AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu: తమిళనాడులో దారుణం.. దళితయువతిపై గ్యాంగ్‌రేప్‌.. నిందితుల్లో డీఎంకే నేతలు..

తమిళనాడు విరుదునగర్ జిల్లాలో దారుణం జరిగింది. దళిత యువతీపై గ్యాంగ్ రేప్ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈకేసులో డీఎంకే నేతలతో సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రైవేట్ కంపెనీ లో పని చేస్తున్న యువతిని..

Tamil Nadu: తమిళనాడులో దారుణం.. దళితయువతిపై గ్యాంగ్‌రేప్‌.. నిందితుల్లో డీఎంకే నేతలు..
Gang Raped
Sanjay Kasula
|

Updated on: Mar 22, 2022 | 4:03 PM

Share

తమిళనాడు విరుదునగర్ జిల్లాలో దారుణం జరిగింది. దళిత యువతీపై(Dalit woman ) గ్యాంగ్ రేప్(Gang Rape) ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈకేసులో డీఎంకే నేతలతో(DMK Members ) సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రైవేట్ కంపెనీ లో పని చేస్తున్న యువతిని ప్రేమించిన శ్రీవల్లి పుత్తూర్ కి చెందిన హరిహరన్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. యువతీ తో సన్నిహితంగా ఉన్న వీడియోలు చూపించి బెదిరించాడు హరిహరన్. తన మిత్రులతో కలిసి ఆరు నెలలపాటు యువతీ ఫై సామూహిక అత్యాచారం చేశాడు. యువతీ ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలతో వైద్యులను సంప్రదించారు కుటుంబసభ్యులు . వైద్యులు చెప్పిన సమాచారం తో పోలీసులను ఆశ్రయించడం నిజాలు బయటపడ్డాయి. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్థానికంగా ఉన్న డీఎంకే నేతలు యువతిని బెదిరించి అత్యాచారం చేసినట్టు విచారణలో వెల్లడయ్యింది.

అసలు ఏం జరిగిందంటే..

మొదట హరిహరన్ ఆమెను ప్రేమిస్తున్నానంటూ.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో తీసిన వీడియోలను ఇద్దరు స్నేహితులతోపాటు నలుగురు పాఠశాల విద్యార్థులకు షేర్ చేశాడు. ఈ ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేస్తామని చెప్పి ఆమెను బ్లాక్‌మెయిల్ చేశారు. ఈ బెదిరింపుతో వారు ఆరు నెలల పాటు ఆమెపై లైంగిక వేధింపులను కొనసాగించారు.

వేధింపులు భరించలేక బాధితురాలు తన స్నేహితుడు మాడసామికి తెలిపింది. ఇదే అదునుగా భావించిన అతను కూడా ఆమెపై ఆమెను లైంగికంగా వేధించాడు. వీరి హింసను తట్టుకోలేక ఆమె విరుదునగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ తర్వాత మొత్తం ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

పొల్లాచ్చిలో 2019లో ఇలాంటి నేరమే..

పొల్లాచ్చి లైంగిక వేధింపుల కేసును గుర్తుచేసే సంఘటనలో తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో 22 ఏళ్ల దళిత యువతిపై ఇద్దరు యువజన విభాగం కార్యకర్తలు, నలుగురు పాఠశాల విద్యార్థులు సహా ఎనిమిది మంది వ్యక్తులు పదేపదే సామూహిక అత్యాచారం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన ఇప్పుడు తమిళనాడులో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని పొల్లాచ్చిలో 2019లో ఇలాంటి నేరమే జరిగింది. అదే తరహాలో ఇప్పుడు మరో అత్యాచారం జరగడంతో స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఈ దారుణ ఘటనలో పాల్గొన్న 8 మందిలో ఇద్దరు డీఎంకేకు చెందిన వారని, నలుగురు మైనర్లేనని తేలింది. అరెస్టయిన వారిని విరుదునగర్‌కు చెందిన హరిహరన్ (27), జునైద్ అహ్మద్ (27), ప్రవీణ్ (21), మాడసామి (37), 10, 11, 12 తరగతులు చదువుతున్న నలుగురు మైనర్ బాలురుగా గుర్తించారు.

ఇవి కూడా చదవండి: బెంగాల్ మరో దారుణం.. పది మంది సజీవ దహనం.. మృతుల్లో చిన్నారులతోపాటు మహిళలు..

Amaranth Health Benefits: వీరికి ఈ చిరుధాన్యలు దివ్యమైన ఆహారం.. ఎన్ని లాభాలో తెలిసిస్తే..