జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి ఎఫెక్ట్… పశ్చిమ బెంగాల్ సీఎస్, డీజీపీలకు కేంద్ర హోం శాఖ సమన్లు…

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం బెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి...

జేపీ నడ్డా కాన్వాయ్‌పై దాడి ఎఫెక్ట్... పశ్చిమ బెంగాల్ సీఎస్, డీజీపీలకు కేంద్ర హోం శాఖ సమన్లు...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 11, 2020 | 3:23 PM

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం బెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. బీజేపీ, టీఎంసీ నేతల మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. అయితే, నడ్డా కాన్వాయ్‌పై దాడిని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.

ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ బెంగాల్‌ సీఎస్‌, డీజీపీలకు సమన్లు జారీ చేసింది. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలపై పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాల్సిందిగా హోం మంత్రి అమిత్‌ షా గవర్నర్‌ని కోరిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్‌లో అమిత్ షా డిసెంబర్ 19 లేదా 20వ తేదీల్లో పర్యటించే అవకాశం ఉందని తెలుస్తోంది.