Amrit Mahotsav: స్వాతంత్ర వజ్రోత్సవ వేళ తాజ్ మహల్‌కు త్రివర్ణ కాంతులు లేవు.. దీని వెనక పెద్ద కారణమే ఉందడోయ్‌..

Amrit Mahotsav: భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే...

Amrit Mahotsav: స్వాతంత్ర వజ్రోత్సవ వేళ తాజ్ మహల్‌కు త్రివర్ణ కాంతులు లేవు.. దీని వెనక పెద్ద కారణమే ఉందడోయ్‌..
Follow us

|

Updated on: Aug 08, 2022 | 7:24 PM

Amrit Mahotsav: భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో హర్‌ ఘర్‌ తిరంగా పేరుతో ప్రతీ ఇంటిపై త్రివర్ణ పతకాన్ని ఎగరవేయాలని కేంద్రం ఇప్పటికే సూచించింది. అలాగే నెటిజన్లు తమ డిస్‌ప్లే పిక్చర్‌న్‌ జాతీయ జెండాతో మార్చుకోమని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే ఇందులో భాగంగానే దేశ వ్యాప్తంగా ఉన్న 3500 చారిత్రక కట్టడాలపై రాత్రి పూట త్రివర్ణ పతాకాలను లైట్‌ రూపంలో అలకరించాలని ఆర్కియాలజీ ఆఫ్‌ ఇండియా నిర్ణయం తీసుకుంది.

అయితే ఈ కార్యక్రమం నుంచి ప్రముఖ స్మారక కట్టడం, ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌ మహల్‌ను మినహాయించారు. అంతటి ప్రాధాన్యత ఉన్న కట్టడాన్ని ఎందుకు మినహాయించారని అనుకుంటున్నారా.? అయితే దీని వెనక పెద్ద కారణం ఉంది. తాజ్‌ మహల్‌ను 1997 మార్చి 20న రాత్రి విద్యుత్‌ కాంతులతో అలంకరించారు. అయితే తర్వాత రోజు ఉదయం తాజ్ మహల్‌ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున కీటకాలు చనిపోయి పడిపోయాయి.

అప్పటి నుంచి తాజ్‌ మహల్‌ను విద్యుత్‌ కాంతులతో అలకరించడం ఆపేశారు. కీటకాలు తాజ్‌ మహల్‌ మార్బల్‌ను డ్యామేజ్‌ చేసే అవకాశాలు ఉన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదండీ తాజ్‌ మహల్‌ను విద్యుత్‌ కాంతులతో అలంకరించ పోవడానికి అసలు కారణం.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..