AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP, Telangana News Live: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. స్తంభించిన జనజీవనం!

Telugu News Headlines today: ప్రభుత్వ అవినీతిపై నేపాల్‌లో చెలరేగిన హింస తీవ్ర హింసాత్మక ఘటనలకు దారి తీసింది. దీంతో మంగళవారం ప్రధాని కేపీ శర్మ ఓలి సహా పలువురు మంత్రులు రాజీనామా చేయడంతో ఆందోళనకారులు శాంతించారు. దీనికితోడు కర్ఫ్యూను అమల్లోకి తేవడంతో ప్రస్తుతం నేపాల్‌ వీధులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇక తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ముగ్గురి పేర్లు తెరపైకి వచ్చాయి..

AP, Telangana News Live: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. స్తంభించిన జనజీవనం!
Andhra Pradesh News Telangana News India News Live Updates
Balaraju Goud
| Edited By: |

Updated on: Sep 12, 2025 | 8:05 AM

Share

ఖాట్మాండు, సెప్టెంబర్‌ 11: నేపాల్‌లో నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి. అవినీతికి వ్యతిరేకంగా చెలరేగిల జెన్ Z ఉధ్యమం ధాటికి నేపాల్‌ సర్కార్ కుప్పకూలింది. ఈ ఉద్యమం హింసాత్మక ఘటనకు దారి తీయడంతో ప్రధాని కేపీ శర్మ సహా పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇప్పటికే పాతిక మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గాయపడ్డారు. ఈ క్రమంలో కొత్త సారథి ఎవరనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఖాట్మాండు మేయర్‌ బాలెన్‌ షా పేరు తొలుత తెరపైకి వచ్చినప్పటికీ ఆయన నుంచి స్పందన రాలేదు. దీంతో మాజీ చీఫ్‌ జస్టిస్‌ సుశీలా కర్కీతో జెన్‌-జెడ్‌ వర్గం సంప్రదింపులు జరుపుతున్నట్లు నేపాల్‌ స్థానిక మీడియా వెల్లడించింది. బాధ్యతలు స్వీకరించేందుకు సుశీలా కర్కీ అనుమతిస్తే.. ఆర్మీ చీఫ్‌ జనరల్‌ అశోక్‌ రాజ్‌ సిగ్దెల్‌, అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్‌ ఆమోదంతో ప్రధాని పదవి చేపట్టవల్సి ఉంటుంది. వీరిద్దరితోపాటు మరో వ్యక్తితో కూడా జెన్ జెడ్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

మరిన్ని తాజా జాతీయ, అంతర్జాతీయ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తా కథనాలను ఇక్కడ తెలుసుకోండి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 11 Sep 2025 08:05 PM (IST)

    గొప్ప మనస్సు చాటుకున్న జగ్గారెడ్డి దంపతులు

    కంటి చూపు పోయిన విద్యార్థికి తిరిగి చూపు వచ్చేందుకు ట్రీట్‌మెంట్ కోసం 10లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు జగ్గారెడ్డి దంపతులు. చికిత్స విజయవంతంగా పూర్తయి కంటి చూపు రావాలని ఆకాంక్షించారు. ఇలాంటి పేషెంట్ల గురించి సీఎం రేవంత్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్లి.. వైద్య సహాయం అందేలా భవిష్యత్ లో చూస్తానని జగ్గారెడ్డి తెలిపారు.

  • 11 Sep 2025 08:01 PM (IST)

    వ‌ర్షాల నేప‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సూచ‌న‌లు

    హైద‌రాబాద్ మహాన‌గ‌రంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది అప్రమ‌త్తంగా ఉండాల‌ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. పురాత‌న ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి, సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు. హైద‌రాబాద్‌ పరిధిలో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్‌, అగ్నిమాప‌క‌, ట్రాఫిక్, పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. శాఖల మధ్య స‌మ‌న్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు త‌లెత్తకుండా చూడాల‌ని సీఎం ఆదేశించారు. వాగులపై ఉన్న లోత‌ట్టు కాజ్‌వేలు, క‌ల్వర్టుల‌పై నుంచి నీటి ప్రవాహాలపైన అప్రమత్తంగా ఉండాలని సీఎం కోరారు. చెరువులు, కుంటలకు గండి ప‌డే ప్రమాదం ఉన్నందున నీటి పారుద‌ల శాఖ అధికారులు ముందు జాగ్రత్త చ‌ర్యలు తీసుకోవాల‌ని సీఎం సూచించారు.

  • 11 Sep 2025 07:39 PM (IST)

    చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 10మంది మృతి

    ఛత్తీస్‌గఢ్‌లోభారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. గరియాబంద్ ప్రాంతంలో గురువారం (సెప్టెంబర్ 11) భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఇప్పటి వరకు పది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్‌ కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్‌ అలియాస్‌ మోడెం బాలకృష్ణ సైతం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి రాయ్‌పూర్‌ రేంజ్‌ ఐజీ అమ్రేష్ మిశ్రా ధ్రువీకరించారు. గరియాబంద్‌లో ఎదురుకాల్పులు జరిగాయని.. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కొందరు మావోయిస్టులు చనిపోయి ఉండవచ్చని ఐజీ పేర్కొన్నారు. మోడెం బాలకృష్ణ స్వస్థలం వరంగల్‌.. బాలకృష్ణపై కోటి రూపాయల రివార్డ్‌ ఉంది.

  • 11 Sep 2025 07:36 PM (IST)

    ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం(సెప్టెంబర్ 12) ఢిల్లీలో ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతికి తిరుగు ప్రయాణం అవుతారు.

