టెర్రరిజంపై పోరుకు కశ్మీర్ విభజన పరిష్కారం కాదు: ఎంపీ బాలు

కశ్మీర్ విభజన అన్యాయమని డీఎంకే ఎంపీ బాలు మండిపడ్డారు. రాజ్యసభలో ఈ బిల్లును హడావిడిగా ఆమోదించారని.. రాష్ట్రపతి ఎందుకు అంత హడావిడిగా గెజిట్‌ను ఎందుకు ఆమోదించారని ఆయన ప్రశ్నించారు. ఉభయసభలు ఆమోదించిన బిల్లుకే రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాలని బాలు పేర్కొన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ పాలనతో కశ్మీర్‌కు ఎలాంటి లాభం ఉండదని.. కశ్మీర్ ప్రజల సమస్యలను సానుభూతితో పరిష్కరించాలని ఆయన తెలిపారు. సరిహద్దు ప్రాంతాల ప్రజలు చాలా ఆందోళనలో ఉన్నారని.. టెర్రరిజంపై పోరుకు కశ్మీర్ విభజన పరిష్కారం కాదని […]

టెర్రరిజంపై పోరుకు కశ్మీర్ విభజన పరిష్కారం కాదు: ఎంపీ బాలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 06, 2019 | 12:58 PM

కశ్మీర్ విభజన అన్యాయమని డీఎంకే ఎంపీ బాలు మండిపడ్డారు. రాజ్యసభలో ఈ బిల్లును హడావిడిగా ఆమోదించారని.. రాష్ట్రపతి ఎందుకు అంత హడావిడిగా గెజిట్‌ను ఎందుకు ఆమోదించారని ఆయన ప్రశ్నించారు. ఉభయసభలు ఆమోదించిన బిల్లుకే రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాలని బాలు పేర్కొన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ పాలనతో కశ్మీర్‌కు ఎలాంటి లాభం ఉండదని.. కశ్మీర్ ప్రజల సమస్యలను సానుభూతితో పరిష్కరించాలని ఆయన తెలిపారు. సరిహద్దు ప్రాంతాల ప్రజలు చాలా ఆందోళనలో ఉన్నారని.. టెర్రరిజంపై పోరుకు కశ్మీర్ విభజన పరిష్కారం కాదని వెల్లడించారు. కశ్మీర్ అసెంబ్లీని ఈ విషయంలో ఎందుకు సంప్రదించలేదని ఆయన ప్రశ్నించారు. కశ్మీర్ ప్రజల మనోభావాలను మీరు దెబ్బతీశారని.. అంతేకాకుండా తమిళనాడు, కేరళలో మీ ఆటలు సాగవంటూ బాలు ఫైర్ అయ్యారు.