Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon FD: అమెజాన్ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. అందుబాటులోకి రానున్న కొత్త సేవలు..!

Amazon FD: దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్‌ తాజాగా వినియోగదారులకు గుడ్‌న్యూస్‌ అందించింది. గూగుల్‌ పయనించే దారిలో వెళ్తోంది. అమెజాన్‌ పే కూడా కస్టమర్లకు..

Amazon FD: అమెజాన్ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. అందుబాటులోకి రానున్న కొత్త సేవలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Sep 09, 2021 | 6:18 PM

Amazon FD: దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్‌ తాజాగా వినియోగదారులకు గుడ్‌న్యూస్‌ అందించింది. గూగుల్‌ పయనించే దారిలో వెళ్తోంది. అమెజాన్‌ పే కూడా కస్టమర్లకు ఇన్వెస్ట్‌మెంట్‌ సర్వీసులను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ సేవల కోసం ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్లాట్‌ఫామ్‌ కువేరా సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అమెజాన్ ఇందులో భాగంగా కస్టమర్లకు వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసులు అందించనుంది. అంటే కస్టమర్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) సేవలు కూడా ఆఫర్ చేయనుందని చెప్పవచ్చు.

ఇంకా మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే అమెజాన్ పే కన్నా ముందే గూగుల్ పే.. కస్టమర్ల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ సేవలు అందించేందుకు బ్యాంకులతో జతకట్టిన విషయం తెలిసిందే. ఈక్విటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో గూగుల్ పే భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇక తాజాగా ఇలాంటి సేవలు అమెజాన్‌ కూడా అందుబాటులోకి తీసుకురానుంది.

మేము పెట్టుబడిదారుల కోసం అమెజాన్‌లో అత్యంత సులభమైన ఫీచర్‌ ప్లాట్‌ఫామ్‌ను నిర్మించాము. అమెజాన్ పే ఇండియాతో క‌లిసి ఈ కార్యక్రమం నిర్వహించ‌డం ద్వారా మ‌రింత బాగా భారత్‌లో ఈ కార్యక్రమం నిర్వహించాలని అనుకుంటున్నాం అని కువెరా.ఇన్‌(Kuvera.in) వ్యవస్థాపకుడు, సీఈవో గౌరవ్ రస్తోగి వెల్లడించారు.

ప్రస్తుతం అమెజాన‌కు 600 మిలియ‌న్ వినియోగ‌దారులు ఉన్నారు. అయితే ఇండియా లాంటి దేశాల్లో 30, 40 మిలియన్ వినియోగదారులు మాత్రమే నాణ్యమైన పెట్టుబడి పెట్టగ‌ల‌ర‌ని అంచ‌నా కువేరా అనేది సెబీ(SEBI) రిజిస్టర్ కంపెనీ. ప్రస్తుతం పెట్టుబడులు, రుణాల రూపంలో ఈ సంస్థ రూ. 28,000 కోట్ల ఆస్తులు క‌లిగి ఉంది. అయితే ప్రతి భారతీయుడికి ఆర్థిక చెల్లింపులు సులభతరం చేయడంతోపాటు పెట్టుబడి విధానాలను సరళీకరించి ప్రజలను ఆర్థికంగా ఎదిగేలా చేయడమే లక్ష్యమని అమెజాన్‌ పే ఇండియా డైరెక్టర్‌ వికాస్ బన్సాల్ పేర్కొన్నారు.

ఇవీ కూడా చదవండి:

Mobile Apps: అగ్రరాజ్యాలను వెనక్కినెట్టి రికార్డు సృష్టించిన భారత్‌.. గంటలపాటు యాప్స్‌లోనే..

Mercedes Benz: టెస్లాకు పోటీగా మరో సరికొత్త ఎలక్ట్రిక్‌ కారు.. ఒక్కసారి చార్జింగ్‌తో 660 కిలో మీటర్లు

Lottery Tax: మీకు లాటరీలో డబ్బులు వచ్చాయా?.. ఎంత ట్యాక్స్‌ కట్టాలో తెలుసుకోండి..!