AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mercedes Benz: టెస్లాకు పోటీగా మరో సరికొత్త ఎలక్ట్రిక్‌ కారు.. ఒక్కసారి చార్జింగ్‌తో 660 కిలో మీటర్లు

Mercedes Benz: ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. వివిధ వాహనాల తయారీ కంపెనీలు కూడా..

Mercedes Benz: టెస్లాకు పోటీగా మరో సరికొత్త ఎలక్ట్రిక్‌ కారు.. ఒక్కసారి చార్జింగ్‌తో 660 కిలో మీటర్లు
Subhash Goud
|

Updated on: Sep 09, 2021 | 2:34 PM

Share

Mercedes Benz: ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా వాహనదారులు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. వివిధ వాహనాల తయారీ కంపెనీలు కూడా ఈవీ వాహనాలను తయారు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక ఎలక్ట్రిక్‌ వాహన విభాగంలో పేరున్న టెస్లాకు  ప్రపంచవ్యాప్తంగా ఆదరణ అంతాఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహన మార్కెట్‌లో టెస్లా సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ, రికార్డు సృష్టిస్తోంది టెస్లా. ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో టెస్లాకు పోటీగా ఇప్పటికే ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీలు సిద్ధమైయ్యాయి.

తాజాగా జర్మనీలో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ ఆటో మొబిలీటీ షోలో ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడిజ్‌ బెంజ్‌ తన కంపెనీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్‌ కారును విడుదల చేసింది. మెర్సిడిజ్‌ ఈక్యూఈ ఎలక్ట్రిక్‌ సెడాన్‌ కారును ఐఏఏ మొబిలిటీ 2021 షోలో మెర్సిడిజ్‌ ప్రదర్శనకు ఉంచింది. ఈ కారు ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజ సంస్థ టెస్లా కంపెనీకి చెందిన టెస్లా ఎస్‌ మోడల్‌ కారుకు పోటీగా నిలువనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.

2022 ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో..

ప్రపంచవ్యాప్తంగా 2022 సంవత్సరంలో ఈ కారు కొనుగోలుదారులకు అందుబాటులోకి రానుంది. మెర్సిడిజ్‌ ఈక్యూఈ ఎలక్ట్రిక్‌ సెడాన్‌ కారు ఒక్క సారి చార్జింగ్ తో సుమారు 660 కిమీ ప్రయాణించవచ్చునని కంపెనీ తెలిపింది. ఈ కారులో 90కేడబ్ల్యూహెచ్‌ (kWh) బ్యాటరీ పొందుపర్చారు. డీసీ చార్జింగ్‌ కెపాసిటీలో భాగంగా 170kW బ్యాటరీని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా 430 లీటర్ల బూట్‌ స్పేస్‌ను అందించనుంది. మార్కెట్‌లోకి రెండు వేరియంట్లలో ఈ కారు విడుదల చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం పోటా పోటీగా వివిధ కంపెనీలు ఎలక్ట్రిక్‌ కార్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ఎలక్ట్రిక్‌  వాహనాలు అందుబాటులోకి వస్తే పెట్రోల్‌, డీజిల్‌ బాధ తప్పుతుంది. చమురు ధరలు పెరుగుతుండటంతో చాలా మంది ఇలాంటి వాహనాల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇక ఇప్పటికే ఓలా, ఇతర ద్విచక్ర వాహనాల కంపెనీలు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.

ఇవీ కూడా చదవండి:

Lottery Tax: మీకు లాటరీలో డబ్బులు వచ్చాయా?.. ఎంత ట్యాక్స్‌ కట్టాలో తెలుసుకోండి..!

Indian Railways: ఆలస్యంగా చేరుకున్న రైలు.. రూ.30వేల పరిహారం చెల్లించాలని సుప్రీం ఆదేశం