AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెలుగులోకి సమాజం సిగ్గుపడే ఘటన.. మేనకోడలిని రూ.55 వేలకు అమ్మేసిన మేనత్త.. కొన్నది ఎవరో తెలుసా!

బాధితురాలికి తల్లిదండ్రులు లేరు. అనారోగ్యంతో తల్లిదండ్రులు మృతి చెందారు. దీంతో ఆ బాలిక తన మేనత్తదగ్గర నివసిస్తుంది. తన మేనత్త తమతో పాటు గోవింద్ పురిలో ఉండే నందుకు రూ.55 వేలకు విక్రయించిందని బాధితురాలు పోలీసులకు తెలిపింది.

వెలుగులోకి సమాజం సిగ్గుపడే ఘటన.. మేనకోడలిని రూ.55 వేలకు అమ్మేసిన మేనత్త.. కొన్నది ఎవరో తెలుసా!
Aunt Sold Niece
Surya Kala
|

Updated on: Mar 24, 2023 | 10:23 AM

Share

ఢిల్లీలోని గోవింద్‌పురిలో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. మానవత్వం సిగ్గుపడేలా చేస్తూ ఓ మేనత్త తన మేనకోడలిని వ్యభిచారంలోకి నెట్టింది. అత్త .. మైనర్ బాలికను 55 వేల రూపాయలకు బేరం కుదుర్చుకుని ఓ వ్యక్తికి విక్రయించింది. అయితే..  ఎలాగోలా బాధితురాలు ఆ వ్యక్తి బారి నుంచి తప్పించుకుని ఓ ఎన్జీవో సాయంతో పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు గోవింద్‌పురి పోలీస్ స్టేషన్ పోలీసులు తెలిపారు. అదే సమయంలో మైనర్‌ బాలికను కొనుగోలు చేసిన నిందితుడు నందును అరెస్టు చేశారు. బాధితురాలి అత్త పరారీలో ఉంది. ఆమె కోసం పోలీసులు వెతుకుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలిపై అత్యాచారం ఘటన చోటు చేసుకుంది. బాలిక వయస్సు 17 సంవత్సరాలు. బాలిక తన మేనత్తతో కలిసి అంబేద్కర్ నగర్‌లో నివసిస్తోంది.

బాధితురాలికి తల్లిదండ్రులు లేరు. అనారోగ్యంతో తల్లిదండ్రులు మృతి చెందారు. దీంతో ఆ బాలిక తన మేనత్తదగ్గర నివసిస్తుంది. తన మేనత్త తమతో పాటు గోవింద్ పురిలో ఉండే నందుకు రూ.55 వేలకు విక్రయించిందని బాధితురాలు పోలీసులకు తెలిపింది. నందు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యక్తి. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం నందు బాలికను కొనుగోలు చేసి తన ఇంటికి తీసుకెళ్లి వ్యభిచారం చేయమని ఒత్తిడి చేశాడు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనపై పోలీసులు విచారణ: పదిమందికి పైగా తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు తెలిపింది. గత మంగళవారం సాయంత్రం ఓ వ్యక్తి బాలికను  వేధించేందుకు వచ్చాడు. సమయం చూసుకుని అక్కడనుంచి నుంచి తప్పించుకుని పారిపోయింది. ఓ ఎన్జీవో అడ్రస్ సంపాదించి వారిని ఆశ్రయించినట్లు.. తనకు సాయం చేయమని కోరినట్లు చెప్పింది. ఎన్జీవోకి చెందిన వ్యక్తులు నందుని పోలీసులకు పట్టించారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

బాధితురాలికి వైద్యం అందించిన పోలీసులు: పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైద్యుల బృందం బాధితురాలికి వైద్య పరీక్షలు చేసింది. దీని ఆధారంగా నిందితులపై అత్యాచారం సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు నందును అరెస్టు చేశారు. పోలీసు అధికారులు నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బాలిక మేనత్తను మొబైల్ లొకేషన్‌ ఆధారంగా ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..