  • 11 Sep 2025 06:17 PM (IST)

    మంత్రి నారా లోకేశ్‌ చొరవతో స్వదేశానికి భారతీయులు

    ఏపీ మంత్రి నారా లోకేశ్‌ చొరవతో నేపాల్‌లో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి పయనమయ్యారు. నేపాల్‌లోని ఖాట్మాండూ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో 144 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బయల్దేరారు. ప్రత్యేక విమానం ఖాట్మాండూ నుంచి విశాఖపట్నం విమానాశ్రయానికి, ఆ తర్వాత తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటుంది. విశాఖకు 104 మంది, తిరుపతికి 40 మంది రానున్నారు. నేపాల్‌లో చిక్కుకున్న వారిని స్వస్థలాలకు రప్పించేందుకు ఏపీ సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే..

  • 11 Sep 2025 06:00 PM (IST)

    హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. స్తంభించిన జనజీవనం!

    హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లుగా.. నిమిషాల వ్యవధిలోనే రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ముఖ్యంగా శివారు ప్రాంతాలు ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపుర్ మెట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా గంటన్నరపాటు కుండపోత వర్షంతో జనజీవనం స్తంభించింది.

  • 11 Sep 2025 05:14 PM (IST)

    కవితకు చింతమడక వాసుల ఆహ్వానం

    తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో ఆమె తండ్రి కేసీఆర్ సొంతూరు చింతమడక గ్రామస్తుల భేటీ అయ్యారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన చింతమడక గ్రామస్తులు.. సెప్టెంబర్ 21వ తేదీన ఎంగిలి పూల బతుకమ్మ పండుగకు రావాలని ఆహ్వానించారు. కవిత స్పందిస్తూ.. గొప్ప ఉద్యమకారుడిని కన్న గొప్ప ఊరు చింతమడక.. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి బతుకమ్మ పండుగకు ఆహ్వానించడం సంతోషంగా ఉందని అన్నారు. తాను చింతమడక నుంచి ఎంతో నేర్చుకున్నానని, తన చిన్నతనంలో అక్కడ బతుకమ్మ ఆడిన రోజులు ఇంకా కళ్ల ముందే ఉన్నాయని గుర్తు చేసుకున్నారు.

  • 11 Sep 2025 04:45 PM (IST)

    నేపాల్‌లో జెన్‌-Z గ్రూపుల మధ్య ఘర్షణ..!

    నేపాల్‌లో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అవినీతికి పాల్పడ్డారని ఓలీ సర్కార్‌ను దించేసిన జెన్‌-Z నేతలు ఇప్పుడు తమలో తాము కొట్టుకుంటున్నారు. అధికారం కోసం తన్నులాడుకుంటున్నారు. ఖాట్మండులో ఆర్మీ హెడ్‌ క్వార్టర్స్‌ ముందు వర్గాలుగా విడిపోయిన జెన్‌ Z నేతలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. తాత్కాలిక ప్రధానిపై నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. బాలెన్‌ షా, సుశీలా కర్కి వర్గాలుగా విడిపోయిన నేతలు ఘర్షణకు దిగారు. ఆర్మీ ప్రధాన కార్యాలయం దగ్గర చర్చలకు వచ్చిన నేతల మధ్య గొడవలు చెలరేగాయి.

  • 11 Sep 2025 04:19 PM (IST)

    రాగల రెండు-మూడు గంటలలో భారీ వర్షం!

    రాగల రెండు మూడు గంటలలో సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్ జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

  • 11 Sep 2025 04:05 PM (IST)

    గవర్నర్ పదవికి రాధాకృష్ణన్ రాజీనామా

    భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కు మహారాష్ట్ర గవర్నర్‌గా అదనపు బాధ్యతలను రాష్ట్రపతి అప్పగించారు. ఆచార్య దేవవ్రత్ గుజరాత్ బాధ్యతతో పాటు మహారాష్ట్ర గవర్నర్ బాధ్యతలను కూడా నిర్వహిస్తారు. సెప్టెంబర్ 12న సీపీ రాధాకృష్ణన్ భారత ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సమాచారాన్ని రాష్ట్రపతి భవన్ అందించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ 452 ఓట్లు పొందారు.

  • 11 Sep 2025 03:20 PM (IST)

    ఏపీ లిక్కర్ కేసులో కీలక మలుపు..

    ఏపీ లిక్కర్ కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు బెయిల్‌.. మరో వైపు ఆర్డర్‌పై స్టే కోరుతూ హౌస్ మోషన్ పిటిషన్‌ దాఖలయ్యాయి. మరో వైపు లిక్కర్‌స్కామ్‌లో సిట్‌ దర్యాప్తు వేగవంతం చేసింది. తాజాగా హైదరాబాద్‌, విశాఖపట్నంలో ఏకకాలంలో సిట్‌ సోదాలు నిర్వహించింది. నర్రెడ్డి సునీల్‌రెడ్డి నివాసంలో సిట్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సునీల్‌రెడ్డికి చెందిన 10 కంపెనీల్లో సోదాలు చేశారు. బంజారాహిల్స్‌ సాగర్‌ సొసైటీ స్నేహ హౌస్‌లో సోదాలు జరిపారు సెట్ అధికారు.

  • 11 Sep 2025 02:42 PM (IST)

    అక్టోబరు 2 నుంచి ఇంటికే కుల ధ్రువీకరణ పత్రం

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఇంటికే పత్రాన్ని పంపేలా కసరత్తు చేస్తోంది. కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఈ కొత్త ఆలోచన చేసింది. కుల ధ్రువీకరణ పత్రం కోసం ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. అక్టోబరు 2 నుంచి ఇంటికే కుల ధ్రువీకరణ పత్రం వస్తుంది. చదువు, ఉపకార వేతనాలు, ఉద్యోగం, అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం ఈ పత్రం ఉపయోగపడుతుంది. గతంలో కుల ధ్రువీకరణ పత్రం కావాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. సచివాలయం, రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. రెవెన్యూ శాఖ ఈ పనిని సులభతరం చేస్తోంది.

