Election Results 2022: యూపీ, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్‌లలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్ని సీట్లు అవసరమో తెలుసా?
ఫలితాలకు ముందు, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు, సంపూర్ణ మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏ పార్టీకి ఎన్ని సీట్లు అవసరమో తెలుసుకోండి.
Assembly Election Results 2022: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh), పంజాబ్(Punjab), ఉత్తరాఖండ్(Uttarakhand), గోవా(Goa), మణిపూర్(Manipur) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు ప్రకటించనున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై యావత్ దేశం దృష్టి సారించింది. ఈ రాష్ట్రాల రాజకీయ భవిష్యత్తుతో పాటు 2024 సంవత్సరంలో జరిగే లోక్‌సభ ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతాయి. రేపు సాయంత్రానికి ఈ రాష్ట్రాల్లో అధికారం ఎవరిది అన్నది తేలనుంది. అటువంటి పరిస్థితిలో, ఫలితాలకు ముందు, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు, సంపూర్ణ మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏ పార్టీకి ఎన్ని సీట్లు అవసరమో తెలుసుకోండి.
- ఉత్తర ప్రదేశ్ దేశంలో అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ అధికారం పీఠం దక్కాలంటే, పూర్తి మెజారిటీ పొందడానికి, ఏ పార్టీకి అయినా 202 సీట్లు అవసరం. ఇక్కడ అధికార భారతీయ జనతా పార్టీ, సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్‌వాదీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది.
- పంజాబ్ మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే పంజాబ్‌లో అత్యంత గందరగోళం నెలకొంది. పంజాబ్‌లో 117 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ మెజారిటీకి అవసరమైన సంఖ్య 59. ఇక్కడ అధికార కాంగ్రెస్, అకాలీదళ్, శిరోమణి అకాలీదళ్, బీజేపీ, ఆప్ పార్టీల మధ్య పోటీ నెలకొంది.
- ఉత్తరాఖండ్ పంజాబ్ లాగే ఉత్తరాఖండ్ కూడా గతేడాది చాలా అస్థిరతను చవిచూసింది. అధికార పార్టీ బీజేపీ గతేడాది ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చింది. ఇక్కడ 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ 36. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ.
- గోవా చిన్న రాష్ట్రమైనప్పటికీ గోవా ఎన్నికల సమీకరణం చాలా ఆసక్తికరంగా మారింది. గత రెండేళ్లుగా ఇక్కడ రాజకీయంగా ఎన్నో పెద్ద ఎత్తుపల్లాలు కనిపించాయి. రాష్ట్రంలో 40 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇక్కడ మెజారిటీకి 21 సీట్లు అవసరం. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ. ఇక్కడ అప్పుడే క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి.
- మణిపూర్ మణిపూర్‌లో 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇక్కడ మెజారిటీ కోసం 31 సీట్లు గెలవాలి. గత ఎన్నికల్లో అత్యధికంగా 21 సీట్లను గెలుచుకోవడం ద్వారా, ఎన్‌పిఎఫ్, ఎన్‌పిపి, ఎల్‌జెపితో కలిసి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
Read Also….