AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Crime News: ఏపీలో ఘోరం.. ఆలయ ఆవరణలోనే పూజారి దారుణ హత్య..

Priest Brutally Murder: ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. శివాలయంలోని పూజారిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన జిల్లాలోని

AP Crime News: ఏపీలో ఘోరం.. ఆలయ ఆవరణలోనే పూజారి దారుణ హత్య..
Priest Brutally Murder
Shaik Madar Saheb
|

Updated on: Mar 22, 2022 | 2:47 PM

Share

Priest Brutally Murder: ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. శివాలయంలోని పూజారిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన జిల్లాలోని నిడదవోలు మండలం తాడిమళ్లలో జరిగింది. గ్రామంలోని శివాలయంలో పూజారిగా పనిచేస్తున్న కొత్తలంక శివ నాగేశ్వరరావు (55) ను గుర్తుతెలియని వ్యక్తులు ఆలయం లోపలే హత్య చేశారు. తలపగులగొట్టి ఆయన్ను దారుణంగా చంపినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. సోమవారం అర్ధరాత్రి అయినప్పటికీ భర్త ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య ఆందోళనకు గురైంది. వెంటనే కుటుంబసభ్యులకు ఆమె సమాచారం అందించింది. అయితే.. ఆయన ఆచూకీ గురించి ఎక్కడ అడిగినా ఫలితం లేకపోవడంతో.. కుటుంబసభ్యులు రాత్రి ఆలయం వద్దకు వచ్చి వెతికారు. ఆలయం బయట శివనాగేశ్వరరావు వాహనం కనిపించకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు.

అయితే.. పొలం వద్ద వెతికినా పూజారి వాహనం కనిపించకపోవడంతో వేరే పని మీద వెళ్లి ఉంటారని అందరూ భావించారు. ఉదయం అవుతున్నా ఆయన రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆలయం లోపలికి వెళ్లి పరిశీలించారు. ఈ క్రమంలో పూజారి ఆలయ ఆవరణలోనే రక్తపు మడుగులో పడిఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పూజారికి వేరే వారితో ఏమైనా గొడవలు ఉన్నాయా..? ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. మరో మూడు రోజులపాటు వర్షాలు..

Rare Surgery: వైద్య శాస్త్రంలో అద్భుతం.. కృత్రిమ మేధస్సుతో అరుదైన శస్త్రచికిత్స.. కిమ్స్‌ వైద్యుల ఘనత.