Bitcoin: ఉక్రెయిన్ గుర్తింపుతో బిట్‌కాయిన్ పరుగులకు నయా జోష్.. మరోసారి 46 వేల డాలర్లకు..
క్రిప్టోకరెన్సీలో మార్కెట్ల ఒడిదొడుకులకు కొంత బ్రేక్ పడింది. కొద్ది రోజులుగా నేల చూపులు చూస్తున్న డిజిటిల్ కర్సెన్సీ బిట్‌కాయిన్ తాజాగా పుంజుకుంది.

క్రిప్టోకరెన్సీలో మార్కెట్ల ఒడిదొడుకులకు కొంత బ్రేక్ పడింది. కొద్ది రోజులుగా నేల చూపులు చూస్తున్న డిజిటిల్ కర్సెన్సీ బిట్‌కాయిన్ తాజాగా పుంజుకుంది. మార్కెట్ కొద్దిగా దూడుకు మొదలవడంతో పెట్టుబడిదారుల్లో కూడా ఉత్సాహం కనిపిస్తోంది. బిట్‌కాయిన్‌తోపాటు దాదాపు అన్ని ప్రధాన క్రిప్టోకరెన్సీలు గ్రీన్ మార్క్‌లో ట్రేడవుతున్నాయి. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాప్ గత 24 గంటల్లో 3 శాతం పెరిగింది. బిట్‌కాయిన్‌లో కొత్త జోష్‌కు కారణాలకు మార్కెట్ నిపుణులు వివరణ ఇచ్చారు. గురువారం రోజు అది $ 46 వేలకు మించి ట్రేడవుతోంది. ఇవాళ అది 3 శాతం పెరుగుదలను చూపిస్తోంది. ప్రపంచ క్రిప్టో మార్కెట్‌లో బిట్‌కాయిన్ వాటా 1 శాతం పెరిగి 45.76 శాతానికి పెరిగింది.
బిట్‌కాయిన్…
రాయిటర్స్ అందించిన సమాచారం మేరకు.. బిట్‌కాయిన్‌పై చట్టాన్ని ఉక్రెయిన్ పార్లమెంట్ ఆమోదించింది. క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌ను చట్టబద్ధం చేస్తుంది. ఉక్రెయిన్ పార్లమెంటులో మొత్తం 276 మంది ఎంపీలు ఈ బిల్లుకు మద్దతు ఇచ్చారు. అయితే ఆరుగురు ఎంపీలు మాత్రమే వ్యతిరేకించారు. ఈ బిల్లు వెనుక ప్రధాన ఉద్దేశం క్రిప్టోకరెన్సీలపై వారి దృక్పథాన్ని స్పష్టం చేయడం. బిట్‌కాయిన్ కొనుగోలుదారులను కాపాడటం.. బిట్‌కాయిన్ పై పెట్టుబడులు పెట్టడం ఇక ముందు ఆదేశంలో చట్టవిరుద్ధం కాదు.
ప్రపంచంలోని టాప్ 10 క్రిప్టోకరెన్సీల ధరలు సెప్టెంబర్ 09 నాటికి 14:45 pm (ఈ గణాంకాలు coinmarketcap.com నుండి తీసుకోబడ్డాయి)
- Bitcoin: : గత 24 గంటల్లో $ 46,504.44 వద్ద 3 శాతం వరకు ఉంది.
- Ethereum: గత 24 గంటల్లో ఇది 6 శాతం పెరిగి $ 3532 వద్ద ఉంది.
- Tether: గత 24 గంటల్లో ఇది 0.50 శాతం పెరిగి $ 1 వద్ద ఉంది.
- Binance Coin: గత 24 గంటల్లో ఇది 5 శాతం పెరిగి $ 418.8 వద్ద ఉంది.
- Cardano: గత 24 గంటల్లో ఇది 12 శాతం పెరిగి 2.61 డాలర్లకు చేరుకుంది.
- XRP: గత 24 గంటల్లో ఇది 6 శాతం పెరిగి $ 1.13 వద్ద ఉంది.
- USD Coin: గత 24 గంటల్లో ఇది $ 1 వద్ద 0.05 శాతం పెరిగింది.
- Dogecoin: గత 24 గంటల్లో ఇది 5.5 శాతం పెరిగి 0.25 డాలర్ల వద్ద ఉంది.
- Polkadot: గత 24 గంటల్లో ఇది 10 శాతం పెరిగి 29.38 డాలర్లకు చేరుకుంది.
- Uniswap: గత 24 గంటల్లో ఇది 10 శాతం పెరిగి 24.26 డాలర్లకు చేరుకుంది.
ఉక్రెయిన్ కంటే ముందు ఎల్ సాల్వడార్ కూడా బిట్‌కాయిన్‌ను గుర్తించింది. బిట్‌కాయిన్‌తో లావాదేవీల వ్యవస్థను సజావుగా అమలు చేయడానికి వాలెట్ కీమోను ప్రారంభించింది. ఆ దేశ గుర్తింపు కార్డులోని ID నంబర్‌తో నమోదు చేసుకుంటే వినియోగదారుడికి $ 30 విలువ చేసే ఉచిత కరెన్సీని లభిస్తాయి. బిట్‌కాయిన్‌కు సంబంధించి ఎల్ సాల్వడార్ చేసిన ప్రయోగం విజయవంతమైతే.. ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా అనుసరించే ఛాన్స్ ఉంది.
అయితే, భారతదేశంలో ఇది జరిగే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. దేశంలో క్రిప్టోకరెన్సీకి బదులుగా బిట్‌కాయిన్‌కు కమోడిటీ హోదాను ఇవ్వడాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
బిట్ కాయిన్లను ఇలా కొనాలి ?
బిట్ కాయిన్లలో పెట్టుబడి పెట్టేందుకు చాలా ఎక్స్‌ఛేంజ్‌లు ఉన్నాయి. వాటిలో https://wazirx.com అనేది కూడా ఒకటి. ఇందులో రూ.100కే బిట్ కాయిన్ ట్రేడ్ చేసే ఛాన్స్ ఉంది. ఇందుకోసం వెబ్‌సైట్‌లోకి వెళ్లాక… సైన్ అప్ (Sign Up) అవ్వాల్సి ఉంటుంది. అంటే పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. నెక్ట్స్ KYC వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఆధార్ నంబర్, ప్యాన్ కార్డ్ నంబర్, బర్త్ డే వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో మీ పూర్తి వివరాలు వజీర్ ఎక్స్ సైట్‌కి చేరతాయి కాబట్టి… మీకు ట్రేడింగ్ చేసేందుకు అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం మీరు వజీర్ ఎక్స్ సైట్‌లోని మీ అకౌంట్‌లో కొంత మొత్తం దాచుకోవాల్సి ఉంటుంది. కనీసం రూ.100 వేస్తే… ఆ రూ.100తో మీరు బిట్ కాయిన్‌పై ట్రేడింగ్ మొదలుపెట్టవచ్చు.
ఇవి కూడా చదవండి: Apple Ice Cream : రుచికరమైన యాపిల్ ఐస్ క్రీమ్‌ను ఇంట్లో ప్రయత్నించి చూడండి.. చాలా ఈజీ..