  • 11 Sep 2025 02:39 PM (IST)

    భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై పిటిషన్‌.. సుప్రీంకోర్టు ఆగ్రహం

    ఆసియా కప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దానిని అత్యవసరంగా విచారించాలని పిటిషనర్లు కోరగా అత్యున్నత న్యాయస్థానం సీరియస్‌గా స్పందించింది. ‘అంత అత్యవసరం ఏమిటి? అది కేవలం ఒక మ్యాచ్‌. అలా జరగనివ్వండి. మ్యాచ్‌ ఆదివారం ఉంది. ఏం చేయాలి?’ అని జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ విజయ్‌ బిష్ణోయ్‌ల ధర్మాసనం పిటిషన్‌ దాఖలు చేసిన న్యాయవాదిని ప్రశ్నించింది. ఆదివారం మ్యాచ్‌ ఉందని, శుక్రవారం జాబితాలో చేర్చకపోతే తన పిటిషన్‌ నిష్ఫలమవుతుందని న్యాయవాది కోర్టుకు తెలిపారు.

  • 11 Sep 2025 01:21 PM (IST)

    నేపాల్‌ నుంచి విశాఖ బయలుదేరిన ఏపీ పౌరులు

    మంత్రి లోకేష్ చొరవతో నేపాల్ లోని పోఖరా నుండి 10 మంది తెలుగుపౌరులు మధ్యాహ్నం 12:40 గంటలకు ప్రత్యేక విమానంలో ఖాట్మండూ బయలుదేరారు. వారంతా 1:15 గంటలకు ఖాట్మండూ చేరుకుంటారు. ఈ మధ్యాహ్నం ఖాట్మండూ నుంచి విశాఖ బయలుదేరే ఇండిగో విమానంలోనే వారిని కూడా రాష్ట్రానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఖాట్మండూ నుంచి ఏపీ పౌరులను రాష్ట్రానికి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

  • 11 Sep 2025 01:19 PM (IST)

    సినీ నిర్మాతపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు

    జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సినీ నిర్మాతపై కేసు నమోదు. ఎస్‌బీకే ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌ షేక్‌ బషీర్‌ అలియాస్‌ బషీద్‌పై రెండు రాష్ట్రాల్లో కలిపి 34 కేసులు నమోదయ్యాయి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ గా ఉన్నారు. 99 ఏళ్ల లీజు పేరుతో ఫోర్జరీ పత్రాలు, ఖరీదైన NRI ఇంటిని కాజేసేందుకు యత్నించడంతో నిర్మాతతోపాటు అతని భార్యపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

  • 11 Sep 2025 01:17 PM (IST)

    ‘జెన్‌-జెడ్‌ దయచేసి ఓపిక పట్టండి.. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నాం’.. ఖాట్మాండు మేయర్‌ బాలెన్‌ షా

    నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నట్లు ఖాట్మాండు మేయర్‌ బాలెన్‌ షా తెలిపారు. దేశంలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు వరకు దయచేసి ఓపిక పట్టాలని, ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయని ఆయన ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు.

  • 11 Sep 2025 01:13 PM (IST)

    నేపాల్‌లో మళ్లీ ఉద్రిక్తత.. జైళ్ల నుంచి పారిపోతున్న ఖైదీలపై కాల్పులు!

    నేపాల్‌లో సోషల్‌ మీడియాపై నిషేధంతో ప్రారంభమైన జెన్‌-జెడ్‌ ఉద్యమం నేపథ్యంలో అక్కడి జైళ్ల నుంచి కొందరు ఖైదీలు పరారవుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో రామెచాప్‌ జైలు నుంచి పారిపోతున్న కొందరు ఖైదీలపై అక్కడి ఆర్మీ బలగాలు కాల్పులు జరిపాయి. దీంతో అక్కడ మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • 11 Sep 2025 01:09 PM (IST)

    కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తీరుపై CISF తీవ్ర అభ్యంతరం.. ఏం జరిగిందంటే?

    కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీరుపై CISF అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రాహుల్‌తో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు లేఖ రాసింది. అందులో సెక్యూరిటీ ప్రొటోకాల్ పాటించడం లేదని CISF ఆరోపణ చేసింది. Z+ ASL కేటగిరీ భద్రతలో ఉన్న రాహుల్ గాంధీ యెల్లో బుక్ ప్రొటోకాల్ పాటించకుండా విదేశీ పర్యటనలు చేస్తున్నట్లు అందులో పేర్కొంది. నిబంధనల ప్రకారం 15 రోజుల ముందే సెక్యూరిటీ ఏజెన్సీకి సమాచారం ఇవ్వాలి. కానీ గత 9 నెలల్లో 6 పర్యాయాలు సెక్యూరిటీ నిబంధనలను రాహుల్‌ ఉల్లంఘించినట్లు CISF తన లేఖలో పేర్కొంది. కనీసం భవిష్యత్తులోనైనా ప్రోటోకాల్‌లు పాటించాలని CISF అప్పీల్ చేసింది.

