Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kisan Vikas Patra: పోస్టాఫీసులో అదిరిపోయే పథకం.. ఇందులో రూ.1 లక్ష పెట్టుబడికి రూ. 2 లక్షలు పొందవచ్చు

Kisan Vikas Patra: చేతిలో డబ్బులు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. స్టాక్ మార్కెట్, స్మాల్ సేవింగ్..

Kisan Vikas Patra: పోస్టాఫీసులో అదిరిపోయే పథకం.. ఇందులో రూ.1 లక్ష పెట్టుబడికి రూ. 2 లక్షలు పొందవచ్చు
Follow us
Subhash Goud

|

Updated on: Sep 09, 2021 | 6:51 PM

Kisan Vikas Patra: చేతిలో డబ్బులు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. స్టాక్ మార్కెట్, స్మాల్ సేవింగ్ స్కీమ్స్, బ్యాంకులు ఇలా మీకు నచ్చిన చోట్ల డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రిస్క్ లేకుండా కచ్చితమైన రాబడి పొందాలని భావిస్తే మాత్రం స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో డబ్బులు పెట్టడం మంచిది. ఇక పోస్టాఫీసుల్లో కూడా చాలా రకాల స్కీమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో కిసాన్ వికాస్ పత్ర అనే పథకం కూడా ఒకటుంది. ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల రెట్టింపు డబ్బులు పొందవచ్చు. మీరు దీర్ఘకాలంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే.. ఈ స్కీమ్‌లో చేరవచ్చు. బ్యాంకుల్లో వచ్చే వడ్డీ కంటే ఈ పథకంలో అన్వెస్ట్‌ చేస్తే ఎక్కువ లాభాలు పొందవచ్చు. మీ డబ్బు 124 నెలల్లో రెట్టింపు అవుతుంది. మంచి రాబడి పొందాలనుకునేవారికి ఈ పథకం ఎంతో మంచిది.

124 నెలల్లో రెట్టింపు డబ్బు..

ఈ పథకంలో మీ డబ్బుకు 6.9 శాతం వడ్డీ లభిస్తుంది. పెట్టిన పెట్టుబడి మొత్తం 124 నెలల్లో అంటే 10 సంవత్సరాల 4 నెలల్లో రెట్టింపు అవుతుంది. మీరు 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే 124 నెలల తర్వాత మీ డబ్బు 2 లక్షల రూపాయలు అవుతుంది. ఈ స్కీమ్‌లో కనీసం రూ.1000 నుంచి పెట్టుబడి పెట్టాలి. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. కనీసం 18 ఏళ్ల వయసు కలిగిన వారు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. రూ.1000, రూ.5 వేలు, రూ.10 వేలు, రూ.50 వేలు ఇలా మీకు నచ్చిన మొత్తంలో కిసాన్ వికాస్ పత్రాలను కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకు మీరు రూ.లక్ష పెడితే మెచ్యూరిటీ సమయంలో చేతికి రూ.2 లక్షలు వస్తాయి. వడ్డీ రేట్ల విషయాలలో మూడు నెలలకోసారి మారుతూ ఉండవచ్చు. కేంద్ర ప్రభుత్వం త్రైమాసికం చొప్పున వడ్డీ రేట్లను సమీక్షిస్తూ ఉంటుంది. అందువల్ల రేట్లలో మార్పు ఉండవచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు.

► కిసాన్‌ వికాస్‌ పత్ర పథకంలో పెట్టుబడి పెట్టేందుకు కనీస వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

► సింగిల్‌, జాయింట్‌లో ఏదైనా ఖాతా తెరవవచ్చు. ఇందులో గరిష్టంగా ముగ్గురు పెద్దలు ఉమ్మడి ఖాతాను తెరవవచ్చు. పిల్లల పేరిట ఖాతా తెరవాలంటే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.

► ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలంటే ఏదైనా పోస్టాఫీసులో ఖాతా తెరవవచ్చు. దరఖాస్తుదారు ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, ఓటర్‌ ఐడి కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్ట్‌ వంటి గుర్తింపు పత్రాలు తప్పనిసరి.

► కిసాన్‌ వికాస్‌ పత్ర స్కీమ్‌లో నామినీ ఎంపిక కూడా ఉంటుంది.

మెచ్యూరిటీపై డబ్బు ఎలా తీసుకోవాలి..?

మెచ్యూరిటీ మొత్తాన్ని పథకం గడువు పూర్తయిన తర్వాత ఏదైనా పోస్ట్‌ ఆఫీస్‌ నుంచి పొందవచ్చు. దీని కోసం లబ్దిదారుడు తన గుర్తింపు కార్డులతో పాటు, పథకానికి సంబంధించిన స్లిప్‌లు చూపించాల్సి ఉంటుంది. ఒక వేళ లబ్దిదారుడికి గుర్తింపు పత్రాలు లేకపోతే కిసాన్‌ వికాస్‌ పత్ర సర్టిఫికేట్‌ను తీసుకుని మీ పోస్టాఫీసు నుంచి మాత్రమే మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు.

ఇవీ కూడా చదవండి:

Amazon FD: అమెజాన్ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. అందుబాటులోకి రానున్న కొత్త సేవలు..!

Mobile Apps: అగ్రరాజ్యాలను వెనక్కినెట్టి రికార్డు సృష్టించిన భారత్‌.. గంటలపాటు యాప్స్‌లోనే..

Lottery Tax: మీకు లాటరీలో డబ్బులు వచ్చాయా?.. ఎంత ట్యాక్స్‌ కట్టాలో తెలుసుకోండి..!