AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: రోడ్డు పక్కన గుబురుగా పెరిగిన చెట్లను నరుకుతుండగా మట్టి కింద కన్పించిన అద్భుతం..

ఈ మధ్య కాలంలో శివలింగాలు బయల్పడుతున్న ఘటనలు దేశవ్యాప్తంగా మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటి ఘటనే కేరళలో వెలుగుచూసింది.

Viral: రోడ్డు పక్కన గుబురుగా పెరిగిన చెట్లను నరుకుతుండగా మట్టి కింద కన్పించిన అద్భుతం..
Shivling
Ram Naramaneni
|

Updated on: Aug 08, 2022 | 9:29 PM

Share

Kerala:కేరళలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. కాసర్‌గోడ్‌(kasaragod) మున్సిపాలిటీకి సమీపంలోని రోడ్డు పక్కన ఉన్న ఓ స్థలంలో చెట్లను నరికివేస్తుండగా పురాతన శివలింగం లభ్యమైంది. కాయూర్ క్లైకోడ్‌లోని వీరభద్ర దేవాలయం సమీపంలోని గుబురుగా పెరిగిన చెట్లను నరికి శుభ్రం చేస్తుండగా శతాబ్దాల నాటి శివలింగం కనిపించింది. శివలింగం దొరికిన మట్టిదిబ్బలో గ్రానైట్ అవశేషాలు కూడా ఉన్నాయి. ఓ వ్యక్తి ఎప్పటినుంచో పట్టించుకోకుండా వదిలేసిన తన స్థలాన్ని తాజాగా శుభ్రపరుస్తుండగా.. మట్టి కింద కప్పి ఉన్న శివలింగం కనిపించిందని స్థానికుడైన గోపాలకృష్ణన్ చెబుతున్నారు. కాగా ఇక్కడ పాతికేళ్ల క్రితం గొప్ప దేవాలయం ఉందనడానికి ఇదే నిదర్శనం కావచ్చని చారిత్రక పరిశోధకులు అంటున్నారు. కన్హంగాడ్ నెహ్రూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల చరిత్ర అధ్యాపకులు నందకుమార్ కోరోత్, సీపీ రాజీవ్ మాట్లాడుతూ.. దొరికిన శివలింగం 1200 ఏళ్ల నాటిదని తెలిపారు. ఈ శివలింగం 8వ శతాబ్దానికి ముందు నిర్మించిన ఆరాధన రూపాలను పోలి ఉందని తెలిపారు. ఆ కాలపు శివలింగాలు నేటితో పోలిస్తే చిన్నవిగా ఉండేవని వెల్లడించారు. పురావస్తు శాఖ ఇలాంటి శివలింగాలపై పరిశోధన చేయడం ద్వారా ఒక దేశంలోని ఆరాధన విధానంలో గల కాలక్రమాన్ని నిర్ణయించవచ్చని వారు పేర్కొన్నారు. శివలింగం బయల్పడిందన్న వార్త వినగానే భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివస్తున్నారు. ఆ ప్రాంతంలో ఓ ఆలయం నిర్మించి పూజలు చేయాలన్నది స్థానికుల అభిలాష. 

Shivling 2

మరిన్ని జాతీయ వార్తలు చదవండి

బ్రహ్మమూహూర్తంలో మేల్కొంటే ఏం జరగుతుందో తెలుసా? సైన్స్ రహస్యం ఇదే
బ్రహ్మమూహూర్తంలో మేల్కొంటే ఏం జరగుతుందో తెలుసా? సైన్స్ రహస్యం ఇదే
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
మీ జుట్టు ఒత్తుగా పెరగాలా.. అయితే బీరుతో ఇలా చేస్తే చాలు..
మీ జుట్టు ఒత్తుగా పెరగాలా.. అయితే బీరుతో ఇలా చేస్తే చాలు..
తేనె, బెల్లం నిజంగా ఆరోగ్యకరమేనా? షాకింగ్ నిజాలు!
తేనె, బెల్లం నిజంగా ఆరోగ్యకరమేనా? షాకింగ్ నిజాలు!
హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??
హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??
OTTలో బిగ్గెస్ట్ కాంట్రవర్సీ మూవీ.. ఐఎమ్‌డీబీలో 8.6/10 రేటింగ్
OTTలో బిగ్గెస్ట్ కాంట్రవర్సీ మూవీ.. ఐఎమ్‌డీబీలో 8.6/10 రేటింగ్
డిసెంబర్ 31న గిగ్ వర్కర్ల సమ్మెతో వీటిపై భారీ ప్రభావం..
డిసెంబర్ 31న గిగ్ వర్కర్ల సమ్మెతో వీటిపై భారీ ప్రభావం..
ఇష్టమని ఊరగాయ పచ్చడి లాగించేస్తున్నారా? ఐతే మీకీ విషయం చెప్పాలి
ఇష్టమని ఊరగాయ పచ్చడి లాగించేస్తున్నారా? ఐతే మీకీ విషయం చెప్పాలి
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
మీ ఇంటి మెట్ల కింద ఇవి ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే కష్టాలు..
మీ ఇంటి మెట్ల కింద ఇవి ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే కష్టాలు..