Mobile Apps: అగ్రరాజ్యాలను వెనక్కినెట్టి రికార్డు సృష్టించిన భారత్‌.. గంటలపాటు యాప్స్‌లోనే..

Mobile Apps: భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌లలో వివిధ రకాల యాప్స్‌ వాడే వారి సంఖ్య పెరిగిపోతోంది. స్మార్ట్‌ఫోన్‌లలో వివిధ రకాల యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడంలో..

Mobile Apps: అగ్రరాజ్యాలను వెనక్కినెట్టి రికార్డు సృష్టించిన భారత్‌.. గంటలపాటు యాప్స్‌లోనే..
Follow us
Subhash Goud

|

Updated on: Sep 09, 2021 | 4:28 PM

Mobile Apps: భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌లలో వివిధ రకాల యాప్స్‌ వాడే వారి సంఖ్య పెరిగిపోతోంది. స్మార్ట్‌ఫోన్‌లలో వివిధ రకాల యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడంలో భారత ప్రజలు ముందున్నారు. స్మార్ట్‌ఫోన్‌ ఉందంటే చాలు.. ప్రతినిత్యం అందులోనే గడిపేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇక తాజాగా ప్రపంచంలో ఇతర దేశాలను సైతం వెనక్కినెట్టి భారత్‌ సరికొత్త రికార్డులను సృష్టించింది. స్మార్ట్‌ఫోన్‌ యాప్‌లను అత్యధికంగా డౌన్‌లోడ్‌ చేసిన దేశంగా భారత్‌ నిలిచింది. యాప్‌ అన్నీ రూపొందించిన ఎవల్యూషన్‌ ఆఫ్‌ సోషల్‌ యాప్స్‌ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా మొబైల్‌ యాప్స్‌కు భారత్‌ అతి పెద్ద మార్కెట్‌గా నిలుస్తోందని వెల్లడించింది. ఈ ఏడాది ప్రథమార్థంలో యాప్స్‌ డౌన్‌లోడ్‌ విషయంలో భారత్‌ మొదటి స్థానంలో నిలిచింది. యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేయడమే కాదు.. సోషల్‌ మీడియా యాప్స్‌లో ఎక్కువ సమయం పాటు గడుపుతున్న వారిలో భారత్‌ రెండో స్థానంలో నిలువడం గమనార్హం.

యాప్స్‌ డౌన్‌లోడ్‌ విషయంలో ఆసియా ఖండం 60 శాతం మేర ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అందులో1.5 బిలియన్లకు పైగా యాప్‌ డౌన్‌లోడ్‌లతో భారత్‌ ముందుంది. భారత్‌ యాప్‌ డౌన్‌లోడ్స్‌ విషయంలో 2018 నుంచి అమెరికాను సైతం అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా 2010 నుంచి ఇప్పటి వరకు స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు 70 బిలియన్ల మేర యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. 2021లో 4.7 బిలియన్ యాప్‌లు డౌన్‌లోడ్ అయ్యాయి.

భారత్‌లో ఎమ్‌ఎక్స్‌ టాకటాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, జోష్‌, మోజ్‌, స్నాప్‌చాట్‌ యాప్‌లను స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు అత్యధికంగా డౌన్‌లోడ్ చేసినట్లు యాప్‌ ఆన్నీ వెల్లడించింది. ఈ ఏడాది ప్రథమార్ధంలో పలు సోషల్‌ మీడియా యాప్స్‌లో యూజర్లు 740 బిలియన్ గంటల మేర గడిగడిపారు.

యూట్యూబ్‌లో కూడా ఎక్కువ మంది..

కాగా, భారత్‌లో యూజర్లు సుమారు 160 బిలియన్‌ గంటల పాటు సోషల్‌ మీడియా యాప్స్‌లో గడిపినట్లు యాప్‌ ఆన్నీ వెల్లడించింది. ఇడియాలో అధికంగా యూట్యూబ్, వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్రూకాలర్‌ యాప్స్‌లో ఎక్కువ సమయంపాటు గడుపుతున్న యాప్స్‌గా నిలిచాయి. అలాగే యూట్యూబ్‌ భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది యూజర్లు వాడుతున్న యాప్‌గా యూట్యూబ్‌ నిలిచింది.

ఇవీ కూడా చదవండి:

Lottery Tax: మీకు లాటరీలో డబ్బులు వచ్చాయా?.. ఎంత ట్యాక్స్‌ కట్టాలో తెలుసుకోండి..!

Debit Cards: ఇంటర్నెట్‌ లేకున్నా డెబిట్‌ కార్డు వాడవచ్చు.. అందుబాటులోకి రానున్న కొత్త టెక్నాలజీ..!