- Telugu News Photo Gallery Business photos Lottery Tax: do you won huge cash on lottery know about .. indian government tax rules on lottery or gifts
Lottery Tax: మీకు లాటరీలో డబ్బులు వచ్చాయా?.. ఎంత ట్యాక్స్ కట్టాలో తెలుసుకోండి..!
Lottery Tax: భారత్‌లోని వ్యక్తులు, వివిధ సంస్థలు సంపాదించే డబ్బులపై ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏ మార్గాల ద్వారా సంపాదించిన డబ్బుకు పన్ను..
Updated on: Sep 08, 2021 | 8:47 PM

Lottery Tax: భారత్‌లోని వ్యక్తులు, వివిధ సంస్థలు సంపాదించే డబ్బులపై ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. డబ్బు ఏ మార్గాల ద్వారా సంపాదించినా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కొన్నింటికి మాత్రమే పన్ను మినహాయింపు ఉంటుంది. దీనికి సంబంధించి ఆదాయపన్ను చట్టంలో నియమ నిబంధనలు ఉన్నాయి. ఎలాంటి మార్గాల్లో ఎంత మొత్తంలో ఆదాయం వచ్చిందనే అంశాలపై ట్యాక్స్ రేట్లపై ఆధారపడి ఉంటాయి. ఇక లాటరీ ద్వారా అందిన సంపదపై సైతం ట్యాక్స్ కట్టాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.

ఆదాయపన్ను చట్టంలో మార్గదర్శకాల ప్రకారం.. లాటరీ రూపంలో లేదా అలాంటి మార్గాల ద్వారా అందుకున్న అన్ని రకాల ఆదాయం, వస్తువుల విలువపై ట్యాక్స్ వర్తిస్తుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 115BB కింద దీనికి 30 శాతం ఫ్లాట్ రేటుతో ట్యాక్స్ వర్తిస్తుందని ఆర్థిక నిపుణులు వివరిస్తున్నారు.

లక్కీ డ్రాలో గెలుచుకున్న మోటార్ కారు, బైక్, ఇతర మోటారు వాహనాలు కూడా లాటరీ విభాగంలోకి వస్తాయి. అందువల్ల ఈ మోటార్ కారు విలువ నుంచి డెవలపర్ ట్యాక్స్ వసూలు చేయవచ్చు.

కారు గెల్చుకున్న వ్యక్తి రిటర్నులు దాఖలు చేసేటప్పుడు.. ఇలాంటి ఆదాయాన్ని కూడా అందులో చేర్చాల్సి ఉంటుంది. అయితే దీనికి టీడీఎస్ పొందవచ్చు. కానీ లక్కీ డ్రా ద్వారా వచ్చే ఆదాయంపై 30 శాతం ట్యాక్స్ వర్తిస్తుంది. టీడీఎస్ రేటు కూడా అంతే ఉంటుంది.

అందుకే ఏదైనా బహుమతి గెల్చుకున్న వారు రీఫండ్ ఆశించకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. అయితే లబ్ధిదారుడు లక్కీ డ్రాలో గెల్చుకున్న కారు విలువతో కలిపి అతడి మొత్తం ఆదాయం రూ .5 లక్షల లోపు ఉంటే.. ఐటీ చట్టంలోని సెక్షన్ 87A ప్రకారం అతడు రూ.12,500 వరకు రిబేట్ పొందవచ్చు.





