    • డిసెంబర్ 30, 2024 – జనవరి 9, 2025 (ఇటలీ)
    • మార్చి 12-17 (వియత్నాం)
    • ఏప్రిల్ 17-23 (దుబాయ్)
    • జూన్ 11-18 (కతార్)
    • జూన్ 25 – జూలై 6 (లండన్)
    • సెప్టెంబర్ 4-8 (మలేషియా)
  • 11 Sep 2025 12:43 PM (IST)

    కూకట్‌పల్లి రేణు మర్డర్‌ కేసులో వెలుగులోకి దారుణాలు..! గొంతులో కత్తెరతో పొడిచి ఆపై..

    కూకట్‌పల్లి రేణు అగర్వాల్ మర్డర్‌ కేసులో మరో షాకింగ్‌ విషయం వెల్లడైండి. రేణు అగర్వాల్ ను కిరాతకంగా హత్య చేసిన హర్ష, రోషనల వయసు 20 సంవత్సరాలుగా గుర్తింపు. మృతురాలి శరీరంపై 20కు పైగా కత్తి పోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్య అనంతరం రేణు అగర్వాల్ ఒంటి మీద బంగారం ఎత్తుకెళ్లారు. 50 వేల రూపాయల నగదు, 5 తులాల బంగారం ఎత్తుకెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రేణు అగర్వాల్ గొంతులో హర్ష కత్తెరతో పొడిచినట్లు గుర్తించారు. మొత్తం రెండు కత్తులను హత్యకు నిందితులు ఉపయోగించారు. హత్య చేసిన 2 కత్తులు, కత్తెర, కుక్కర్, రక్తపు బట్టలను పోలీసులు సీజ్ చేశారు.

  • 11 Sep 2025 12:38 PM (IST)

    అనుమానపు మొగుడి పైత్యం.. 8 నెలల కొడుకును డ్రమ్ములో వేసి చంపాడు!

    కర్నూలులోని దేవనకొండలో దారుణం చోటు చేసుకుంది. భార్య శ్రావణిపై అనుమానంతో 8 నేలల బాబును డ్రమ్ములో వేసి తండ్రి చాకలి నరేష్ చంపాడు. గతంలో మొదటి భార్యను చిత్రహింసలు చేసి చంపిన చాకలి నరేష్.. శ్రావణిని రెండో పెళ్లి చేసుకున్నాడు. అయినా తీరు మార్చుకోని చాకలి నరేష్ రెండో భార్య శ్రావణిని కూడా చంపే ప్రయత్నం చేశాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడు చాకలి నరేష్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు.

  • 11 Sep 2025 11:59 AM (IST)

    కూకట్‌పల్లి రేణు మర్డర్‌ కేసు.. పక్కా స్కేచ్‌తో హత్య

    స్పాన్ లేక్ రేణు అగర్వాల్ హత్య కేసులో ఐదు బృందాలను ఏర్పాటు చేసినట్లు కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి టీవీ9కి తెలిపారు. జార్ఖండ్ కు సైతం ఒక బృందాన్ని పంపించామన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. కూకట్‌పల్లి నుండి మాదాపూర్ వైపు టూ వీలర్ మీద వెళ్లినట్టు గుర్తించాం. రేణు అగర్వాల్ ఇంట్లో 11 రోజులు పాటు చాలా నమ్మకంగా హర్ష పనిచేశాడు. హర్ష తో పాటు రోషన్ ఇద్దరు కూడా ఝార్ఖండ్ సంబంధించిన నిందితులే. వీరిని కోల్‌కతాలో ఉన్న సెక్యూరిటీ ఏజెన్సీ ఏజెంట్ శంకర్ అనే వ్యక్తి ద్వారా హైదరాబాదులో పనిలో ఉంచారు. రేణు, రాకేష్ అగర్వాల్ కు సనత్ నగర్ లో స్టీల్ వ్యాపారం ఉంది. మార్వాడిస్ కావటంతో ఇంట్లో ఎక్కువ సంఖ్యలో డబ్బు ఉంటుందని నిందితులు భావించారు. ఈ క్రమంలోనే హత్యకు పాల్పడినట్లు తెలిపారు.

  • 11 Sep 2025 11:55 AM (IST)

    తిరిగి తెరచుకున్న నేపాల్‌ ఎయిర్‌పోర్ట్.. యథావిధిగా విమానాల రాకపోకలు షురూ

    నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి యథావిధిగా విమానాల రాకపోకలు పునఃప్రారంభమైనాయి. గత రెండ్రోజులుగా హింసాత్మక ఆందోళనల నేపథ్యంలో విమానాశ్రయం బందవగా.. నిన్న సాయంత్రం నుంచి ఎయిర్‌పోర్ట్ తిరిగి తెరుచుకుంది. నేపాల్‌లో చిక్కుకున్న భారతీయులతో ఖాంట్మండు ఎయిర్‌పోర్ట్ కిక్కిరిసిపోయింది.

  • 11 Sep 2025 11:37 AM (IST)

    నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసుల కోసం మంత్రి లోకేష్‌ ప్రత్యేక చొరవ..

    విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసుల తరలింపు ప్రక్రియ వేగంవంతంగా కొనసాగుతోంది. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిన్న ఏపీ భవన్, ఎంబసీ అధికారులు, రాష్ట్రంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి జరిపిన నిరంతర సమీక్ష సత్ఫలితాలను ఇస్తోంది. ఇప్పటికే నేపాల్ లో చిక్కుకున్న పలువురు ఏపీ వాసులు సురక్షితంగా భారతదేశానికి చేరుకున్నారు. మరికొందరు భారత సరిహద్దుల వద్దకు చేరుకున్నారు. మొదటగా హేటౌడా నుంచి బస్సులో బయలుదేరిన 22 మంది బీహార్ సరిహద్దు ద్వారా భారత్‌లోకి ప్రవేశించారు. అదేవిధంగా సిమికోట్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా 12 మందిని ఉదయం 9 గంటలకు భారత సరిహద్దులోని నేపాల్ గంజ్ కు తరలించారు. అక్కడి నుంచి వీరిని వాహనాల ద్వారా లక్నోకు తరలించనున్నారు. లక్నో నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో పంపే ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు.

