AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుజరాత్ లో మరో ప్రాణాంతకమైన వ్యాధి.. ఇప్పటికే 9 మంది మృతి.. జాగ్ర‌త్త ఉండాలంటున్న వైద్యులు

ముందే కరోనా మహమ్మారితో ప్రపంచ వ్యాప్తంగా వణికిపోతుంటే.. మరో కొత్త కొత్త రోగాలు మరింత భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇప్పటికే కరోనాతో భయంతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలు....

గుజరాత్ లో మరో ప్రాణాంతకమైన వ్యాధి.. ఇప్పటికే 9 మంది మృతి.. జాగ్ర‌త్త ఉండాలంటున్న వైద్యులు
Subhash Goud
|

Updated on: Dec 18, 2020 | 12:02 PM

Share

ముందే కరోనా మహమ్మారితో ప్రపంచ వ్యాప్తంగా వణికిపోతుంటే.. మరో కొత్త కొత్త రోగాలు మరింత భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇప్పటికే కరోనాతో భయంతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలు.. కొత్తకొత్త వ్యాధులు దరి చేరడంతో మరింత భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా గుజరాత్ రాష్ట్రంలో మరో ప్రాణాంతకమైన వ్యాధి బయపడింది. మ్యూకోర్మేకోసిన్ అనే అరుదైన వ్యాధి కారణంగా అహ్మదాబాద్ లో ఇప్పటికే 9 మంది మృత్యువాత పడ్డారు. మరో 30 మందికి పైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే గుజరాత్ తో పాటు ముంబాయిలో సైతం ఈ వ్యాధికి సంబంధించిన కేసులు బయటపడుతున్నట్లు తెలుస్తోంది.

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఇప్పటి వరకు 44 మంది ఈ మ్యూకోర్మేకోసిన్ వ్యాధి బారిన పడ్డగా, తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు, మూడు రోజుల కిందట ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో 12 కేసులు నమోదైనట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఈ వ్యాధిన బారిన పడినవారంతా 50 ఏళ్ల పైబడిన వారే ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా నుంచి కోలుకున్నవారిలోనూ ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లత్ కూడా మ్మూకోర్మైకోసిన్ వ్యాధి గురించి వివరిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు.

అలాగే కరోనా బారిన పడిన వారు మ్యూకోర్మైకోసిన్ బారిన పడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ప్రాణాంతకమైన వ్యాధి, దీని వల్ల శరీరంలో మెదడుతో పాటు పలు అవయవాలు పని చేయకుండా పోతాయని ముంబాయి, అహ్మదాబాద్ నగరాల్లో ఇప్పటికే ఈ వ్యాధిపై హెచ్చరికలు జారీ చేశారు.. అని రాజస్థాన్ ముఖ్యమంత్రి ట్విటర్ పేర్కొన్నారు.

మ్యూకోర్మైకోసిన్ అంటే ఏమిటీ..? ఈ వ్యాధి పేరు వింతగా అనిపించినా పెద్ద ప్రాణాంతకమేనని తెలుస్తోంది. అత్యంత అరుదుగా ఈ ఫంగస్ అన్ఫెక్షన్ అత్యంత ప్రమాదని నిపుణులు చెబుతున్నారు. మ్యూకోర్మైసెటీస్ అనే శిలీంధ్రం కారణంగా ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకుతుందట. ముందుగ ముక్కు నుంచి మొదలై కళ్లకు సోకుతుంది. వ్యాధిని త్వరగా గుర్తించి చికిత్స అందిస్తే తప్ప బయట పడలేం. దీని వల్ల కంటి చుట్టూ కండరాలు పని చేయకుండా పోతాయి. ఫలితంగా కంటిచూపు పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ వ్యాధి మెదడుకు చేరితో ఆ రోగి మెదడువాపు బారిన పడతారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

Follow Us
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి