Ola Electric Scooter: ఓలా స్కూటర్ అమ్మకాలు వాయిదా పడ్డాయి.. ఎందుకో తెలుసా? ఈ విషయంపై ఓలా సీఈవో ఏం చెబుతున్నారు?

హడావుడి.. హంగామా ఏదైనా అనండి.. ఈ మధ్యకాలంలో ఆటోమొబైల్స్ రంగంలో ఓలా సృష్టించిన ఒక విధమైన హైప్ ఏ ఇతర కంపెనీ నుంచి రాలేదు.

Ola Electric Scooter: ఓలా స్కూటర్ అమ్మకాలు వాయిదా పడ్డాయి.. ఎందుకో తెలుసా? ఈ విషయంపై ఓలా సీఈవో ఏం చెబుతున్నారు?
Ola Electric Scooter

Ola Electric Scooter: హడావుడి.. హంగామా ఏదైనా అనండి.. ఈ మధ్యకాలంలో ఆటోమొబైల్స్ రంగంలో ఓలా సృష్టించిన ఒక విధమైన హైప్ ఏ ఇతర కంపెనీ నుంచి రాలేదు. తన ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మొదటి ప్రకటన చేసింది మొదలు.. దాని ప్రీ బుకింగ్స్ ప్రారంభం.. వాహనాల డెలివరీ కోసం కంపెనీ ఎన్నుకున్న డిజిటల్ విధానం.. వాహనాలకు రుణ సౌకర్యాలను కల్పించడానికి చేసిన ఏర్పాట్లు.. ఇలా ప్రతి అంశం సంచలనం సృష్టించాయి. కానీ, తన అమ్మకాలను ప్రారంభించే ముహూర్త సమయంలో మాత్రం ఓలా ఇబ్బంది ఎదుర్కుంది. అనుకున్న సమయానికి ఓలా తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాన్ని ప్రారంభించలేకపోయింది.

ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్ల అమ్మకాలు వాయిదా పడ్డాయి. దేశవ్యాప్తంగా వినియోగదారులను విపరీతంగా ఆకర్షించిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు బుధవారం ప్రారంభం కావలసి ఉంది. కానీ, ప్రారంభం కాలేదు. కంపెనీ తన విక్రయాల వెబ్‌సైట్‌తో సాంకేతిక లోపం ఎదుర్కొంది. దీని ఫలితంగా S1, S1 ప్రో స్కూటర్ల అమ్మకాల ప్రారంభం నిలిచిపోయింది. ఈ విషయాన్ని ఓలా సీఈవో భవిష్య అగర్వాల్ అధికారికంగా ప్రకటించారు. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మకాలు సెప్టెంబర్ 15 నుండి మొదలవుతాయని ఆయన తెలిపారు.

ఎస్ 1 అమ్మకాలు వాయిదా పడిన తర్వాత ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భావిష్ అగర్వాల్ జారీ చేసిన పూర్తి ప్రకటన ఇదే!

 

“మా ఓలా ఎస్ 1 స్కూటర్ అమ్మకాలు ప్రారంభించడానికి మేము కట్టుబడి ఉన్నాము. కానీ దురదృష్టవశాత్తు, ఈ రోజు అమ్మకాల కోసం మా వెబ్‌సైట్‌ను ప్రత్యక్షంగా రూపొందించడంలో మాకు అనేక సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి. చాలా గంటలు వేచి ఉండాల్సి వచ్చినందుకు మీ అందరికీ నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. వెబ్‌సైట్ నాణ్యత మా అంచనాలను అందుకోలేదు. మేము మిమ్మల్ని నిరాశపరిచామని నాకు తెలుసు. ఇంత నిరాశపరిచిన అనుభవం కలిగించినందుకు మీలో ప్రతి ఒక్కరికీ నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను “అని ఆయన ప్రకటించారు.

ఓలా ఎలక్ట్రిక్ పూర్తిగా డిజిటల్ కొనుగోలు ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసింది. ఇందులో ఎలాంటి కాగితపు పని లేకుండా పూర్తిగా డిజిటల్ రుణ ప్రక్రియ ఉంటుంది. తన ప్రకటనలో అగర్వాల్ ఇంకా ఇలా చెప్పారు.. “మేము అద్భుతమైన డిజిటల్ కొనుగోలు ప్రయాణాన్ని మీకు అందించాలనుకుంటున్నాము. ఈ రోజు ఆ పని మేము చేయలేకపోయాము. మీరు సరైన అనుభవాన్ని పొందేలా చేయడానికి మాకు మరో వారం పడుతుంది. మేము ఇప్పుడు 15 సెప్టెంబర్, 8 AM నుండి మా అమ్మకాలను ప్రారంభిస్తున్నామని మీకు తెలియజేయాలనుకుంటున్నాను.”

ఓలా S1, S1 ప్రో స్కూటర్ల రిజర్వేషన్, డెలివరీ తేదీ మారకుండా ఉంటుందని ఓలా CEO కూడా వినియోగదారులకు హామీ ఇచ్చారు. “మీ రిజర్వేషన్, కొనుగోలు క్యూలో మీ స్థానం మారదు. కాబట్టి మీరు ముందుగా రిజర్వ్ చేసినట్లయితే, మీరు దానిని ముందుగా కొనుగోలు చేయవచ్చు. మా డెలివరీ తేదీలు కూడా మారవు” అని ఆయన అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.

ఎవరెన్ని చెప్పినా.. కారాణాలు ఏమైనా.. ఓలా స్కూటర్ అమ్మకాల వాయిదా ప్రకటన వినియోగదారుల్లో మిశ్రమ స్పందన తీసుకువచ్చింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై విపరీతమైన ట్రోలింగ్ ప్రారంభం అయింది. చాలా మంది ఈ అమ్మకాల ముహూర్తం ఆగిపోవడానికి ఓలా సీఈవో భవిష్య అగర్వాల్ తొందరపాటే కారణం అని అంటున్నారు. కొద్దిగా ఆలస్యం అయినా జాగ్రత్తగా స్కూటర్ అమ్మకాలు ప్రారంభించి ఉంటె బావుండేదని వారు అంటున్నారు. కొందరు వినియోగదారులు మాత్రం ఈ విషయంలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు.

Also Read: Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. 18 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్‌.. మైలేజీ ఎంతంటే..?

OLA e-Scooter: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్..ఇది చాలా ఖరీదు..ధర కారణంగా బుకింగ్ రద్దు చేసుకోవాలంటే ఇలా చేయండి!

Click on your DTH Provider to Add TV9 Telugu