నీకు డ్రైవింగ్ వచ్చా, ఎందుకు ఇలా నడుపుతున్నావని ప్రశ్నించిందని ర్యాపిడో రైడర్‌ తెలిపాడు. ఇక ఆమెను డ్రాప్‌కు 100 మీటర్ల దూరంలోనే దించేశానని.. అప్పుడు ఆమెను ఛార్జీ డబ్బు అడగగా ఆమె నిరాకరించడంతో పాటు గొంతు పెంచి నన్ను టిఫిన్ బాక్స్ తో కొట్టిందని తెలిపాడు. నేను వీలైనంత వరకు ఓపిక పట్టాను.. మహిళలను కొట్టకూడదని నాకూ తెలుసు. కానీ ఆమె నన్ను రెండుసార్లు కొట్టి అరిచిన తర్వాత, నేను ఆమెను ఒకసారి కొట్టానని సుహాస్ తెలిపాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..