    నేపాల్‌లోని పోక్రాకు ప్రత్యేక విమానం ద్వారా బుధవారం ఉదయం 9.30కి చేరుకుంది. ఏపీ వాసులతో 10 గంటలకు ఖాట్మాండు వైపు బయలుదేరింది. ఖాట్మాండు విమానాశ్రయానికి ఇప్పటివరకు 133 మంది ఏపీ వాసులు చేరుకున్నారు. మరో 43 మంది మార్గమధ్యలో ఉన్నారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక విమానం ఈ ఉదయం 9.30 గం.లకు ఢిల్లీ నుంచి బయలుదేరింది. నేపాల్ లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మంత్రి నారా లోకేష్ సమీక్షిస్తున్నారు. ఏపీ వాసులకు అవసరమైన ఆహారం, నీరు, ఇతర సౌకర్యాల కల్పనకు అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీచేయడం జరిగింది. ఢిల్లీలోని ఏపీ భవన్ ఏర్పాటుచేసిన అత్యవసర హెల్ప్ లైన్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు గమనిస్తున్నారు. ప్రత్యేక విమానాల కోసం పౌర విమానాయాన మంత్రిత్వ శాఖతో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నారు.

    వివిధ గ్రూపులుగా నేపాల్‌లోని 12 ప్రాంతాల్లో 217 మంది ఏపీ వాసులు చిక్కుకున్నారు. వీరంతా ఖాట్మాండు, హేటౌడా, పోక్రా, సిమికోట్ తదితర ప్రాంతాల్లో తలదాచుకున్నారు. వీరందరినీ ప్రత్యేక విమానాలు, రోడ్డు మార్గం ద్వారా సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చి.. వారిని స్వస్థలాలకు చేర్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను కూటమి ప్రభుత్వం పూర్తిచేసింది.

  • 11 Sep 2025 11:34 AM (IST)

    మైలవరంలో దారుణం.. 14 ఏళ్ల కూతురిని హత్య చేసిన సొంత తండ్రి!

    ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో దారుణం చోటు చేసుకుంది. 14 సంవత్సరాల మైనర్ బాలికను సొంత తండ్రి హత్య చేశాడు. ఐదు రోజుల క్రితం బాలిక మిస్సింగ్ పై బందువుల ఫిర్యాదు తో రంగంలోకి దిగిన పోలీసులు కేసును చేదించారు.

  • 11 Sep 2025 11:26 AM (IST)

    గ్రూప్ 1 హైకోర్టు తీర్పుపై రివ్యూ పిటీషన్‌.. రంగంలోకి సీఎం రేవంత్

    సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుకున్నారు. గ్రూప్ 1పై హైకోర్టు తీర్పు నేపద్యంలో రివ్యూ పిటీషన్ దాఖలుపై అధికారులతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. తెలంగాణ లో చేపట్టనున్న పలు ప్రతిష్టాత్మక రైల్వే ప్రాజెక్టులపై కూడా సమీక్ష జరపనున్నారు.

  • 11 Sep 2025 10:24 AM (IST)

    రోడ్డు పక్కన 4లోడ్ల ఉల్లి పడేసిన లారీ డ్రైవర్లు.. ఎగబడ్డ జనాలు! ట్రాఫిక్ జామ్..

    పాడైన ఉల్లిపాయలను ఏలూరు జిల్లాలోని చినతాడేపల్లి, వెంకట్రామన్న గూడెం ప్రాంతాల్లో ట్రాన్స్పోర్టేర్లు పడేశారు. కర్నూల్ నుంచి తాడేపల్లి గూడెం వచ్చిన 4లోడ్ల ఉల్లి పాయాలను హోల్ సేల్ వ్యాపారులు తీసుకోకపోవటంతో రోడ్ పక్కన పడేసి డ్రైవర్లు వెళ్లిపోయారు. దీంతో స్థానికులు, రిటైల్ వ్యాపారులు ఉల్లిపాయల కోసం భారీ సంఖ్యలో ఎగబడ్డారు. బాగున్నా వాటిని ఏరుకుని తీసుకుని వెళ్లేందుకు పోటీపడటంతో రోడ్ పక్కన కోలాహలం నెలకొంది.

  • 11 Sep 2025 10:00 AM (IST)

    టమోటా ధరలు ఢమాల్‌.. రైతన్నల కళ్లల్లో కన్నీళ్లు!

    నంద్యాల ప్యాపిలి మార్కెట్లో టమోటా ధర భారీగా పతనమయ్యాయి. కిలో మొదటి రకం టమాటా కేవలం పది రూపాయలు మాత్రమే పలికింది. మీడియం రకం మూడు రూపాయలు చొప్పున పడిపోయాయి. ఈనెల 6న కిలో టమోటా ఇదే మార్కెట్లో 30 రూపాయలు, 7న 20 రూపాయలు చొప్పున అమ్ముడవగా.. నిన్న సాయంత్రం పది రూపాయలకు పడిపోవడంతో టమోటా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • 11 Sep 2025 09:34 AM (IST)

    తాడుకు వేలాడుతూ ఎయిర్‌ లిఫ్ట్‌లో పారిపోతున్న నేపాల్‌ మంత్రులు.. వీడియో

    నేపాల్‌ జనరల్-జెడ్ హింసాత్మక నిరసనల నేపథ్యంలో అక్కడి మంత్రులు, వారి కుటుంబ సభ్యులు హెలికాఫ్టర్‌ తాడుకు వేలాడుతూ మంగళవానం అక్కడి నుంచి పరారయ్యారు. ఓ మంత్రి నివాసం నుంచి హెలికాఫ్టర్‌ తాడుకు వేళాడుతున్న వ్యక్తులకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో ఒక ఆర్మీ హెలికాప్టర్ 7-8 మందిని ఎయిర్ లిఫ్ట్ చేయడం కనిపిస్తుంది. తాడు ద్వారా వేలాడుతున్నవారిని సురక్షిత ప్రదేశాలకు తీసుకెళ్లడం వీడియోలో చూడొచ్చు.

