నిరాధారం, అంతా కట్టుకథ ! చేతులు, కాళ్లపై మేకులా ? ఆ గాయాలు తానే చేసుకున్నాడన్న యూపీ పోలీసులు,
యూపీలోని బెరైలీలో మాస్క్ ధరించనందుకు తన చేతులు, కాళ్లపై పోలీసులు మేకులు దిగగొట్టారంటూ ఓ వ్యక్తి చేసిన ఆరోపణలు నిరాధారమని ఖాకీలు తెలిపారు.
యూపీలోని బెరైలీలో మాస్క్ ధరించనందుకు తన చేతులు, కాళ్లపై పోలీసులు మేకులు దిగగొట్టారంటూ ఓ వ్యక్తి చేసిన ఆరోపణలు నిరాధారమని ఖాకీలు తెలిపారు. ఈ గాయాలను ఆ వ్యక్తి తానే చేసుకున్నాడన్నారు. తన చేతుల మీద, కాళ్ళమీద పోలీసులు మేకులు దిగగొట్టారని ఆరోపిస్తూ రంజిత్ అనే వ్యక్తి తన తల్లితో సహా వచ్చి బరాదరి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వార్త స్థానికంగా కలకలం రేపింది. ఖాకీల అమానుషాన్ని అంతా తిట్టిపోశారు. అయితే ఆరా తీయగా రంజిత్ స్వయంగా తనే అలా గాయాలు చేసుకున్నాడని బెరైలీ పోలీసు అధికారి రోహిత్ సింగ్ తెలిపారు. తనపై కేసు నమోదు కాగా అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఈ డ్రామా ఆడాడని ఆయన చెప్పారు. ఇన్వెస్టిగేషన్ లో ఇతని ఆరోపణలు అబధ్దమని తేలిందన్నారు. మాస్కు ఎందుకు ధరించలేదని ఓ మహిళా కానిస్టేబుల్ ప్రశ్నించగా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని తెలిసిందని, విషయం తెలుసుకునేందుకు అతని ఇంటికి వెళ్లగా పరారయ్యాడని ఆయన చెప్పారు. మొదటి నుంచి రంజిత్ ప్రవర్తన అనుమానాస్పదంగానే ఉందన్నారు.
2019 లో మద్యం తాగిన మత్తులో ఓ ఆలయంలోకి ప్రవేశించి రంజిత్ అక్కడి విగ్రహాలను ధ్వంసం చేసిన కేసు ఇతనిపై ఉందని రోహిత్ సింగ్ తెలిపారు. ఆ కేసు విచారణ ఇంకా కొనసాగుతోందన్నారు. కేవలం మాస్క్ ధరించనందుకు పోలీసులు ఒక వ్యక్తి చేతులు, కాళ్లపై మేకులు దిగగొడుతారా అని ఆయన ప్రశ్నించారు. రంజిత్ కట్టు కథలను ఎవరూ నమ్మరాదని ఆయన కోరారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Road Accident: సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం.. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు దుర్మరణం
Etela Rajender: మాజీ మంత్రి ఈటల దారెటు..? సొంత పార్టీ పెడతారా..? కాషాయకండువా కప్పుకుంటారా..?