JEE Main Result 2021: నేడు జేఈఈ మెయిన్స్ ఫలితాలు..? రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలంటే..
JEE Main Result 2021: జేఈఈ మెయిన్ 2021 సెషన్ 4 ఫలితాలు నేడు విడదలయ్యే అవకాశాలున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మెయిన్ ఫలితాలను అధికారిక..

JEE Main Result 2021: జేఈఈ మెయిన్స్ 2021 సెషన్ 4 ఫలితాలు నేడు విడదలయ్యే అవకాశాలున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మెయిన్స్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేస్తుంది. ఈ ఫలితాలు ఈ రోజు రాత్రి 9 గంటలకు విడదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా విద్యార్థులు లక్షల సంఖ్యంలో జేఈఈ (JEE) పరీక్ష రాశారు. ఇప్పటికే జేఈఈ ఆన్సర్ కీ ఆబ్జెక్షన్ రైజింగ్ విండో మూసివేశారు. ఇక పైనల్ ఆన్సర్‌కీ తోపాటు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఒక వేళ ఫలితాలు ప్రకటిస్తే jeemain.nta.nic.in లో అందుబాటులో ఉంటాయి. ఈ ఫలితాల్లో JEE మెయిన్ 2021 మెరిట్(Main) జాబితాను ప్రకటిస్తుంది.
అయితే కొన్ని నివేదికల ప్రకారం.. జేఈఈ మెయిన్ రిజల్ట్ సెప్టెంబర్ 10లోపు జేఈఈ మెయిన్స్ ఫలితాలు ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు ఇది వరకు వార్తలు వచ్చిన నేపథ్యంలో సెప్టెంబర్ 9న రాత్రి విడుదల కానున్నట్లు సమాచారం. చాలా మంది 2019 కన్న ఈ సారి జేఈఈ మెయిన్ పరీక్ష కట్ఆఫ్ ఎక్కుగా ఉంటుందని చెబుతున్నారు. 2019లో జేఈఈ మెయిన్ జనరల్ కేటగిరి కట్ ఆఫ్ 89.5 శాతంగా ఉంది. ఈ ఏడాది విద్యా నిపుణుల అంచనా ప్రకారం 90 లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చని భావిస్తున్నారు.
ఫలితాలను చెక్ చేసుకోండిలా..
ముందుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లి జేఈఈ మెయిన్స్ రిజల్ట్ 2021 లింక్‌పై క్లిక్ చేయాలి. తర్వాత అక్కడ పూర్తి వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత మీ రిజల్ట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.