  • 11 Sep 2025 08:50 AM (IST)

    Gold and Silver Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

    పసిడి ధరలు పైపైకి దూసుకుపోతున్నాయి. బుధవారం మాదిరి గురువారం కూడా స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్‌లో ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10మేర పెరిగి రూ. 1,10,519లకు చేరుకుంది. ఈరోజు గ్రాముకు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10మేర పెరిగి రూ. 82,890లకు చేరుకుంది. ఇవే ధరలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాలైన వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, పొద్దుటూరులో కూడా కొనసాగుతున్నాయి.

    ఇక వెండి ధర సెప్టెంబర్ 11వ తేదీన హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ.1,39,900లకు చేరుకుంది. విజయవాడ, ప్రొద్దుటూరు, రాజమహేందరవరంలో ఇవే ధరలు ఉండగా.. దేశ రాజధాని డిల్లీలో రూ.1,29,900లుగా ఉంది.

  • 11 Sep 2025 08:25 AM (IST)

    కూకట్‌పల్లి రేణు అగర్వాల్ మర్డర్ కేసులో ట్విస్ట్.. ఇంట్లో పనోళ్ల పనే

    కూకట్‌పల్లి రేణు అగర్వాల్ మర్డర్ కేసులో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతుంది. ఇంట్లో పని చేసే హర్ష, పక్క ఇంట్లో పని చేసే రోషన్ ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఫింగర్ ఫ్రింట్స్ మ్యాచ్ అవ్వడంతో ఆ ఇద్దరే హత్య చేసినట్లు నిర్ధారణ. లాకర్ వివరాలు చెప్పకపోవడంతో రేణు అగర్వాల్ ను హర్ష చిత్రహింసలకు గురి చేశాడు. ఇంట్లో ఎలాంటి బంగారం పోలేదు అంటున్న కుటుంబ సభ్యులు. రేణు ఆగర్వాల్ ఒంటి మీద ఉన్న బంగారం మాత్రమే నిందితులు తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఇదే ఇంట్లో పనిచేయటంతో పాటు ఇక్కడే నివాసం ఉంటున్న హర్ష, రోషన్. వీరికి 15వేల రూపాయల జీతం ఇస్తున్నట్టు గుర్తింపు. హత్యకు ఉపయోగించిన కత్తితోపాటు, నిందితులు ఇంట్లో వదిలేసిన రక్తపు మరకలతో ఉన్న బట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • 11 Sep 2025 08:22 AM (IST)

    తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. సర్వదర్శనానికి 18 గంటలు

    తిరుమల తిరుపతి శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పట్టనుంది. 22 కంపార్ట్మెంట్లోలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారికి దర్శించుకున్న 70,086 మంది భక్తులు. హుండీ ఆదాయం రూ. 3.56 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

  • 11 Sep 2025 08:20 AM (IST)

    TG Weather Update: రాగల 2, 3 గంటల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్‌.. ఆరెంజ్ అలెర్ట్ జారీ

    రాగల రెండు మూడు గంటలలో సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హైదారబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, మెదక్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్ జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

  • 11 Sep 2025 08:18 AM (IST)

    తురకపాలెంలో మిస్టరీ మరణాలు.. RMP క్లినిక్‌ సీజ్‌ చేసిన DMHO అధికారి

    గుంటూరులోని తురకపాలెంలో ఆర్ఎంపి క్లినిక్‌ను డిఎంహెచ్వో విజయలక్ష్మీ సీజ్ చేశారు. తురకపాలెంలో మృత్యువాత పడిన వారిలో ఎక్కువ మంది ముందు ఆర్ఎంపి వద్దే చికిత్స పొందినట్లు వైద్యాధికారులు ఆధారాలు సేకరించారు. అధిక మోతాదులో యాంటీబయాటిక్స్, సెలైన్లు వాడటం కూడా ఇన్ఫెక్షన్ పెరగడానికి కారణమని వైద్య ఆరోగ్య శాఖ భావించింది. ఈ నేపధ్యంలోనే ఆర్ఎంపి క్లినిక్ సీజ్ చేశారు. అనంతరం ఆర్ఎంపిని అధికారులు విచారించారు.

  • 11 Sep 2025 08:14 AM (IST)

    డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాపట్ల పర్యటన రద్దు

    డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాపట్ల పర్యటన రద్దయింది. రాత్రి భారీ వర్షం కురవడం.. ఈ రోజు వర్షం పడే అవకాశం ఉండటంతో హెలికాప్టర్ కు అధికారులు అనుమతి ఇవ్వలేదే. దీంతో పర్యటన రద్దైంది.

