ఆర్టికల్ 370 రద్దు: లోక్‌సభ నుంచి టీఎంసీ వాకౌట్
ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో కశ్మీర్ బిల్లును వ్యతిరేకించి తృణమూల్ కాంగ్రెస్.. సభ నుంచి వాకౌట్ చేసింది. అంతకుముందు ఆ పార్టీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ మాట్లాడుతూ.. ఆర్టికల్ 370రద్దు బిల్లుకు తృణమూల్ వ్యతిరేకమని పేర్కొన్నారు. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని.. ఎంతో ఆలోచించి నెహ్రూ ఆర్టికల్ 370కు రూపకల్పన చేశారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆర్టికల్ 370 రద్దుకు ముందే జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులైన ఒమర్ అబ్దుల్లా, […]

ఆర్టికల్ 370 రద్దుపై లోక్‌సభలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో కశ్మీర్ బిల్లును వ్యతిరేకించి తృణమూల్ కాంగ్రెస్.. సభ నుంచి వాకౌట్ చేసింది. అంతకుముందు ఆ పార్టీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ మాట్లాడుతూ.. ఆర్టికల్ 370రద్దు బిల్లుకు తృణమూల్ వ్యతిరేకమని పేర్కొన్నారు. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని.. ఎంతో ఆలోచించి నెహ్రూ ఆర్టికల్ 370కు రూపకల్పన చేశారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆర్టికల్ 370 రద్దుకు ముందే జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులైన ఒమర్ అబ్దుల్లా, మొహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లాలను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏం వచ్చిందంటూ ప్రశ్నించారు. ఇక ఆర్టికల్ 370రద్దుపై జరుగుతున్న ఓటింగ్‌లో తాము పాల్గొంటే.. అందుకు అనుగుణంగా గానీ.. వ్యతిరేకంగా గానీ ఓటు వేయాల్సి వస్తుందని.. తాము వ్యతిరేకం కాబట్టి సభ నుంచి తాము వాకౌట్ చేస్తున్నామని పేర్కొన్నారు.



