jantar mantar: జంతర్ మంతర్ వద్ద ముస్లిం వ్యతిరేక నినాదాలు..కేసు పెట్టిన ఢిల్లీ పోలీసులు
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిన్న జరిగిన ఓ నిరసన ప్రదర్శనలో కొంతమంది ముస్లిం వ్యతిరేక నినాదాలు చేయడంతో పోలీసులు వారిపై ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేశారు. అసలు ఈ మార్చ్ కి తమ అనుమతి లేదని. పైగా కోవిడ్ నిబంధనలు అమలులో ఉండగా
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిన్న జరిగిన ఓ నిరసన ప్రదర్శనలో కొంతమంది ముస్లిం వ్యతిరేక నినాదాలు చేయడంతో పోలీసులు వారిపై ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేశారు. అసలు ఈ మార్చ్ కి తమ అనుమతి లేదని. పైగా కోవిడ్ నిబంధనలు అమలులో ఉండగా వీరు వాటిని ఉల్లంఘించి ఈ ప్రొటెస్ట్ చేయడమేమిటని ఖాకీలు ప్రశ్నిస్తున్నారు. సుప్రీంకోర్టు లాయర్, ఢిల్లీ బీజేపీ మాజీ అధికార ప్రతినిధి అశ్వినీ ఉపాయధ్యాయ ఆధ్వర్యంలో ఈ ప్రొటెస్ట్ జరిగింది. ఇండియాలో ఉండాలంటే జై శ్రీరామ్ అని నినాదాలు చేయాలంటూ కొంతమంది ఈ ప్రదర్శనలో గట్టిగా కేకలు పెట్టిన వైనం దీనికి సంబంధించిన వీడియోలో వైరల్ అయింది. అయితే ఈ వీడియో విషయం తనకు తెలియదని, బహుశా ఐదారుగురు ఈ నినాదాలు చేసి ఉండవచ్చునని.. వారు కూడా బయటివారేనని తాను భావిస్తున్నానని ఉపాధ్యాయ పోలీసులకు తెలిపారు. తమ ప్రదర్శనలో పాల్గొన్నవారెవరూ వీటిని చేయలేదన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తాడని ప్రచారంలో ఉన్న నరసింగానంద సరస్వతి సమక్షంలో ఈ ప్రదర్శన జరిగింది. బ్రిటిష్ వారి సామ్రాజ్య వాద చట్టాలు ఇంకా ఈ దేశంలో ఉన్నాయని, వాటికీ నిరసనగా తామీ ప్రదర్శన నిర్వహించినట్టు ఉపాధ్యాయ తెలిపారు.
కాగా ఈ నినాదాలు చేసినవారిని గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు. ఇలా ఉండగా… ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సోమవారం ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తారు.ఈ స్లొగన్స్ చేసినవారిపై పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆయన ఆరోపించారు. వీడియోలో స్పష్టంగా ఎవరు చేశారో ఉందని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి : తండ్రికి తగ్గ తనయుడిగా..కర్రసాము వీరుడిగా..పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్…:Akira Nandan Martial Arts video.