  • 11 Sep 2025 07:53 AM (IST)

    నిజామాబాద్‌లో మరోసారి ఉగ్రమూక కలకలం.. ఒకరు అరెస్ట్

    నిజామాబాద్ జిల్లాలో మరోసారి ఉగ్ర మూలాలు కలకలం రేపాయి. బోధన్ లో యువకుని అరెస్ట్ తో ఉలిక్కిపడ్డ జిల్లా వాసులు. అనీస్ నగర్ కు చెందిన మహమ్మద్ ఉజైఫా యామన్ ను వెంట తీసుకెళ్లిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు. బీ ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్న యామన్ ఆన్ లైన్ ద్వారా ఉగ్ర సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. జార్ఖండ్ రాష్ట్రం రాంచీ లో ఇటీవల అరెస్ట్ చేసిన ఉగ్రవాది డానిష్ ఇచ్చిన సమాచారం మేరకు ఢిల్లీ పోలీసులు యామన్ ను అదుపులో తీసుకున్నారు.

  • 11 Sep 2025 07:50 AM (IST)

    నేటితో ముగిసిన MP మిధున్ రెడ్డి బెయిలు గడువు.. లొంగిపోయేనా?

    ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చిన ఎంపీ మిధున్ రెడ్డి గడువు నేటితో ముగియనుంది. ఆరు రోజులు పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విజయవాడ ఏసీబీ కోర్టు. నేటి సాయంత్రం ఐదు గంటలలోపు రాజమండ్రి జైల్లో లొంగిపోవలని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం ఐదు గంటల లోపు రాజమండ్రి జైల్లో ఎంపీ మిధున్ రెడ్డి లొంగిపోనున్నారు.

  • 11 Sep 2025 07:30 AM (IST)

    ఎమ్మిగనూరు ఏరియా ఆసుపత్రిలో వింత.. సాధారణ కాన్పుతో బాల భీముడు జననం

    ఎమ్మిగనూరు ఏరియా ఆసుపత్రిలో అరుదైన జననం చోటు చేసుకుంది. సాధారణ కాన్పులో 4.900 కేజీల బరువుతో బాల భీముడు జన్మించాడు. జన్మనిచ్చిన తల్లి జుబేధ, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

  • 11 Sep 2025 07:27 AM (IST)

    AP Weather Update: నేడు ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షాలు

    ఉత్తరకోస్తా, దక్షిణ కోస్తా పై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏలూరు, అల్లూరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, కృష్ట, పల్నాడు లో ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు పడే ఆవకాశం ఉంది. మిగతా ప్రాంతాలోనూ మోస్తారు వర్షాలు, రాయలసీమలోనూ అక్కడ వర్షాలు కురవనున్నాయి.

  • 11 Sep 2025 07:26 AM (IST)

    సెప్టెంబర్‌ 27 నుంచి దేవరగట్టు ఉత్సవాలు

    సెప్టెంబర్‌ 27 నుంచి కర్నూలులోని దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి దసరా ఉత్సవాలు జరగనున్నాయి. వచ్చేనెల 2న విజయదశమి రోజు అర్థరాత్రి ఉత్సవాల్లో భాగంగా బన్నీ ఉత్సవం (కర్రల సమరం) జరగనుంది.

  • 11 Sep 2025 07:06 AM (IST)

    నేపాల్ ఆందోళనల్లో 30కి చేరిన మృతుల సంఖ్య

    నేపాల్ జనరల్ జెడ్ ఆందోళనలో మృతుల సంఖ్య 30కి చేరుకుంది. 1000 మంది గాయపడ్డారు. సుశీలా కర్కి తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించనున్నట్లు సమాచారం.

  • 11 Sep 2025 07:04 AM (IST)

    శ్రీశైలం, జూరాల జలాశయాలకు పోటెత్తిన వరద నీరు

    నంద్యాల శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. జూరాల జలాశయంలో ప్రస్తుతం 45,359 క్యూసెక్కుల నీరు చేరింది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది

    • సుంకేసుల..24,308 క్యూసెక్కులు
    • ఇన్ ఫ్లో : 69,667 క్యూసెక్కులు
    • ఔట్ ఫ్లో : 66,014 క్యూసెక్కులు
    • పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు
    • ప్రస్తుతం : 882.80 అడుగులు
    • పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు
    • ప్రస్తుతం : 203.4290 టీఎంసీలు
  • 11 Sep 2025 07:01 AM (IST)

    జూరాల ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

    మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద. ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.

    • ఇన్ ఫ్లో : 60,000 క్యూసెక్కులు
    • ఔట్ ఫ్లో : 48,085 క్యూసెక్కులు
    • పూర్తి స్దాయి నీటి మట్టం 318.516 మీటర్లు
    • ప్రస్తుతం : 318.330 మీటర్లు
    • పూర్తిస్థాయి నీటి నిల్వ : 9.657 టీఎంసీలు
    • ప్రస్తుతం : 9.336 టీఎంసీలు
  • 11 Sep 2025 07:00 AM (IST)

    విజ‌య‌వాడ డ‌యేరియా బాధితుల‌ ఆరోగ్యంపై వైద్యారోగ్య శాఖా మంత్రి ఆరా

    విజ‌య‌వాడ డ‌యేరియా బాధితుల‌కు మెరుగైన చికిత్స అందించాలని వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్ ఆదేశాలు జారీ చేశారు. న్యూ రాజ‌రాజేశ్వరి పేట‌ డ‌యేరియా కేసుల న‌మోదుపై వైద్యారోగ్య శాఖ మంత్రి ఆరా తీశారు. డ‌యేరియా బాధితుల‌కు మెరుగైన చికిత్స అందించాల‌ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్షీశాకు ఆదేశాలు జారీ చేశారు. Ggg లో చికిత్య పొందుతున్న 18 మంది ఆరోగ్య ప‌రిస్థితి నిలకడగా ఉంది. రంగు మారిన నీటిని సరఫరా చేస్తున్నారని కలెక్టర్ లక్ష్మీశా దృష్టికి తీసుకెళ్లిన బాధితులు.

