త్రిపురలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ సభ్యులకు బెయిల్ మంజూరు.. కొందరికి సమన్లు

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ యాక్షన్ కమిటీ లోని 23 మంది సభ్యులకు గురువారం బెయిల్ లభించింది. అరెస్టు కాకుండా వీరికి ముందస్తు బెయిల్ మంజూరైంది.

త్రిపురలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ సభ్యులకు బెయిల్ మంజూరు.. కొందరికి సమన్లు
Prashant Kishor
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jul 29, 2021 | 8:01 PM

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ యాక్షన్ కమిటీ లోని 23 మంది సభ్యులకు గురువారం బెయిల్ లభించింది. అరెస్టు కాకుండా వీరికి ముందస్తు బెయిల్ మంజూరైంది. అయితే కోవిడ్ నిబంధనలు అతిక్రమించినట్టు తేలినవారిని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. వీరి కోవిడ్ టెస్ట్ రిపోర్టులు అందవలసి ఉంది. కొంతమందికి ఆగస్టు 1 న తమ ముందు =హాజరు కావాలంటూ ఖాకీలు సమన్లు జారీ చేశారు.బెంగాల్ సీఎం. తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ కోసం సర్వే చేసేందుకు ఈ టీమ్ సభ్యులంతా గత మంగళవారం త్రిపుర చేరుకున్నారు. అయితే వీరిని బయటివారిగా భావించిన పోలీసులు వీరు బస చేసిన హోటల్ నుంచి వీరిని బయటకు అనుమతించలేదు. దాదాపు గృహ నిర్బంధంలో ఉంచారు. వీరి టెస్ట్ రిపోర్టులు అందాల్సి ఉందని, అంతఃవరకు వీరు ఈ హోటల్ లోనే ఉండాలని పోలీసులు అంటున్నారు.

ఇక వీరిని కలిసేందుకు, సమస్యను పరిష్కరించేందుకు బెంగాల్ సీఎం మమత… తమ రాష్ట్రం నుంచి టీఎంసీకి చెందిన ప్రతినిధి బృందాన్ని ఈ రాష్ట్రానికి పంపారు. ఈ బృందంలో ఇద్దరు మంత్రులు, ఓ ఎంపీ, మమత బంధువు అభిషేక్ బెనర్జీ ఉన్నారు. త్రిపురలో ఇక ‘ఆట మొదలైందని’ బ్రత్యా బోస్ అనే మంత్రి వ్యాఖ్యానించారు. ఈ సభ్యులంతా తమ బెంగాల్ వాసులని, తమ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పని చేశారని ఆయన త్రిపుర పోలీసులకు తెలిపారు. ఈ రాష్ట్రంలో 2023 లో ఎన్నికలు జరగనున్నాయి. తన టీమ్ సభ్యులకు ఈ రాష్ట్రంలో ఇలా చేదు అనుభవం కలిగినా ప్రశాంత్ కిషోర్ నుంచి ఇప్పటి వరకు స్పందన లేదని అంటునాన్రు.

మరిన్ని ఇక్కడ చూడండి: IND vs SL: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. గెలుపు కోసం ఇరు జట్లూ ప్రయత్నం!

PM Modi: మోడీజీ క్రేజే వేరప్పా.. ట్విటర్‌లో అరుదైన ఘనత సాధించిన నరేంద్రుడు..