Tragedy: భుజాలపై భార్యతో ఆసుపత్రి కోసం నాలుగు కిలోమీటర్ల నడక..పాపం..ఆ వృద్ధుడి ప్రయత్నం చివరికి ఎలా మారిందంటే?

ఆధునికత పెరిగింది. సౌకర్యాలు పెరిగాయి. కానీ వాటి ఫలాలు మాత్రం అందరికీ అందడం లేదు. కనీస సౌకర్యాలూ అందుకోలేని ప్రజలు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు.

Tragedy: భుజాలపై భార్యతో ఆసుపత్రి కోసం నాలుగు కిలోమీటర్ల నడక..పాపం..ఆ వృద్ధుడి ప్రయత్నం చివరికి ఎలా మారిందంటే?
Old Man Tragedy

Tragedy: ఆధునికత పెరిగింది. సౌకర్యాలు పెరిగాయి. కానీ వాటి ఫలాలు మాత్రం అందరికీ అందడం లేదు. కనీస సౌకర్యాలూ అందుకోలేని ప్రజలు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. అదేవిధంగా తన మనిషిని రక్షించుకోవాలనే తాపత్రయంతో ఉండేవారు కూడా ఎందరో ఉన్నారు. ఆ తాపత్రయానికి.. ప్రేమకు..వయో భారం అడ్డంకి కాదు. ఆపదలో ఉన్న తనమనిషిని రక్షించుకోవాలనే తపన ముందు తన అశక్తత కూడా కనిపించదు. శక్తి ఉన్న మేర తనవారిని రక్షించుకోవాలనే ప్రయత్నిస్తారు. అటువంటి సంఘటనే ఇది. అయితే, ఎంతో తపన పడి.. తన వయోభారాన్నీ లెక్క చేయక తన జీవిత సహచరణి ఆరోగ్యం కోసం తిప్పలు పడ్డ ఆ తాతకు చివరికి విషాదమే మిగిలింది. ఈ విషాదకర సంఘటన గురించి తెలుసుకుంటే మీరూ ఎమోషన్ అయిపోతారు.

మహారాష్ట్రలోని నందుర్‌బార్ జిల్లాలోని చండసాలీ ఘాట్ గ్రామంలో బుధవారం చాలా విషాదకరమైన సంఘటన జరిగింది. ఇక్కడ వర్షం, కొండచరియలు విరిగిపడడంతో.. రోడ్లు బ్లాక్ అయిపోయాయి. ఈ సమయంలో ఒక వృద్ధుని భార్యకు ఆరోగ్యం పాడైంది. దీంతో ఆ వృద్ధుడు తన భార్యను భుజంపై వేసుకుని కాలినడకన ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. అతను అలా నాలుగు కిలోమీటర్లు తన భార్యను భుజంపై మోస్తూ నడుస్తూ వెళ్ళాడు. కానీ, భార్య మార్గమధ్యంలో మరణించింది. చండసాలీ ఘాట్‌లో మంగళవారం కొండచరియలు విరిగిపడ్డాయి. దీని తరువాత ప్రధాన రహదారితో ఆ గ్రామానికి సంబంధాలు తెగిపోయాయి.
ఆ గ్రామానికి చెందిన70 ఏళ్ల అదాల్యా పద్వి 65 ఏళ్ల భార్య సిడ్లీబాయి ఆరోగ్యం క్షీణించింది. ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చింది. ఏ వాహనం గ్రామానికి చేరుకునే పరిస్థితి లేదు. తన భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను డాక్టరు వద్దకు తీసుకువెళ్ళడం తప్ప మరో మార్గం లేదు. అలాంటి పరిస్థితిలో, భార్యను భుజంపై ఎత్తి ఆసుపత్రికి తీసుకెళ్లాలని అదల్య నిర్ణయించుకున్నాడు.

ఆలోచన వచ్చిందే తడవుగా.. తన భార్యను భుజంపై వేసుకున్నాడు. కాలిబాట పట్టాడు. దాదాపునాలుగు కిలోమీటర్లు నడిచాడు. అతని ఎముకలు నడవడానికి సహకరించలేదు. అయినా, ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తన భార్యను దారిలో అనేక సార్లు కిందికి దింపి..విశ్రాంతి ఇచ్చి..తనకు శక్తి సమకూర్చుకుని ప్రయాణం సాగించాడు. అయితే, ఆసుపత్రికి చేరుకున్న తర్వాత అతని భార్య చనిపోయిందని డాక్టర్ ప్రకటించడంతో అతని ప్రయత్నం విఫలమైంది. తీవ్రమైన జ్వరం కారణంగా, ఆ మహిళ మార్గమధ్యంలో మరణించిందని డాక్టర్ చెప్పారు.
ఈ సంఘటన చండసాలీ గిరిజన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అక్కడి ప్రజలు శోక సముద్రంలో మునిగిపోయారు. ఈ గిరిజన గ్రామం మహారాష్ట్ర గిరిజన అభివృద్ధి శాఖా మంత్రి కేసీ పద్వి స్వస్థలం కావడం చెప్పుకోదగ్గ విషయం. ఈ ప్రాంతంలో ఇప్పటికీ సరైన రోడ్లు లేవు. దాదాపు ప్రతి సంవత్సరం చండసాలీ ఘాట్ కొండచరియల కారణంగా మూసివేయాల్సి వస్తుంది. దీంతో వేలాది మంది గిరిజనులు తమ గ్రామాల్లో చాలా రోజులు ఖైదు అయిపోతారు. బాహ్య పరపంచంతో వారికీ సంబంధాలు తెగిపోతాయి. చండసాలి గ్రామంలో ఆరోగ్య సౌకర్యాలు లేవు. అందుకే ప్రజలు చికిత్స కోసం నందుర్‌బార్, తలోడా, ధడ్‌గావ్‌కు వెళ్లాల్సి ఉంటుంది.

కొండచరియలు విరిగిపడటానికి ప్రధాన కారణం
ధడ్‌గావ్‌లోని 132 కెవి సబ్ స్టేషన్ కోసం టవర్ నిర్మిస్తున్నారు. రాయి నిర్మాణానికి ముందు దానిని పగలగొట్టడానికి పేలుడు పదార్థాలు వాడుతున్నారని అక్కడి ప్రజలు చెబుతారు. ఈ కారణంగా, ఇక్కడ పర్వతాలు బలహీనంగా మారాయనీ, అవి చిన్న వర్షానికి కూడా కూలిపోవడం ప్రారంభిస్తాయని స్థానికులు అంటున్నారు. నిబంధనల ప్రకారం, పేల్చే ముందు రోడ్డు పక్కన కొండలు ఇనుప మెష్‌తో కప్పాల్సి ఉంటుంది. అయితే, కాంట్రాక్టర్ అలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదని వారు ఫిర్యాదు చేస్తున్నారు.

Click on your DTH Provider to Add TV9 Telugu