AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold and Silver Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం.. స్వల్పంగా తగ్గిన వెండి ధర.. నేటి ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..

భారతీయు సంస్కృతి, సంప్రదాయాలతో బంగారానికి విడదీయ రాని బంధం ఉంది. బంగారం ఒక విలువైన లోహం కాదు.. ఆర్ధిక భరోసా.. అందుకనే గత కొంత కాలంగా బంగారం, వెండి మంచి పెట్టుబడిగా భావిస్తున్నారు. అంతేకాదు పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగారం, వెండి వస్తువులను కొనుగోలుకి ఆసక్తిని చూపిస్తారు. దీంతో వీటి ధరలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ముఖ్యం. నేటి ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం.. స్వల్పంగా తగ్గిన వెండి ధర.. నేటి ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..
Gold And Silver Price
Surya Kala
|

Updated on: Sep 11, 2025 | 6:59 AM

Share

మన దేశంలో బంగారం ధరలు అంతర్జాతీయ పరిమాణాలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి, ద్రవ్యోల్బణం, ప్రపంచ ధరలలో మార్పు, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు, ఆభరణాల మార్కెట్లు వంటి అనేక అంతర్జాతీయ అంశాల ద్వారా ఇవి ప్రభావితమవుతాయి. అంతేకాదు బంగారం చాలా సంవత్సరాలుగా ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఒక అద్భుతమైన రక్షణగా ఉంది. పెట్టుబడిదారులు బంగారాన్ని ఒక ముఖ్యమైన పెట్టుబడిగా ఎక్కువగా చూస్తున్నారు. గత కొంతకాలంగా పసిడి ధరలు పై పైకి చేరుకున్నాయి. నేను సైతం అంటూ వెండి ధరలు బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈ రోజు (సెప్టెంబర్ 11వ తేదీ) గురువారం తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలతో సహా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో గురువారం ధరలు ఎలా ఉన్నాయంటే…

హైదరాబాద్ లో పసిడి ధర బుధవారం వలెనే గురువారం కూడా స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్‌లో ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10మేర పెరిగి రూ. 1,10,519లకు చేరుకుంది. ఈరోజు గ్రాముకు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10మేర పెరిగి రూ. 82,890లకు చేరుకుంది. ఇవే ధరలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాలైన వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, పొద్దుటూరులో కూడా కొనసాగుతున్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,01,460గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,10,670 లుగా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,490గా ఉంది 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్ల ధర రూ.1,10,720 లకు చేరుకుంది.

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,10,520 లుఉండగా.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.రూ.1,01,310గా కొనసాగుతోంది. ఇవే ధరలు చెన్నై , కోల్‌కతా , బెంగళూరు, కేరళ వంటి ప్రధాన నగరాల్లో కూడా కొనసాగుతున్నాయి.

ఈ రోజు వెండి ధర ఎలా ఉన్నదంటే.. బంగారం తర్వాత వెండి కొనుగోలుకి ఆసక్తిని చూపిస్తారు. వెండిని ఆభరణాలు, నాణేలు వంటి వాటి తయారీ కోసమే కాదు రసాయనిక చర్యలలో ఉత్ప్రేరకంగా కూడా ఉపయోగిస్తున్నారు. మరోవైపు వెండిపై పెట్టుబడి పెట్టడం సురక్షితం అని భావిస్తున్నారు. దీంతో వెండి ధరలు కూడా రెక్కలు వచ్చాయి. అల్ టైంకి చేరుకున్నాయి. ఈ నేపధ్యంలో ఈ రోజు వెండి ధర సెప్టెంబర్ 11 వ తేదీ గురువారం ఎలా ఉందో తెలుసుకుందాం.. ఈ రోజు హైదరాబాద్ లో కేజీ వెండి ధర1,39,900 లకు చేరుకుంది. విజయవాడ, ప్రొద్దుటూరు, రాజమహేందరవరంలో ఇవే ధరలు ఉండగా.. దేశ రాజధాని డిల్లీ లో రూ.1,29,900లుగా ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కళ్లు పొడిబారుతున్నాయా.. చూపు పోయే ప్రమాదం ఉంది జాగ్రత్త!
కళ్లు పొడిబారుతున్నాయా.. చూపు పోయే ప్రమాదం ఉంది జాగ్రత్త!
మనసుల్లో రారాజు.. ఇమ్మూ జర్నీ వీడియో గూస్ బంప్స్..
మనసుల్లో రారాజు.. ఇమ్మూ జర్నీ వీడియో గూస్ బంప్స్..
ఆర్మీ కొలువులకు 40% మార్కులతోనే ఎంపిక.. సెలక్షన్‌ ఎలా ఉంటుందంటే?
ఆర్మీ కొలువులకు 40% మార్కులతోనే ఎంపిక.. సెలక్షన్‌ ఎలా ఉంటుందంటే?
Jailer2: రజనీ మాస్ ఎంటర్‌టైనర్‌లో ఆ బ్యూటీకి స్పెషల్ సాంగ్ ఛాన్స్
Jailer2: రజనీ మాస్ ఎంటర్‌టైనర్‌లో ఆ బ్యూటీకి స్పెషల్ సాంగ్ ఛాన్స్
రష్మిక సీక్రెట్ పార్టీలో.. ఆ 'మిస్టరీ బ్యూటీ'! ఎవరు?
రష్మిక సీక్రెట్ పార్టీలో.. ఆ 'మిస్టరీ బ్యూటీ'! ఎవరు?
ఏపీలో విజృంభిస్తున్న స్క్రబ్ టైఫస్.. 15కు చేరిన మృతుల సంఖ్య!
ఏపీలో విజృంభిస్తున్న స్క్రబ్ టైఫస్.. 15కు చేరిన మృతుల సంఖ్య!
100 కోట్లు టు 1000 కోట్లు.. రికార్డులను తిరగరాస్తున్న టాలీవుడ్
100 కోట్లు టు 1000 కోట్లు.. రికార్డులను తిరగరాస్తున్న టాలీవుడ్
20 సిక్సర్లు, 24 ఫోర్లతో డబుల్ సెంచరీ.. దుమ్మురేపిన బుడ్డోడు
20 సిక్సర్లు, 24 ఫోర్లతో డబుల్ సెంచరీ.. దుమ్మురేపిన బుడ్డోడు
తన సామాజిక వర్గంపై తొలిసారి నోరు విప్పిన నటి.. నెట్టింట చర్చ!
తన సామాజిక వర్గంపై తొలిసారి నోరు విప్పిన నటి.. నెట్టింట చర్చ!
23 ఏళ్లుగా ఇండస్ట్రీలో తోపు.. చేసింది 7 సినిమాలే..
23 ఏళ్లుగా ఇండస్ట్రీలో తోపు.. చేసింది 7 సినిమాలే..