Shirdi Sai Mandir: షిర్డీ సాయి సంస్థాన్ బోర్డు రద్దు.. రెండు నెలల్లో కొత్త బోర్డు.. బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు

షిర్డీ సాయిబాబా సంస్థాన్‌ ధర్మకర్తల బోర్డును హైకోర్టు ఔరంగాబాద్​ బెంచ్ రద్దు చేసింది. వచ్చే 8 వారాల్లోగా కొత్త ధర్మకర్తల మండలిని నియమించాలని ఆదేశించింది. అప్పటి వరకు..

Shirdi Sai Mandir: షిర్డీ సాయి సంస్థాన్ బోర్డు రద్దు.. రెండు నెలల్లో కొత్త బోర్డు.. బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
Shirdi Sai Baba
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 13, 2022 | 2:37 PM

మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వ హయాంలో నియమితులైన షిర్డీ సాయిబాబా సంస్థాన్‌ ధర్మకర్తల బోర్డును హైకోర్టు ఔరంగాబాద్​ బెంచ్ రద్దు చేసింది. వచ్చే 8 వారాల్లోగా కొత్త ధర్మకర్తల మండలిని నియమించాలని ఆదేశించింది. అప్పటి వరకు ఆలయ నిర్వహణను మునుపటిలా ముగ్గురు సభ్యుల కమిటీకి అప్పగించాలని ఆదేశించింది. నిబంధనల ప్రకారం ధర్మకర్తల మండలిని నియమించలేదని.. ప్రమాణాలు పాటించలేదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిని విచారించి తీర్పును రిజర్వ్ చేశారు.  

మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ హయాంలో చట్టవిరుద్ధంగా షిర్డీ సాయి బాబా సంస్థాన్ బోర్డును ఏర్పాటు చేశారని సామాజిక కార్యకర్త సంజయ్ కాలే.. ఔరంగాబాద్ బెంచ్​లో పిల్ వేశారు. మొదట ఎన్​సీపీ ఎమ్మెల్యే అశుతోష్ కాలేను బోర్డు అధ్యక్ష పదవిలో నియమించి.. ఆయనతో పాటు మరికొందర్ని ట్రస్ట్ సభ్యుల్ని చేశారని తెలిపారు.

మహావికాస్ అఘాడి ప్రభుత్వ హయాంలో పెద్ద రాజకీయ గందరగోళం తర్వాత ఈ బోర్డు నియమించబడింది. మూడు పార్టీల ప్రభుత్వాల కారణంగా కోటా నిర్ణయంలో జాప్యం జరిగింది. మొదటి దశలో, అధ్యక్షుడు ఎన్‌సిపి ఎమ్మెల్యే అశుతోష్ కాలేతో పాటు కొంతమంది సభ్యులను నియమించారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు మిగిలిన సభ్యులను నియమించారు. అయితే ధర్మకర్తల మండలిని నియమించే సమయంలో ప్రభుత్వం తాను చేసిన చట్టాన్ని పాటించడం లేదని కోపర్‌గావ్‌కు చెందిన సాయి భక్తుడు, సామాజిక కార్యకర్త సంజయ్ కాలే పిటిషన్ దాఖలు చేశారు.

ధర్మకర్తల మండలిలో సభ్యుల నియామకాల్లోనూ అప్పటి సంకీర్ణ ప్రభుత్వం నిబంధనలను పాటించలేదని పిటిషన్​లో పేర్కొన్నారు. ఈ పిల్​పై విచారణ జరిపిన ఔరంగాబాద్ బెంచ్​.. మంగళవారం తుది తీర్పును వెలువరించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..