రాముడిపై కూడా అలాంటి వ్యాఖ్యలే చేయగలరా… బీజేపీపై ప్రియాంక గాంధీ ఫైర్

రాహుల్ గాంధీపై పార్లమెంటు సభ్యనిగా అనర్హత వేటు పడటంతో కాంగ్రెస్ భగ్గుమంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని రాజ్ ఘట్ వద్ద కాంగ్రెస్ సత్యగ్రహ దీక్ష చేస్తోంది.

రాముడిపై కూడా అలాంటి వ్యాఖ్యలే చేయగలరా... బీజేపీపై ప్రియాంక గాంధీ ఫైర్
Priyanka Gandhi
Follow us

|

Updated on: Mar 26, 2023 | 2:04 PM

రాహుల్ గాంధీపై పార్లమెంటు సభ్యనిగా అనర్హత వేటు పడటంతో కాంగ్రెస్ భగ్గుమంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని రాజ్ ఘట్ వద్ద కాంగ్రెస్ సత్యగ్రహ దీక్ష చేస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ బీజేపై తీవ్రంగా విమర్శలు చేసింది. బీజేపీ తాము వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అంటూ ఆరోపణలు చేస్తారు… అయితే మరి దేవుడైన రాముడు కూడా వారసత్వం నుంచే వచ్చాడు కదా ఆయనపై కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయగలరా అని ప్రశ్నించారు. రాముడు వెలివేయబడ్డాడు. ఆ తర్వాత తన కుటుంబానికి, మాతృభూముకి ఆయన నెరవేర్చాల్సిన బాధ్యతలన్నింటినీ నెరవేర్చాడు. మీ దృష్టిలో వంశపార్యపరం అంటే ఇదేనా అని బీజేపీని విమర్శించారు. అలాగే పాండవులు కూడా వంశపార్యపరంగా వచ్చిన వాళ్లు కాదా అని ప్రశ్నించారు.

తన కుటుంబం దేశం కోసం త్యాగం చేసిందని పేర్కొన్నారు. దేశ మట్టిలో అమరులైన తమ కుటుంబ సభ్యుల రక్తం ఉందని తెలిపారు. అలాగే రాహుల్ గాంధీని బీజేపీ పప్పు అనడంపై కూడా ఆమె స్పందించారు. తన సోదరుడు రాహుల్ గాంధీ ప్రపంచంలోనే టాప్ యూనివర్శిటీలైన కేంబ్రిడ్జి, హార్వర్డ్ లలో విద్య పూర్తి చేసినప్పటికీ అతడ్ని ఒక అసమర్థుడిగా ముద్ర వేశారని మండిపడ్డారు. ఇప్పుడు రాహుల్ చేపట్టిన భారత్ యాత్ర విజయవంతం కావడంతో బీజేపీ నాయకులు వాస్తవాన్ని తెలుసుకున్నారని తెలిపారు. తన సోదరుడికి భయపడి అనర్హత వేటు వేశారని విమర్శలు గుప్పించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం.. క్లిక్ చేయండి..