AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్.. సరిహద్దుల్లో మొబైల్‌ నెట్‌వర్క్ కట్ చేసిన బంగ్లా

బంగ్లాదేశ్ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సడన్‌గా భారత సరిహద్దు ప్రాంతాల్లో మొబైల్ నెట్ వర్క్ సేవలను నిలిపివేసింది. ప్రస్తుత సమయంలో.. సెక్యూరిటీ కారణాల రీత్యా.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ చర్య వల్ల.. సరిహద్దుల్లోని దాదాపు కోటి మంది వినియోగ దారులపై దీని ప్రభవాం పడనుంది. భారత సరిహద్దుకు కిలో మీటర్ దూరంలో ఉన్న ప్రాంతాల్లో.. సోమవారం నుంచి మొబైల్ నెట్ వర్క్ సేవలను నిలిపివేసినట్లు ఢాకా ట్రిబ్యూన్‌ పేర్కొంది. […]

షాకింగ్.. సరిహద్దుల్లో మొబైల్‌ నెట్‌వర్క్ కట్ చేసిన బంగ్లా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 01, 2020 | 2:18 AM

Share

బంగ్లాదేశ్ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సడన్‌గా భారత సరిహద్దు ప్రాంతాల్లో మొబైల్ నెట్ వర్క్ సేవలను నిలిపివేసింది. ప్రస్తుత సమయంలో.. సెక్యూరిటీ కారణాల రీత్యా.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ చర్య వల్ల.. సరిహద్దుల్లోని దాదాపు కోటి మంది వినియోగ దారులపై దీని ప్రభవాం పడనుంది.

భారత సరిహద్దుకు కిలో మీటర్ దూరంలో ఉన్న ప్రాంతాల్లో.. సోమవారం నుంచి మొబైల్ నెట్ వర్క్ సేవలను నిలిపివేసినట్లు ఢాకా ట్రిబ్యూన్‌ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో.. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సరిహద్దు ప్రాంతాల్లో మొబైల్ సేవలను నిలిపివేయాలంటూ.. బంగ్లాదేశ్‌ టెలీకమ్యూనికేషన్‌ రెగ్యులేటరీ కమిషన్‌ దేశంలోని అన్ని సర్వీస్‌ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని బంగ్లా మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ప్రభుత్వ ఉన్నతాధికారులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో బీటీఆర్‌సీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా, భారత్‌లో పౌర సత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిన కొద్ది రోజులకే బంగ్లాదేశ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో.. ఇది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ చట్టానికి వ్యతిరేకంగా భారత్‌లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే వీటి ఎఫెక్ట్.. పొరుగు దేశాలపై ఉండే అవకాశముందంటూ బంగ్లా విదేశాంగ మంత్రి మోమెన్‌ వ్యాఖ్యలు చేశారు.

తిరుమల సంపదకే రక్షకులు.. శంఖనిధి, పద్మనిధులు దర్శిస్తే..
తిరుమల సంపదకే రక్షకులు.. శంఖనిధి, పద్మనిధులు దర్శిస్తే..
మరోసారి కలెక్టర్లు, మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఏమన్నారంటే?
మరోసారి కలెక్టర్లు, మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఏమన్నారంటే?
దుబాయ్‌లో 20 లక్షల బంగారం కొని, భారత్‌లో అమ్మితే ఎంత మిగులుతుంది?
దుబాయ్‌లో 20 లక్షల బంగారం కొని, భారత్‌లో అమ్మితే ఎంత మిగులుతుంది?
దేశ ప్రజలకు బంపర్ న్యూస్.. తగ్గనున్న వీటి ధరలు..
దేశ ప్రజలకు బంపర్ న్యూస్.. తగ్గనున్న వీటి ధరలు..
: మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5లక్షలు కాదు ఏకంగా రూ.8 లక్షలు..
: మహిళలకు గుడ్ న్యూస్.. రూ.5లక్షలు కాదు ఏకంగా రూ.8 లక్షలు..
టీ20 ప్రపంచ కప్‌ హిస్టరీలో టీమిండియాకు ఊహించని షాక్
టీ20 ప్రపంచ కప్‌ హిస్టరీలో టీమిండియాకు ఊహించని షాక్
మెగాస్టార్ చిరంజీవితో 20 సినిమాలు చేసిన హీరోయిన్..
మెగాస్టార్ చిరంజీవితో 20 సినిమాలు చేసిన హీరోయిన్..
నిన్ను చూస్తే పాపం అనిపిస్తోంది బ్రదర్.. స్నేహితుడని ట్రాన్స్‌ఫర్
నిన్ను చూస్తే పాపం అనిపిస్తోంది బ్రదర్.. స్నేహితుడని ట్రాన్స్‌ఫర్
15x15x15.. మిమ్మల్ని కోటీశ్వరులను చేసే ఫార్ములా!
15x15x15.. మిమ్మల్ని కోటీశ్వరులను చేసే ఫార్ములా!
రాజమౌళి.. నీ చర్యలు ఊహాతీతం స్వామి.. ఇది కేవలం నీ ఒక్కడికే సాధ్యం
రాజమౌళి.. నీ చర్యలు ఊహాతీతం స్వామి.. ఇది కేవలం నీ ఒక్కడికే సాధ్యం