కోవిడ్ చికిత్సలో ఆస్తమా మెడిసిన్, మహారాష్ట్ర టాస్క్ ఫోర్స్ నిపుణుల యోచన

ఆస్తమా (ఉబ్బస) రోగులు వాడే బుడామెట్ మందును  కోవిడ్ చికిత్సలో వాడే అవకాశాన్ని మహారాష్ట్రలోని కోవిడ్ టాస్క్ ఫోర్స్ నిపుణుల బృందం పరిశీలిస్తోంది.

కోవిడ్ చికిత్సలో ఆస్తమా మెడిసిన్, మహారాష్ట్ర టాస్క్ ఫోర్స్ నిపుణుల యోచన
Asthma Drug
Umakanth Rao

| Edited By: Phani CH

Apr 23, 2021 | 9:08 PM

ఆస్తమా (ఉబ్బస) రోగులు వాడే బుడామెట్ మందును  కోవిడ్ చికిత్సలో వాడే అవకాశాన్ని మహారాష్ట్రలోని కోవిడ్ టాస్క్ ఫోర్స్ నిపుణుల బృందం పరిశీలిస్తోంది. దీన్ని రాష్ట్రంలో 19 మంది కోవిడ్ రోగులకు సపోర్టివ్ మందుగా ఇచ్చినట్టు టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ రాహుల్ పండిట్ తెలిపారు. ఈ మందును ‘బుడెసొమైడ్’ అనే ఇన్-హేలర్ తో కలిపి ఇచ్చినప్పుడు ఈ రోగుల్లో చాలావరకు మెరుగుదల కనిపించిందని ఆయన చెప్పారు.కరోనా వైరస్ పాజిటివ్ రోగులకు వాడే మందుల్లో దీన్ని కూడా చేర్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు.  ఉబ్బస రోగులు పీల్చినట్టుగా ఈ మెడిసిన్ ని వీరు కూడా  పీల్చినప్పుడు  వారికి అత్యవసర వైద్య చికిత్స అవసరం లేదని భావిస్తున్నామని, అయితే ఇంకా పరీక్షలు జరగాల్సి ఉందని ఆయన అన్నారు. పైగా లాన్సెట్ రెస్పిరేటరీ జర్నల్ ఈ విషయాన్ని ప్రచురించిందని ఆయన తెలిపారు. ఈ మెడిసిన్ కి సంబంధించి  లాన్సెట్ పరిశోధకులు సుమారు 140 మంది పేషంట్లపై స్టడీ చేశారని, ఫలితాలు ఎంకరేజింగ్ గా ఉన్నాయని పేర్కొన్నారని రాహుల్ పండిట్ తెలిపారు.  ఈయన ముంబైలోని ప్రతిష్టాత్మక ఫోరిస్ హాస్పిటల్స్ డైరెక్టర్ కూడా.

మా లిస్టులో ఈ మందును కూడా చేర్చాలా అని యోచిస్తున్నాం.. త్వరలో నిర్ణయం తీసుకుంటాం.. స్వల్ప కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి ఈ  మెడిసిన్ బాగా పని చేస్తుందని భావిస్తున్నాం అని ఆయన చెప్పారు. ఇలా ఉండగా మోడరేట్ కోవిడ్ కేసుల చికిత్సకు విరాఫిన్ అనే మెడిసిన్ ని ప్రభుత్వం ఆమోదించింది. జైడస్ క్యాడిలా అనే కంపెనీ దీన్ని ఉత్పత్తి చేస్తోంది. దేశంలో కరోనా వైరస్ కేసులు పెరిగి పోతున్న దృష్ట్యా వివిధ సపోర్టివ్ మందులను సత్వరమే ఆమోదించేవిషయంలో  సర్కార్ వివిధ మార్గాలను అన్వేషిస్తోంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Uttam Letter : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ .. ఎందుకంటే.. ?

Covid Deaths : విశాఖలో కరోనా సెకండ్ వేవ్ మరణ మృదంగం.. స్మశాన వాటికల్లో రాత్రనకా, పగలనకా కాలుతోన్న చితి మంటలు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu