Akhilesh Yadav: ఎంపీ పదవికి అఖిలేష్, అజం ఖాన్ రాజీనామా.. యూపీలో మరో ఎన్నికల సమరానికి కౌంట్ డౌన్
యూపీలో మరో ఆరు మాసాల్లో ఎన్నికల సమరం జరగనుంది. రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌యాదవ్..
ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh)లో మరో ఆరు మాసాల్లో మరో ఎన్నికల సమరానికి కౌంట్ డౌన్ మొదలయ్యింది. రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌యాదవ్.. తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కర్హాల్ సీటు నుంచి గెలిచిన అఖిలేశ్.. ఎమ్మెల్యే పదవిలో ఉండాలని నిర్ణయించుకున్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో యూపీ అసెంబ్లీలో పనిచేయాలని నిర్ణయించుకున్నారు అఖిలేష్ యాదవ్. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఆజంఘడ్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో నిబంధనల మేరకు ఏదో ఒక పదవిలో మాత్రమే కొనసాగాల్సి ఉంటుంది. ఆ మేరకు తన ఎంపీ పదవిని ఆయన వదులుకున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాను కలిసి అఖిలేశ్‌యాదవ్ రాజీనామా లేఖ ఇచ్చారు.
Samajwadi Party (SP) chief Akhilesh Yadav hands over his resignation to Lok Sabha Speaker Om Birla from his membership of the House. pic.twitter.com/UeZIMHgQyj
— ANI (@ANI) March 22, 2022
జైల్లో ఉన్నమరో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్ కూడా తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆజంఖాన్ అసెంబ్లీ ఎన్నికల్లో రాంపూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించుకున్న ఆయన.. ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అఖిలేష్ యాదవ్, అజంఖాన్ రాజీనామాతో వారు ప్రాతినిధ్యంవహిస్తున్న లోక్‌సభ స్థానాల్లో మరో ఆరు మాసల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ, సమాజ్‌వాది పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొనే అవకాశముంది.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 స్థానాల్లో అధికార బీజేపీ 255 స్థానాల్లో విజయం సాధించి.. వరుసగా రెండోసారి అధికార పగ్గాలు సొంతం చేసుకుంది. సమాజ్‌వాది పార్టీ 111 స్థానాల్లో గెలుచుకుంది. 2017 యూపీ ఎన్నికలతో పోల్చితే ఎస్పీ 64 స్థానాలు అదనంగా గెలుచుకుంది. దీంతో ప్రస్తుతానికి జాతీయ రాజకీయాలకు దూరంగా ఉంటూ.. రాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ పెట్టాలని అఖిలేష్ యాదవ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధమయ్యేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం.
Also Read..
ACB Raids: అక్రమార్కులపై ఏసీబీ కొరడా.. కిలోల కొద్ది బంగారం, వజ్రాలు స్వాధీనం
Nagababu: నిహారిక ఇన్‌స్టా అకౌంట్ పై నాగబాబు ఆసక్తికర కామెంట్స్.. నేనే డియాక్టివేట్ చేశానంటూ..