ACB Raids: అక్రమార్కులపై ఏసీబీ కొరడా.. కిలోల కొద్ది బంగారం, వజ్రాలు స్వాధీనం

Bangalore Development Authority: కర్ణాటకలోని బెంగళూరులో అక్రమార్కులపై అవినీతి నిరోధక శాఖ కొరడా ఝుళిపించింది. బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను

ACB Raids: అక్రమార్కులపై ఏసీబీ కొరడా.. కిలోల కొద్ది బంగారం, వజ్రాలు స్వాధీనం
Acb Raids
Follow us

|

Updated on: Mar 22, 2022 | 3:28 PM

Bangalore Development Authority: కర్ణాటకలోని బెంగళూరులో అక్రమార్కులపై అవినీతి నిరోధక శాఖ కొరడా ఝుళిపించింది. బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను ప్రభావితం చేసి.. వారి ద్వారా అక్రమాలకు పాల్పడుతున్న మధ్యవర్తుల ఇళ్లపై ఏసీబీ (ACB) అధికారులు దాడులు నిర్వహించారు. 9 మంది ఏజెంట్ల ఇళ్లలో సోదాలు నిర్వహించి భారీగా నగదు, నగలు, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో కొందరు మధ్యవర్తులు, మరికొందరు ఏజెంట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ కార్యకలాపాల్లో భారీగా అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు నగర వ్యాప్తంగా వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న అక్రమార్కుల ఇళ్లపై ఒకేసారి దాడులు నిర్వహించారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. పోలీసు సూపరింటెండెంట్ ఉమా ప్రశాంత్ ఆధ్వర్యంలో 100 మంది అధికారులు, సిబ్బంది దాడులు నిర్వహిస్తున్నారు.

ఈ దాడుల్లో ఆర్టీ నగర్‌కు చెందిన మోహన్​అనే వ్యాపారవేత్త నుంచి సుమారు 5 కేజీల బంగారం, 15.02 కేజీల వెండి, 61.9 గ్రాముల వజ్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా పలు కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మరో 8 మందికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

గత వారం 18 మంది అధికారుల ఇళ్లపై దాడులు..

కర్ణాటకలో గతవారం రాష్ట్రవ్యాప్తంగా 18 మంది ప్రభుత్వ అధికారుల ఇళ్లపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ దాడులు (మార్చి 16) బుధవారం తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 75 వేర్వేరు ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఈ దాడుల్లో బాదామి జిల్లా బాగల్‌కోట్‌లోని రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ (ఆర్‌ఎఫ్‌ఓ) ఇంట్లో ఏసీబీ 3 కిలోల చందనం దొరికినట్లు అధికారులు తెలిపారు.

Also Read:

బెంగాల్ మరో దారుణం.. పది మంది సజీవ దహనం.. మృతుల్లో చిన్నారులతోపాటు మహిళలు..

AP Crime News: ఏపీలో ఘోరం.. ఆలయ ఆవరణలోనే పూజారి దారుణ హత్య..

దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..