  • 11 Sep 2025 06:57 AM (IST)

    నేపాల్‌ జైళ్ల నుంచి 7 వేల మంది ఖైదీలు పరార్‌.. ఏడుగురు మృతి

    నేపాల్ జెన్‌ జెడ్‌ నిరసనలను అదునుగా చేసుకుని అక్కడి వివిధ జైళ్ల నుంచి 7000 మంది ఖైదీలు పరారయ్యారు. ఖైదీల పరారీ సందర్భంగా పలు జైళ్లలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పశ్చిమ నేపాల్‌లోని జువైనల్‌ హోంలో జరిగిన ఘర్షణలో ఏడుగురు జువైనల్స్‌ మృతి చెందారు. ఒక్క జుంప్కా జైలు నుంచే 1575 మంది ఖైదీలు పరారయ్యారు.

  • 11 Sep 2025 06:54 AM (IST)

    నేపాల్‌ ‘హిల్టన్ కాఠ్మాండు’ హోటల్‌ ధ్వంసం

    నేపాల్‌ నిర‌స‌న‌కారుల ఆగ్రహ జ్వాల‌ల‌కు ఎవ‌రెస్టు ప‌ర్వతం లాంటి ‘హిల్టన్ కాఠ్మాండు’ హోటల్‌ బూడిదైంది. ఆందోళ‌న‌కారులు నిప్పు పెట్టడంతో ఈ హోటల్ పూర్తిగా ధ్వంసమైంది. న్ జెడ్ నిరసనకారులు ప్రభుత్వ కార్యాల‌యాల‌తో పాటు పలువురి నేతల ఇళ్లు కూడా ధ్వంసం చేశారు.

  • 11 Sep 2025 06:50 AM (IST)

    నేపాల్‌ జెన్‌-జెడ్‌ నిరసనకారుల డిమాండ్లివే..

    ప్రజాగ్రహంతో ప్రభుత్వాన్ని కూలదోసిన జెన్‌-జెడ్‌ ఉద్యమకారులు తమ డిమాండ్లను వెల్లడించారు.

    • రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలి.
    • లేదంటే సవరణలు చేసి ప్రభుత్వ పాలనలో సంస్కరణలు తీసుకురావాలి.
    • నేపాల్‌లో మళ్లీ రాజరికాన్ని తీసుకొస్తే సహించేదిలేదు.
    • 3 దశాబ్దాలుగా రాజకీయ నేతలు దోచుకున్న ఆస్తులపై దర్యాప్తు చేపట్టాలి.
    • ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిని అధికారికంగా అమరులుగా గుర్తించి, వారికి గౌరవంతోపాటు సాయం చేయాలి.
    • నిరుద్యోగం, పేదరికం, అవినీతి, వలసలపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలలి.
    • ప్రస్తుతం ఉన్న హౌజ్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ను వెంటనే రద్దుచేసి, ఎన్నికలు నిర్వహించాలి.
    • విద్య, వైద్యం, న్యాయం, భద్రత, కమ్యూనికేషన్లలాంటి కీలక రంగాల్లో మార్పులు తీసుకురావాలి.
  • 11 Sep 2025 06:47 AM (IST)

    నేపాల్‌ నుంచి భారతీయులను తీసుకొస్తాం: కేంద్రమంత్రి రామ్మోహన్‌

    నేపాల్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు ఎయిరిండియా, ఇండిగో కాఠ్‌మాండూకు అదనపు విమానాలను నడపనున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. వారిని తరలించేందుకు అధిక ఛార్జీలను వసూలు చేయొద్దని ఆయా సంస్థలను ఆదేశించినట్లు వెల్లడించారు.

  • 11 Sep 2025 06:45 AM (IST)

    నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసుల కోసం హెల్ప్‌లైన్‌ ఏర్పాటు

    నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణ పౌరులకు సహాయం అందించేందుకు రేవంత్‌ ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో అత్యవసర హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసింది. నేపాల్‌లో ఉన్న తెలంగాణ పౌరులు భవన్‌లోని వందన (+91 9871999044), రక్షిత్‌నాయక్‌ (+91 9643723157), సీహెచ్‌ చక్రవర్తి (+91 9949351270)లను సంప్రదించవచ్చని తెలంగాణ భవన్‌ ప్రకటించింది.

  • 11 Sep 2025 06:42 AM (IST)

    తాత్కాలిక ప్రధాని ఎంపికలో జెన్‌-జెడ్‌కు సహకరిస్తాం.. నేపాలీ కాంగ్రెస్‌ పార్టీ

    నేపాల్‌లో తాత్కాలిక నేత ఎంపికలో అధ్యక్షుడికి, జెన్‌-జెడ్‌కు సహకరిస్తామని నేపాలీ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది.

  • 11 Sep 2025 06:39 AM (IST)

    తాత్కాలిక ప్రభుత్వాధినేత రేసులో ఎవరెవరున్నారంటే..?

    నేపాల్‌లో తాత్కాలిక ప్రధాని రేసులో మాజీ చీఫ్‌ జస్టిస్‌ సుశీల కర్కి, కాఠ్‌మాండూ మేయర్‌ బాలేంద్ర షా, విద్యుత్తు బోర్డు మాజీ సీఈవో కుల్మన్‌ ఘీసింగ్‌ పేర్లు తెరపైకి వచ్చాయి. ఇందులో కర్కి నేపాల్‌ అత్యున్నత న్యాయస్థానానికి చీఫ్‌ జస్టిస్‌గా పనిచేసిన ఏకైక మహిళ.

Published On - Sep 11,2025 6:37 AM